పుష్ప సినిమా ఫీవర్ ఏమో కానీ, ఇటీవల పుష్పాల ఆట కట్టించేందుకు పోలీసులు మాత్రం, సినిమాలోని పోలీస్ ఆఫీసర్ పాత్ర షేకావత్ కంటే వేగంగా పావులు కదుపుతున్నారు. దీనితో పుష్పలు ఇట్టే పోలీసులకు చిక్కుతున్నారని చెప్పవచ్చు.
ఎర్రచందనం దొంగల ఆటకట్టించిన పోలీసులు
తిరుపతి, జనవరి 3
పుష్ప సినిమా ఫీవర్ ఏమో కానీ, ఇటీవల పుష్పాల ఆట కట్టించేందుకు పోలీసులు మాత్రం, సినిమాలోని పోలీస్ ఆఫీసర్ పాత్ర షేకావత్ కంటే వేగంగా పావులు కదుపుతున్నారు. దీనితో పుష్పలు ఇట్టే పోలీసులకు చిక్కుతున్నారని చెప్పవచ్చు. శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమల నుండి ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తూ, పలువురు స్మగ్లర్లు టీటీడీ విజిలెన్స్ అధికారులకు గురువారం పట్టుబడ్డారు.శేషాచలం అడవుల్లో నుండి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అటవీ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. తిరుమల నుండి ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతుందని టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీనితో పక్కా ప్రణాళిక రచించి అటవీ అధికారులు, స్మగ్లర్ల ఆట కట్టించారు.కారులో అక్రమంగా ఎర్రచందనం రవాణా అవుతున్నట్లు సమాచారం అందుకొని, వాహన తనిఖీల నిమిత్తం కారును శిలా తోరణము సమీపంలో నిలిపివేశారు. కారును తనిఖీ చేయగా, వెనుక సీటులో గ్రేడ్-ఏ కు చెందిన ఎర్రచందనం దుంగలు పోలీసులకు కారులో కంటపడ్డాయి. ఓవైపు తనిఖీలు జరుగుతుండగా, మరోవైపు కారు డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.గమనించిన సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని, కారును సీజ్ చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పవిత్రమైన తిరుమల నుండి ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు పక్కా ప్రణాళికతో స్మగ్లర్ల ఆట కట్టించారు. అయితే స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ తెలియాల్సి ఉంది
Read:Vijayawada:ఆ మూడింటిపైనే ఆశలు