Tirupati:కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్ష (NAKSHA) కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక:కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్ష కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక కాబడిన నేపథ్యంలో పట్టణంలో సర్వే ప్రక్రియ ద్వారా పారదర్శకంగా లోపాలు లేని భూ రికార్డులు తయారయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్ష (NAKSHA) కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక
సర్వే ప్రక్రియ పారదర్శకంగా లోపాలు లేని భూ రికార్డులు తయారయ్యే విధంగా అధికారులు చేపట్టాలి:
జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
తిరుపతి,
కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్ష కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక కాబడిన నేపథ్యంలో పట్టణంలో సర్వే ప్రక్రియ ద్వారా పారదర్శకంగా లోపాలు లేని భూ రికార్డులు తయారయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కచ్చపి ఆడిటోరియం నందు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం నక్ష సర్వే పై వర్క్ షాప్ ను జిల్లా కలెక్టర్ గారు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య, డిప్యూటీ మేయర్ లు ముద్ర నారాయణ, ఆర్ సి మునికృష్ణ, కార్పొరేటర్ అనిత తదితరులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ” నక్షా (NAKSHA) ” భారత ప్రభుత్వ మార్గ నిర్దేశాల మేరకు చేపట్టడం జరుగుతుందని ఈ సర్వే ద్వారా తిరుపతి పట్టణంలోని పలు భూ సంబంధిత రికార్డులు పూర్తిస్థాయిలో పక్కాగ లోపాలు లేనివిగా తయారవ్వాలని సూచించారు. దేశంలోని 150 సిటీ లను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వీటిలో నక్ష అనే ప్రోగ్రాం కింద సర్వే చేపట్టడం జరుగుతుందని అన్నారు. అందులో మన తిరుపతి పట్టణం ఎంపిక కావడం సంతోషం అని అన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా తిరుపతి జిల్లాలో పలు భూ సంబంధిత సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. రీ సర్వేలో చేపట్టిన విధంగానే డ్రోన్ ఫ్లై, ఓ ఆర్ ఐ ఇమేజెస్ తీయడం, గ్రౌండ్ ట్రూథింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్ తదితర ప్రక్రియలు ఉంటాయని తెలిపారు. సదరు నక్ష కార్యక్రమం ద్వారా తిరుపతి పట్టణంలో అధికారులు సర్వే నిర్వహణ చేస్తున్న విషయం సంబంధిత భూమి, ఆస్తి యజమానికి తెలియజేసి ఎలాంటి అపోహలు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడం వలన ఒకే భూమిపై పలు రిజిస్ట్రేషన్లు, రికార్డులు తయారవుతున్నాయని భూ సమస్యలకు ఈ నక్ష కార్యక్రమం మంచి పరిష్కారం అవుతుందని తెలిపారు.తద్వారా భూతగాదాలు తగ్గిపోతాయని తెలిపారు. జిఐఎస్ టెక్నాలజీతో పారదర్శకమైన యాజమాన్య హక్కు రికార్డులు, పట్టణంలో పలు సదుపాయాల కల్పన ప్రణాళికల కొరకు ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఎంతో కచ్చితత్వంతో కూడిన నిర్ణయాలు, ప్రణాళికలు, ల్యాండ్ బ్యాంక్ అందుబాటు ఉన్న వాటిని సక్రమంగా వినియోగించుటకు ఉపయోగపడుతుందని తెలిపారు. సంబంధిత వార్డు అడ్మినిస్ట్రేటర్ మరియు ఎమినిటీస్ సెక్రెటరీ సంబంధిత అధికారులు బాధ్యతగా సర్వే ప్రక్రియ బాధ్యతగా పక్కాగా చేపట్టాలని సూచించారు.
తిరుపతి ఎంపీ మాట్లాడుతూ తగాదాలు లేని పక్కాగా ఉండే రికార్డులు తయారయ్యేలా నక్షా ప్రోగ్రాం మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని, నిష్పాక్ష పాతంగా సర్వే చేపట్టాలని అన్నారు. తిరుపతి నందు పలు భూ సంబంధిత సమస్యలు ఉన్నాయనీ, బయటి దేశాలలో మన జిల్లా వాస్తవ్యులు ఉన్నారని వారికి ఒక భరోసా, ఒక నమ్మకం కలగాలంటే సర్వే పక్కాగా నిష్పాక్షపాతంగా చేపట్టాలి అని కోరారు. ఎమ్మెల్సీ సుబ్రమణ్యం మాట్లాడుతూ సమస్యలు భూ సంబంధితమైనవి ఎక్కువగా ఉంటున్నాయని, పేద వారు ఎక్కువగా వీటితో సతమతమవుతుంటారు అని, సదరు ట్రైనింగ్ బాగా వినియోగించుకుని పక్కాగా ల్యాండ్ రికార్డ్స్ తయారయ్యే లా చూడాలని కోరారు.
Read more:Tirumala:లడ్డూ వ్యవహారం.. ఇద్దరు కీలక నేతలకు నోటీసులు