3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్ల వార్షిక ఆదాయం.
తిరుమల, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్)
Tirumala
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర తిరుపతి ఆలయంలో లభించే లడ్డూలను భక్తులు ఎంతో శ్రద్ధతో ప్రసాదంగా గ్రహిస్తారు. ఈ లడ్డూలు దేశవ్యాప్తంగా పంపిణీ జరుగుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలోని (టిటిడి) వంటశాల అయిన పొటులో మాత్రమే వీటిని తయారు చేస్తారు. లడ్డూ తయారీ ప్రక్రియకు దిట్టం అని పేరు కూడా ఉండడం విశేషం.దిట్టం ప్రక్రియ ప్రకారం లడ్డూలో ఏయే పదార్థాలు ఎంత మోతాదులో వేయాలో అన్ని పక్కగా నిర్ధారణలుంటాయి. అయితే ఈ దిట్టం ప్రక్రియ తిరుమల దేవస్థానం చరిత్రలో ఆరుసార్లు మార్చడం జరిగింది.
2016 టిటిడి రిపోర్ట్ ప్రకారం.. శ్రీవారి ప్రసాదమైన లడ్డూలు దివ్య సుగంధం కలిగి ఉంటుంది. ఈ లడ్డూ తయారీలో ముఖ్యమైన పదార్థం బూందీ తయారు చేయడానికి శనగపిండి, బెల్లం పాకం ఉపయోగిస్తారు. బెల్లం పాకంతో తయారు చేయడం వల్ల లడ్డూ ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఆ తరువాత బాదం పప్పు, కాజు, ఎండ్ర ద్రాక్షని వీటిలో అదనంగా వేస్తారు. దీని లడ్డూలో పౌష్టిక విలువ పెరుగుతుంది.ప్రతి రోజు తిరుమలలో 3 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. లడ్డూల ద్వారా టిటిడి బోర్డుకి ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం సమకూరుతోందని అంచనా. తిరుమలో లడ్డూ ప్రసాదానికి 300 ఏళ్ల ఘనచరిత్ర ఉంది. మొదటిసారి శ్రీవారి ప్రసాదంగా 1715 సంవత్సరంలో భక్తులకు లడ్డూని అందించడం ప్రారంభించారు.
2014 సంవత్సరంలో తిరుపతి లడ్డూలకు జిఐ స్టేటస్ లభించింది. ఈ స్టేటస్ లభించిన ఆహార పదార్థాలు ఇతరులు అదే పేరుతో విక్రయించకూడదు.తిరుమల లడ్డూలు తయారీ సమయంలో వాటి నాణ్యత కోసం టిటిడి లేబరేటరీలో పరీక్షిస్తారు. నాణ్యత ప్రమాణాల ప్రకారం.. అందులో చక్కెర, కాజు, యాలకలు (ఇలాయిచీ) అన్నీ సమపాళ్లలో ఉండాలి. ప్రతీ లడ్డూ బరువు 175 గ్రాములుండాలి.అయితే తిరుమల లడ్డూల తయరీలో పశువుల కొవ్వు ఉయోగించారిన తాజాగా వివాదం నెలకొంది. గత కొంత కాలంగా లడ్డూ నాణ్యత సరిగాలేదని, రుచి, సుగంధం మునుపటిలా లేవని చాలా మంది భక్తులు ఫిర్యాదు చేయగా.. జూలై 2024లో తిరుమల లడ్డూని అందులో ఉపయోగించే నెయ్యిని పరీక్షలు చేశారు.
గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డిడిబి) ఈ పరీక్షలు చేసి నివేదిక అందించింది. నివేదికలో ఉన్న వివరాల ప్రకారం.. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ చేశారని తేలింది. ముఖ్యంగా నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు పరీక్షలో తేలింది. చేప నూనె, టాలో (ఆవు లేదా ఎద్దు కొవ్వు), లార్డ్ (పంది కొవ్వు) ఉన్నట్లు ఎన్‌డిడిబి తన రిపోర్ట్ లో పేర్కొంది.ఈ నెయ్యి తమిళనాడ దిండిగల్ కు చెందిన ఏఆర్ డైరీ తిరుమల దేవస్థానానికి పంపిణీ చేసేది. ఇప్పుడు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని రిపోర్ట్ రావడంతో ఏఆర్ డైరీతో టిటిడి కాంట్రాక్టు రద్దు చేసుకుంది.
దేవస్థానంలో ఉన్న నెయ్యి స్టాక్ ను తిరిగి ఏఆర్ డైరీ పంపించేసింది. ఇంతవరకు ఏఆర్ డైరీ నుంచి కిలో నెయ్యి రూ.320కు టిటిడి కొనుగోలు చేసేది. ఇప్పుడు కాంట్రాక్టు రద్దు చేసి కర్ణాటకు చెందిన నందినీ డైరీతో నెయ్యి పంపిణీ కాంట్రాక్టు కుదుర్చుకుంది. నందినీ డైరీ కిలో నెయ్యి రూ.475 కు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.అయితే గతంలో నందినీ డైరీ నుంచే టిటిడి నెయ్యి కొనుగోలు చేసేది. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టిటిడిలో కీలక మార్పులు చేశారు.
అందులో భాగంగానే టిటిడి బోర్డు నెయ్యి పంపిణీ కాంట్రాక్టుని నందినీ డైరీతో రద్దు చేసుకొని ఏఆర్ డైరీకి అప్పగించింది. దీంతో తిరుమల పవిత్ర ప్రసాదంలో కల్తీ నెయ్యికి వైసీపీ ప్రభుత్వం కారణమని ప్రస్తుత టిడిపి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది.లడ్డూలో నాణ్యతా లోపాలు వెలుగుచూడడానికి ప్రధాన కారణం టిటిడి కొత్త ఈవో ఐఎఎస్ జె. శ్యామల రావు. ఆయన జూన్ 2024లో టిటిడి ఈవోగా నియమితులయ్యారు. లడ్డూ నాణ్యతపై భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఆయన పరీక్షలకు ఆదేశించారు.
Tirupati Laddu | తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా | Eeroju news