Tirupati:అందరికి ఇళ్లు.. స్కీమ్ డిటైల్స్

One of the ambitious schemes announced by the AP government is houses for all.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పథకాల్లో ఒకటి అందరికీ ఇళ్లు. ఈ స్కీమ్ పేరుతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మహిళల పేరుతో ఇవ్వనుంది సర్కార్. ఏజెన్సీల ద్వారా ఇళ్లు నిర్మించనుంది.

అందరికి ఇళ్లు.. స్కీమ్ డిటైల్స్..

తిరుపతి, జనవరి 28
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పథకాల్లో ఒకటి అందరికీ ఇళ్లు. ఈ స్కీమ్ పేరుతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మహిళల పేరుతో ఇవ్వనుంది సర్కార్. ఏజెన్సీల ద్వారా ఇళ్లు నిర్మించనుంది. స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత హక్కులు లభించనున్నాయి.ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు. ఆధార్, రేషన్ కార్డుకు ప్లాట్ అనుసంధానం చేయనుంది ప్రభుత్వం. రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.అందరికీ ఇళ్లు స్కీమ్ కి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ స్కీమ్ కి ఎవరెవరు అర్హులు, లబ్దిదారులను ఎలా ఎంపిక చేస్తారు తదితర అంశాలపై ప్రభుత్వం స్పష్టత నిచ్చింది.
మార్గదర్శకాలు ఇవే..
* పట్టణాల్లో ప్రభుత్వ స్ధలం ఉన్న చోట 2 సెంట్ల చొప్పున కేటాయిస్తారు. అదీ ఆ ఇంటి మహిళ పేరుతోనే..
* పట్టణాల్లో ప్రభుత్వ భూములు లేని చోట ఏపీ టిడ్కో, యూఎల్బీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని సర్కార్ నిర్ణయం..
* ఇంటి స్ధలం, లేదా ఇల్లు పొందిన వారికి దానిపై పూర్తి హక్కులు.. కేటాయించిన నాటి నుంచి పదేళ్ల తర్వాతే లభిస్తాయి
* జీవితంలో ఒకసారి మాత్రమే ఇంటి స్థలం లేదా ఇల్లు పొందడానికి అర్హుడు
* పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా లబ్దిదారు ఇంటిని నిర్మించుకోవాలి..
* డూప్లికేషన్ లేకుండా ప్లాట్ ను ఆధార్, రేషన్ కార్డులకు లింక్ చేస్తారు..

Read:Visakhapatnam:ట్రబుల్ షూటర్స్ కావలెను

Related posts

Leave a Comment