Tirumala Tirupati Devasthanam Update for Srivari Devotees | 16 బ్రేక్ దర్శనాలు రద్దు… | Eeroju news

Tirumala Tirupati Devasthanam Update for Srivari Devotees

16 బ్రేక్ దర్శనాలు రద్దు…

తిరుమల, జూలై  6, (న్యూస్ పల్స్)

Tirumala Tirupati Devasthanam Update for Srivari Devotees

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో జూలై 9వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఉంటుందని ప్రకటించింది. దీంతో జూలై 9 , 16వ తేదీల్లో తిరుమలలో బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. తాజా నిర్ణయం కారణంగా జూలై 8, 15వ తేదీల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఓ ప్రకటనలో కోరింది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహిస్తుంటారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు  ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగుతుందని టీటీడీ తెలిపింది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జులై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. జులై 13, 20, 27వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. జులై 16న ఆణివార ఆస్థానం ఉంటుంది. జులై 30 నుండి ఆగస్టు 2వ తేదీ వ‌ర‌కు ప‌విత్సోత్స‌వాలు జ‌రుగ‌ుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 10 నుండి 12వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది.ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మ‌ధ్యాహ్నం 12.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.

 

Tirumala Tirupati Devasthanam Update for Srivari Devotees

 

Dalari system in Tirumala Tirupati Devasthanam | దళారీలకు చెక్.. | Eeroju news

Related posts

Leave a Comment