Tirupati:ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడి ఎలా

sandalwood smuggling-thirupathi

ఎర్రచందనం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన చెట్టు. శేషాచలం కొండల్లోనే దొరికే గ్రేడ్ 1 ఎర్రచందనం దుంగలు దేశమంతా ఎలా చక్కర్లు కొడుతున్నాయో జస్ట్ గత నెల రోజుల రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఇదంతా దొరికిన దుంగల సంగతే. మరి ఎవరికీ దొరక్కుండా చేరాల్సిన చోటికి సాఫీగా చేరుతున్న రెడ్ శాండిల్ పరిస్థితి ఏంటి? ఇది లెక్కలకు అందట్లేదు. సిండికేట్ ముఠాలు బయట చేస్తున్న ప్రచారం ఏంటంటే.. రెడ్ శాండిల్ కు గట్టిగా డిమాండ్ ఉన్న చైనా, జపాన్ లో ఆర్థిక పరిస్థితులు బాగోలేవని, అందుకే డిమాండ్ తగ్గిందంటున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడి ఎలా..

తిరుపతి, జనవరి 6
ఎర్రచందనం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన చెట్టు. శేషాచలం కొండల్లోనే దొరికే గ్రేడ్ 1 ఎర్రచందనం దుంగలు దేశమంతా ఎలా చక్కర్లు కొడుతున్నాయో జస్ట్ గత నెల రోజుల రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఇదంతా దొరికిన దుంగల సంగతే. మరి ఎవరికీ దొరక్కుండా చేరాల్సిన చోటికి సాఫీగా చేరుతున్న రెడ్ శాండిల్ పరిస్థితి ఏంటి? ఇది లెక్కలకు అందట్లేదు. సిండికేట్ ముఠాలు బయట చేస్తున్న ప్రచారం ఏంటంటే.. రెడ్ శాండిల్ కు గట్టిగా డిమాండ్ ఉన్న చైనా, జపాన్ లో ఆర్థిక పరిస్థితులు బాగోలేవని, అందుకే డిమాండ్ తగ్గిందంటున్నారు. అక్కడి డీలర్లు భారీ రేటు పెట్టి కొనేందుకు ఇష్టం చూపట్లేదంటున్నారు.ఎర్రగా నిగనిగలాడుతూ కనిపించే ఈ రెడ్ శాండిల్ వుడ్ శేషాచలం కొండల్లో వెరీ వెరీ స్పెషల్. పుష్ప సినిమా వచ్చాక ఈ చెట్టు చుట్టూ సీన్ మరింతగా పెరిగింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. చైనా, జపాన్ లో ఎర్రచందనానికి డిమాండ్ తగ్గిందన్న ప్రచారం చేస్తూనే.. ఇంకోవైపు అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. అటు ప్రభుత్వ డిపోల్లో నిల్వలు మాత్రం అలాగే పేరుకుపోతున్నాయి. తిరుమల శ్రీనివాసుడి కొండపై నుంచే ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా జరుగుతుందో చూస్తున్నారుగా.. ఇది నిన్నటికి నిన్న జరిగిన ఘటన. పక్కా ఇన్ఫర్మేషన్ తో పట్టుకున్న పరిస్థితి. ఇన్ఫర్మేషన్ రాకపోతే.. నిగనిగలాడుతూ కనిపిస్తున్న ఈ ఎర్రబంగారం బండి కొండ దిగేదే. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో వెళ్లిపోయేదే. పారిపోయేందుకు ప్రయత్నించిన డ్రైవర్ ను చాకచక్యంగా పట్టుకున్నారు. సో ఈ ఘటన చెబుతున్నదేంటంటే.. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోందనడానికి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే.అడవి అంటేనే తెరిచిన ఖజానా మాదిరి. ఎవరు ఎటు నుంచైనా రావొచ్చు.. ఎవరు ఎటు నుంచైనా వెళ్లొచ్చు. ఏదైనా తేవొచ్చు.. ఏదైనా కొల్లగొట్టొచ్చు. అయితే ఈ సీన్ లో మాత్రం ఏకంగా తిరుమల శ్రీనివాసుడి కొండ నుంచే ఎర్రచందనం దింపుతున్నారంటే సిండికేట్ స్కెచ్ మామూలుగా లేదుగా.

ఇక్కడి నుంచే ఇలా ఉంటే.. శేషాచలం కొండల చుట్టూ పరిస్థితి ఏమిటి? చెక్ పోస్టులకు చెక్ పెడుతూ ఎర్రచందనం దొంగల ముఠా ఎలా దుంగల్ని కొండలు దాటిస్తుందో అర్థం చేసుకోవచ్చు.డిమాండ్ లేనప్పుడు స్మగ్లింగ్ ఎందుకు జరుగుతోంది? ఎందుకు రిస్క్ తీసుకుని తరలించుకెళ్తున్నారు? ఎక్కడ దాస్తున్నారు? ఏం చేస్తున్నారు? డిమాండ్ పెరిగినప్పుడు బయటకు తీసేందుకు నిల్వ చేసుకుంటున్నారా? ఇవన్నీ ఇప్పుడు డీకోడ్ చేయాల్సిన అంశాలు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ శాండిల్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. రెడ్‌శాండల్‌ యాంటీ స్మగ్లింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ మళ్లీ యాక్టివేట్ అయింది. పక్కాగా తిరుగుతూ కూపీ లాగుతున్నారు.అఫీషియల్ గా వేలంలో రెడ్ శాండిల్ వుడ్ కొని సప్లై చేస్తే సవాలక్ష ట్యాక్సులు, పర్మిషన్లు తీసుకోవాలి. ఇందులో లాస్ ఉంటుంది. రెడ్ శాండిల్ డీలర్ అని నలుగురికీ తెలుస్తుంది. మున్ముందు స్మగ్లింగ్ కు ఛాన్స్ ఉండదు. అదే గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తే డబ్బంతా కింగ్ పిన్ లకే చేరుతుంది. ఇదే ఫార్ములాను సిండికేట్ నమ్మకుందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఎక్కడ అమ్మాలో అక్కడే అమ్ముకుంటున్నారన్న డౌట్లు పెరుగుతున్నాయి. రెడ్ శాండిల్ ముఖ్యంగా ఔషధాల్లో, సౌందర్య ఉత్పత్తుల్లో, డెకొరేషన్ పర్పస్, ఫర్నీచర్, గిఫ్ట్స్ తయారీలో వాడుతారు. చైనా, జపాన్, థాయ్ లాండ్, మలేషియా, దుబాయ్ వంటి చోట్ల లగ్జరీతో పాటు ఎర్రచందనం ఓ అవసరం కూడా. అందుకే అంత డిమాండ్.నిజానికి ఎర్రచందనం ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి ఉండదు. క్వాలిటీ తగ్గుతుంటుంది. అందుకనే ముఠాలు తొందరపడుతున్నట్లుగా డౌట్లు పెరుగుతున్నాయి. నిజానికి గత ఐదేళ్లు ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకోవడానికి ఏర్పాటైన వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్న వాదన వినిపిస్తోంది. రెడ్‌శాండల్‌ యాంటీ స్మగ్లింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ కు ఇప్పుడిప్పుడే మళ్లీ ఫుల్ రైట్స్ ఇస్తున్నారు. గతంలో అటవీశాఖ ఫాలో అయిన వ్యూహాలు, ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నీ పక్కకు పోయాయి. సీసీ కెమెరాల సిస్టమ్ కూడా పక్కన పెట్టేశారు. ఫారెస్ట్ చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు మాయమయ్యాయి. తనిఖీ కేంద్రాల్లో వాహనాల స్కానర్ల జాడ లేకుండా పోయింది.

అడవుల చుట్టూ తవ్విన కందకాలు కూడా ఖతమయ్యాయి. లక్షలు ఖర్చు చేసి నిర్మించిన వాచ్‌ టవర్లు అడ్రస్ లేకుండా పోయాయి. బేస్ క్యాంపుల్ని మూసేశారు. సో ఇప్పుడు వీటిని మళ్లీ యాక్టివేట్ చేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. మొదట ఎర్రచందనం స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేసేలా ప్రయత్నాల్ని ముమ్మరం చేసిందిఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో శేషాచలం కొండలు దాదాపు 5.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. శేషాచలం, వెలుగొండల్లో మాత్రమే ఎర్రచందనం ఎక్కువగా పెరుగుతుంది. అందులోనూ శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనానికే ఎక్కువ రంగు, పవర్ ఉండడంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అందుకే రకరకాల రూపాల్లో స్మగ్లింగ్ జరుగుతుంటుంది. ఇది 7 దశల్లో జరుగుతుంది. ఫస్ట్ ఉడ్ కట్టర్, తర్వాత మేస్త్రీ, ఆ తర్వాత పైలట్, నెక్ట్ ట్రాన్స్‌పోర్టర్, గోడౌన్ కీపర్, ఎక్స్ పోర్టర్, చివరగా ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ఇలా దశల వారీగా రెడ్ శాండిల్ వుడ్ తరలుతుంది. ఇదంతా చాలా సీక్రెట్ గా నడుస్తుంటుంది. ఎవరికీ ఎవరితోనూ సంబంధాలు ఉండవు. ఒకరికొకరు తెలియరు. అలా డీల్ చేస్తారు. పైగా పోలీసులు, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బందిని కన్ఫ్యూజ్ చేసేందుకు కొంత ఎర్రచందనం దొరికేలా చూసుకుంటారు. వారిని అక్కడే ఆగిపోయేలా చేస్తారు. ఫైనల్ గా ఏపీ బార్డర్ దాటిస్తారు.ప్రభుత్వ గోడౌన్లలో ఎర్రచందనం దుంగలు మూలుగుతున్నాయి. ప్రస్తుతం 7 వేల టన్నుల సరుకు రెడీగా ఉంది. పట్టుబడ్డ ఎర్ర చందనాన్ని వేలం ద్వారా అమ్మి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వరంగా మార్చాలని ప్రభుత్వం భావించింది. 2014 నుంచి ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. 2018 సెప్టెంబరులో అత్యధికంగా 5 వేల టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించి భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంది. 2020లో మాత్రం 300 టన్నులు, ఆ తర్వాత మూడేళ్లలో 450 టన్నులు మాత్రమే అధికారికంగా అమ్మారు.

ఓవైపు ప్రభుత్వ డిపోల్లో ఉన్న సరుకు ఉన్నట్లుగానే ఉంటే స్మగ్లర్లు మాత్రం కోట్లు గడిస్తున్నారు. ఈ లాజిక్ ఎక్కడ మిస్ అవుతోందో ఇప్పుడు చూద్దాం.ప్రస్తుతం తమిళనాడు, కటికెనహల్లి స్మగర్లు మాత్రమే ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటున్నారు. ఎపిలోని టాప్ టెన్ స్మగ్లర్లు దందాకు దూరమయ్యారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖ తమ దగ్గర 7 వేల టన్నులు స్టాకుంది.. టన్ను 50 లక్షలకు కూడా కొనేందుకు ఎవరూ ఎవరూ ముందుకు రావడంలేదని అంటోంది. ప్రతి ఏటా 2 వేల టన్నులకు పైగా ఎర్రచందనం చెన్నై, ముంబై, కోల్ కతా, ట్యూటికోరన్ రేవుల మీదుగా నేపాల్, టిబెట్ లకు, అక్కడి నుంచి చైనా ఇతర దేశాలకు రవాణా అవుతోంది. ఉపాది లేక ఖాళీగా ఉన్న వారిని కూలీలుగా నియమించుకుని ఎర్రచందనం అక్రమ రవాణాను ఒక వ్యాపారంగా నిర్వహించడం మొదలు పెట్టి వేల కోట్లు సంపాదించారు. లారీ క్లీనర్లుగా జీవితం ప్రారంభించిన వారు స్మగ్లర్లుగా మారి వందల కోట్లు సంపాదించారు. ఇక తమిళనాడులో అయితే స్మగ్లర్లు దుబాయి కేంద్రంగా పనిచేస్తారంటారు. గత పదేళ్లలో లక్ష కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం అక్రమ రవాణా జరిగిందన్న లెక్కలున్నాయి.2014 నుంచి 19 మధ్యం కాలంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై నాటి టీడీపీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. 20మంది ఎన్ కౌంటర్ కూడా అయ్యారు. క్షేత్ర స్థాయి నుంచి కింగ్ పిన్ ల వరకు ఆరా తీసింది. టాప్ టెన్ స్మగర్ల లిస్టు తయారు చేసింది. వారి అస్తుల వివరాలను ఈడీ వరకు తీసుకెళ్లింది. దేశ విదేశాలలో ఉన్న స్మగర్ల లిస్టునుబయటపెట్టింది. అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టించింది. మరో వైపు తమిళ కూలీలకు కౌన్సిలింగ్ ఇచ్చింది. దేశంలో ఎర్రచందనం ఎక్కడ పట్టుబడ్డా అది ఏపీకే వచ్చేలా చర్యలు చేపట్టింది. పొలిటికల్ గా ఎవరు ఈ దందాకు సపోర్ట్ ఇస్తున్నారో గుర్తించారు. కానీ గత ఐదేళ్లలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ గా మారింది. అందుకే ఎర్రచందనం స్మగ్లింగ్ మళ్లీ పెరిగింది.తాజాగా ఎపి స్మగర్ల కంటే తమిళ స్మగర్లతో పాటు పీలేరు, రాయచోటి ప్రాంతానికి వారే ఎక్కువగా అక్రమ దందాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎర్రచందనం వేలంలో చైనాకు చెందిన 10-15 మంది వ్యాపారులు పాల్గొంటుంటారు. అటవీశాఖ టన్ను ధర 70 లక్షలుగా నిర్ణయించింది. కానీ ఎక్కువ మంది 50 లక్షలకు మించి బిడ్లు వేయలేదు. టెండర్‌ రేటుకు బిడ్లు వేసిన ఒకరిద్దరు వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకు కూడా 30 టన్నులు మించలేదు. 2022లో 500 టన్నులు వేలం వేయగా.. ఇంకా 4,900 టన్నులు మిగిలి ఉంది. అందులో 2023లో లాట్‌ల వారీగా 400-500 టన్నుల చొప్పున రెండు సార్లు ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచారు. కానీ టెండర్‌ రేటు కన్నా తక్కువ కోట్‌ చేస్తూ బిడ్లు వచ్చాయి. అత్యధికంగా 2016-19 మధ్య టన్ను ధర 70-75 లక్షలు పెట్టి వేలంలో వ్యాపారులు కొనుక్కున్నారు.చైనా, జపాన్‌, మలేషియా, సింగపూర్‌, అరబ్‌ దేశాల్లో లగ్జరీ వస్తువులు కొనడం తగ్గిందంటున్నారు. ఆయా దేశాల్లో విలాసవంతమైన భవన నిర్మాణాలు, ఖరీదైన ఫర్నిచర్‌ వినియోగం తగ్గడంతో ఎర్రచందనానికి డిమాండ్‌ తగ్గిందంటున్నారు. కాస్త ధర తగ్గించి అమ్మాలని అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఏపీలో కొనుగోలు చేసే ఎర్రచందనాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు తీసుకుని, తిరుపతి గోడౌన్‌ నుంచి విశాఖ పోర్టుకు తరలించి, అక్కడి నుంచి షిప్‌లో చైనాకు తరలిస్తుంటారు. దీనికి రవాణా ఖర్చులు కూడా పెరగడంతో డిమాండ్‌ లేనప్పుడు ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం ఎందుకని వ్యాపారులు వెనుకాడుతున్నట్లు తెలిసింది. దీంతో అటవీశాఖ సెంట్రల్ స్టోర్స్ లో సూమారు 7వేల టన్నులకు పైగా ఎర్ర చందనం దుంగలు నిల్వలున్నాయి.ఇక్కడి ఎర్రచందనం కొనేకంటే తమ దగ్గరే పెంచుకుంటే ఖర్చులు చాలా కలిసి వస్తాయి కదా అని చైనా, జపాన్ వంటి దేశాల్లో వ్యాపారులు అనుకున్నారు. ఇక్కడి నుంచి మొక్కలు తీసుకెళ్లి పెంచే యత్నం చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. అంతే కాదు మొక్కలు చాలా లేట్ అవుతున్నాయని టిష్యూ కల్చర్ ద్వారా వీటిని పెంచడానికి ప్రయత్నించారు. అదీ కుదరలేదు. పైగా ఇలా పెంచిన మొక్కల్లో ఔషధ గుణాలు తక్కువగా కనిపించాయి. ఎర్రచందనంలో ఎరుపు లేకుండా పోయింది. కర్ర కూడా బలహీనంగా ఉండడంతో వర్కవుట్ కాలేదు. అదే శేషాచలం కొండల్లో యురేనియం, ఐరన్, గ్రాఫైట్, కాల్షియం లాంటివి వివిధ నిష్పత్తుల్లో ఉన్నాయి. ఈ మొక్కకి ఈ కాంబినేషన్ అనుకూలమైంది. అందుకే శేషాచలం కొండల్లో ఈ చెట్లు బాగా పెరుగుతున్నాయి. మంచి చేవతో ఉంటాయి. సో ప్రస్తుతం ఇంటర్నేషనల్ గా జరుగుతున్న స్మగ్లింగ్, దొరుకుతున్న దుంగలు చూస్తుంటే.. ఎర్రచందనానికి డిమాండ్ తగ్గలేదు కానీ, ప్రభుత్వ డిపోల్లో ఉన్న వాటికే డిమాండ్ తగ్గిందా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.చైనా, జపాన్‌లో వంటింట్లో వాడే పాత్రలు, గిన్నెలు కూడా ఎర్రచందనంతో చేసినవి వాడుతుంటారు. సంగీత వాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్ల లో బహుమతిగా ఇస్తుంటారు. కాస్మెటిక్స్, ఫేస్ క్రీమ్స్ లాంటి వాటిలో వీటిని వాడుతారు. అల్సర్ ను తగ్గించే గుణం, కిడ్నీ సమస్యలు, రక్తాన్నిశుద్ధి చేయడం వంటి లక్షణాలు ఎర్ర చందనంలో ఉంటాయంటున్నారు. రెడ్ శ్యాండిల్ తో చేసిన ఫర్నిచర్, నేమ్ ప్లేట్స్ గా పెట్టుకుంటే మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. అందుకే ఇంత డిమాండ్ ఉంటుంది. కింగ్ పిన్ ల స్కెచ్ ల మధ్య.. ప్రభుత్వ గోడౌన్ లో ఉన్న సరుకు ఎక్కువ రేటుకు అమ్ముడుపోతుందా.. లేదా అన్నది కీలకంగా మారింది.

Read:Guntur:ఫిబ్రవరి మొదటి వారంలో జగన్ టూర్లు

Related posts

Leave a Comment