Tirumala Laddu : వేగంగా కొనసాగుతున్న లడ్డూ దర్యాప్తు

tirumala

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు స్పీడ్‌గా జరుగుతోంది. సీబీఐ నేతృత్వంలోని సిట్‌ బృందం ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టు బెంచ్‌కు సమర్పించినట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో ద్వారా రిపోర్టును అందజేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, దర్యాప్తు వివరాలు అందులో పొందుపరిచినట్టు తెలుస్తోంది.రిపోర్టు సమర్పించడానికి ముందు తిరుపతిలో మూడు రోజులు మకాం వేసింది సిట్ బృందం. తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిపారని సాక్షాత్ సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.

  • తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై స్పీడ్‌గా జరుగుతున్న దర్యాప్తు
  • సీబీఐ నేతృత్వంలోని సిట్‌ బృందం ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టు బెంచ్‌కు

తిరుమల, డిసెంబర్ 16, (న్యూస్ పల్స్)
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు స్పీడ్‌గా జరుగుతోంది. సీబీఐ నేతృత్వంలోని సిట్‌ బృందం ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టు బెంచ్‌కు సమర్పించినట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో ద్వారా రిపోర్టును అందజేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, దర్యాప్తు వివరాలు అందులో పొందుపరిచినట్టు తెలుస్తోంది.రిపోర్టు సమర్పించడానికి ముందు తిరుపతిలో మూడు రోజులు మకాం వేసింది సిట్ బృందం. తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిపారని సాక్షాత్ సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను మంటగలిపే చర్యలు జరిగాయి అన్నది చంద్రబాబు నుంచి వచ్చిన ఆరోపణ. దీనిపై వైసీపీ అప్రమత్తం అయ్యింది. వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సిబిఐ నేతృత్వంలోని అత్యున్నత సిట్ బృందం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కోర్టులో వాదనలు వినిపించింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం సిబిఐ నేతృత్వంలో రాష్ట్ర పోలీస్ అధికారులను సైతం భాగస్వామ్యం కల్పించింది. ఐదుగురితో సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పుడు అదే సిట్ బృందం లడ్డు కల్తీపై విచారణ చేపడుతోంది.తిరుపతిలోని తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకున్న సిట్ విచారణను వేగవంతం చేసింది. సిబిఐ జెడి నేతృత్వంలోని ఏర్పాటైన షిట్ లడ్డు తయారీ చేసే పోటును సైతం పరిశీలించింది. తిరుమలకు నెయ్యి టెండర్లు, కాంట్రాక్టర్ల ఖరారు పైన ఆరా తీసింది. తిరుమలకు నీ సరఫరా చేసిన కంపెనీలను సైతం పరిశీలించింది. ఏ ఆర్ డైరీలో విచారణ కొనసాగించింది. కొన్ని కీలక ఫైల్స్ ను సైతం స్వాధీనం చేసుకుంది.ఈ మొత్తం వ్యవహారంలో లారీ టాంకర్లకు సంబంధించి డ్రైవర్ల వాంగ్మూలం కీలకంగా మారింది. వారి నుంచి వివరాలు సేకరించి నమోదు చేసింది. ఈ మొత్తం విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. దీనిపైనే ఒక నివేదికను సిద్ధం చేసుకుంది సిట్. నెయ్యి సరఫరా లోపాల పైన ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. నెయ్యి సరఫరా లో మధ్యలో కొన్ని కంపెనీల జోక్యాన్ని సైతం గుర్తించగలిగింది సిట్ బృందం. అదే సమయంలో నెయ్యి శాంపిల్స్ ను ల్యాబ్ లకు పంపించింది. అటు ప్రాథమిక విచారణ పూర్తికాగా.. అందుకు సంబంధించి నివేదికను తయారుచేసి సిట్ అధికారులు ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసినట్లు సమాచారం.

మొత్తానికైతే లడ్డు కల్తీ విచారణ దాదాపు తుది అంకానికి చేరుకుంది.నెయ్యి కల్తీ ఎక్కడ జరిగింది అనేదానిపై సమగ్రంగా నివేదించారట. సిట్ టీమ్‌లోని అధికారులు సర్వశ్రేష్ట త్రిపాఠీ, వీరేశ్ ప్రభు, మురళీ రాంబా, డాక్టర్ సత్యేన్ కుమార్‌లు శుక్రవారం తిరుపతిలోని సిట్ ఆఫీసుకు వచ్చారు.దర్యాప్తు నివేదిక సమీక్షించిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ డైరెక్టర్‌కు వివరాలు తెలిపారు. అంతకుముందు మధ్యాహ్నం తర్వాత టీటీడీ ఈవో శ్యామలరావును కలిసింది సిట్ టీమ్. దర్యాప్తుకు కావాల్సిన సమాచారానికి స్టేట్మెంట్ రూపంలో తీసుకుంది.అందులో కీలకమైన ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టు ఎలా నిర్థారించారు? లడ్డూ నమూనాలు ఎన్డీడీబీకి పంపిన విషయం, ఆ తర్వాత నివేదికలోని అంశాలు తీసుకున్నారు. దీని తర్వాత మరొక ల్యాబ్ లో పరీక్షలు చేయించారా? లేదా వంటి సమాచారాన్ని టీటీడీ నుంచి తీసుకుంది. ముఖ్యంగా డెయిరీల నుంచి నెయ్యి కొనుగోలుకు సంబంధించి గతంలో ఎలాంటి ప్రమాణాలు పాటించారు? ప్రస్తుతం ఎలా ఉంది? మొత్తానికి ప్రాథమికంగా అయితే నివేదికను సిట్ ద్వారా సీబీఐ.. న్యాయస్థానానికి అందజేసింది.

Read : Tirumala : 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారా దర్శనాలు

Related posts

Leave a Comment