టిడ్కో ఇళ్లకు మోక్షం
విజయవాడ, జూలై 9, (న్యూస్ పల్స్)
Tidco is salvation for homes
గతం లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టిడ్కో ఇళ్ల విషయంలో పేద ప్రజలకు అన్యాయం చేసింది అనే వాదనలు చాలానే వినిపించాయి. ఎందుకంటె వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రవ్యాప్తంగా కొంత వరకు పూర్తి చేసిన ఇళ్ళు ఉన్నాయి. పేద ప్రజలకు ఇళ్ళు దక్కాలనేది వైసీపీ ప్రభుత్వం కలవైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సగంలో ఆగిపోయిన ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఉంటె అయిదు ఏళ్ళ కిందటే పేదలకు ఇళ్ళు దక్కేవి. అలా పూర్తి చేస్తే ఈ క్రెడిట్ మొత్తం టిడిపి ఖాతాలోకి వెళ్ళిపోతుంది అని భావించిన వైసీపీ ఆ ఇళ్లను పూర్తి చేయలేదు.
ఆగిపోయిన ఈ ఇళ్లను పూర్తి చేస్తామని పేదల దగ్గర రూ.50 వేల రూపాయలు కూడా తీసుకుందని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయిదేళ్ల నుంచి పేదలు ఆ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారుప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తి చేసే పనిలో ఉంది. వానల వలన ఆ ఇళ్ళు చాలా పాడైపోయాయి. అలాగే చాల ఇళ్ల చుట్టూ తుప్పలు వచ్చేసాయి. మళ్ళీ ఇన్ని ఏళ్ళ తర్వాత ఆ ఇళ్లను పూర్తి చేయాలంటే చాల డబ్బు అవసరం అవుతుంది.
ప్రస్తుతం ఖజానాలో డబ్బులేని ప్రభుత్వం హడ్కో కి ఈ విషయం చెప్పడంతో హడ్కో రుణం ఇచ్చేందుకు సిద్ధపడిందని సమాచారం. రూ.2 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకరించింది. ఈ నెలలో రుణం వచ్చిన వెంటనే మళ్ళీ ఆ ఇళ్ల నిర్మాణం మొదలు కానుంది.4 లేదా 5 నెలల్లో ఆ ఇళ్లను పూర్తి చేసి ఇవ్వనుంది ప్రభుత్వం. ఇదివరకు ఆ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారు తమ దగ్గర ఉన్న ఎక్నాలెడ్జ్మెంట్ ను తీసి పెట్టుకొని ప్రభుత్వం ఇళ్ళు ఇచ్చే సమయంలో అధికారుల దగ్గరకు వెళ్లి తాము ముందే అప్లై చేసుకున్నాము అని చెప్పవచ్చు. ఒకవేళ కొత్త మార్గదర్శకాలు వచ్చినట్లయితే వాటిని అనుసరించి ఇళ్ళు పొందేలా చూసుకోవాలి.