Tirupati:తొక్కిసలాట వెనుక అనుమానాలు

The stampede in Tirupati in which six people died has shocked everyone

తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించిన ఘటన అందరినీ కలచి వేసింది. నిజంగా ఇది దురుదృష్టకరమే. కానీ ఇందులో గత ప్రభుత్వం నిర్వాకం కారణం కూడా ఉందన్నది వాస్తవం. గతంలో ఎన్నడూ లేని విధంగా 2019 నుంచి 2024 మధ్య కాలంలోనే తిరుమలలో ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. గతంలో వైకుంఠ ఏకాదశికి ఒకరోజు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉండేది. అదీ కాకుంటే మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ దర్శనాలు కొనసాగేవి.

తొక్కిసలాట వెనుక అనుమానాలు

తిరుపతి, జనవరి 10
తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించిన ఘటన అందరినీ కలచి వేసింది. నిజంగా ఇది దురుదృష్టకరమే. కానీ ఇందులో గత ప్రభుత్వం నిర్వాకం కారణం కూడా ఉందన్నది వాస్తవం. గతంలో ఎన్నడూ లేని విధంగా 2019 నుంచి 2024 మధ్య కాలంలోనే తిరుమలలో ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. గతంలో వైకుంఠ ఏకాదశికి ఒకరోజు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉండేది. అదీ కాకుంటే మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ దర్శనాలు కొనసాగేవి. భక్తుల రద్దీని బట్టి వైకుంఠ ద్వార దర్శనాన్ని పొడిగించేవారు. కానీ గత ప్రభుత్వం దీనిని పూర్తిగా మార్చివేసింది. వైకుంఠ ద్వార దర్శనాన్ని పది రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల భక్తులకు సౌకర్యం కల్పించడం మాట దేముడెరుగు కానీ.. టీటీడీ ఆదాయాన్ని పొందడానికేనన్నది వాస్తవం. ఎంత మంది భక్తులు వస్తే అంత హుండీ నిండుతుందన్న కారణంతోనే అత్యాశతో గత ప్రభుత్వం ఈ ఆనవాయితీని తొలిసారిగా ప్రారంభించింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిని కంటిన్యూ చేసింది. దీంతో పాటు గత ప్రభుత్వం వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లను తిరుపతిలో ఇచ్చే ప్రక్రియను కూడా ప్రారంభించింది. అసలు తిరుమలలో శ్రీవెకంటేశ్వరస్వామి కొలువై ఉంటే తిరుపతిలో టిక్కెట్లను ఎందుకు విక్రయిస్తున్నారన్నది ఆ వెంకటేశ్వరస్వామికే ఎరుక. ఈ సంప్రదాయాన్ని కూడా ఈ పాలకమండలి కంటిన్యూ చేయడంతోనే ఈ ఘోర దుర్ఘటన తలెత్తింది. నిజానికి తిరుమలలో ఎన్ని గంటలైనా భక్తులు వేచి చూస్తూ క్యూ లైన్ లో శ్రీవారిని దర్శంచుకునే వారు. అక్కడ తొక్కిసలాట సమస్య ఉండదు. బ్రహ్మోత్సవాల సమయంలోనూ తిరుమలకు లక్షల సంఖ్యలో గరుడ వాహన సేవరోజు వచ్చినా ఇలాంటి దుర్ఘటన ఎన్నడూ జరగలేదు.కారణంగానే ఈ ఘటన జరిగిందని చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సయితం అంగీకరించారు. అది ఈ పాలకవర్గం చేసిన తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మరొక అనుమానం కూడా అందరిలోనూ నెలకొంది. కావాలని ఈ దుర్ఘటనకు బాధ్యులు అయిన వారు పోలీసుల్లో ఉన్నారా? అన్న అనుమానం కూడా పాలకపక్షం నుంచి వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు ఇదే రకమైన అనుమానాలను వ్యక్తం చేశారు. పోలీసులు పదకొండు వందల మంది అక్కడ ఉన్నప్పటికీ దుర్ఘటన జరిగిందంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందన్న వారి అనుమానాన్ని జ్యుడిషియల్ విచారణలోనే తేలనుంది. మొత్తం మీద తిరుపతి ఘటనపై జగన్ బ్యాచ్ చుట్టూ అనేక అనుమానాలు కలుగుతున్నాయి.అంటే పోలీసుల్లోనే జగన్ అంటే అభిమానం ఉన్న వారు ఈ పనికి పాల్పడ్డారా? అన్నది విచారణలో తేలనుంది. బుడమేరు విజయవాడను ముంచెత్తినప్పుడు కూడా ఇదే తరహా ఆరోపణలు వినిపించాయి. కృష్ణా బ్యారేజీ వద్ద బోట్లు అడ్డుకట్ట వేసి గేట్లు విరగేటట్లు కొందరు ప్రయత్నం చేశారని అప్పట్లో అధికార పార్టీ నేతలు ఆరోపించారు. ఆ బోటును అక్కడి నుంచి తొలగించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. అలాగే గేటును పునర్నించేందుకు అష్టకష్లాలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా తిరుపతి ఘటనపై కూడా అలాంటి అనుమానాలు కలుగుతున్నాయని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. పోలీసులు కావాలనే తొక్కిసలాటకు కారణమయ్యారని ప్రత్యక్ష సాక్షులతోపాటు బాధితులు కూడా చెబుతున్నారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

Read:Vijayawada:ఆ పది మందికి మంత్రులకు డేంజర్ బెల్స్

Related posts

Leave a Comment