The team welcomes the talented actor Sivaji to the movie ‘Kurmanayaki’ on his birthday | టాలెంటెడ్ యాక్టర్ శివాజీకి బర్త్ డే విశెస్ తో భారీ సోషియో ఫాంటసీ పాన్ ఇండియా మూవీ “కూర్మనాయకి” ప్రాజెక్ట్ లోకి వెల్కమ్ చెప్పిన టీమ్ | Eeroju news

Sivaji

టాలెంటెడ్ యాక్టర్ శివాజీకి బర్త్ డే విశెస్ తో భారీ సోషియో ఫాంటసీ పాన్ ఇండియా మూవీ “కూర్మనాయకి” ప్రాజెక్ట్  లోకి వెల్కమ్ చెప్పిన  టీమ్

The team welcomes the talented actor Sivaji to the movie ‘Kurmanayaki’ on his birthday

Sivajiటాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో భారీ సోషియో ఫాంటసీ మూవీ “కూర్మనాయకి”. ఈ చిత్రాన్ని ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్ తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రానటువంటి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల.

వరలక్ష్మీ శరత్ కుమార్, సాయి కుమార్, అతిరారాజ్, వీటీవీ గణేష్ కీ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ శివాజీ ఓ ప్రధాన పాత్రను పోషించనున్నారు. కూర్మ‌నాయ‌కి సినిమాలో త‌న లుక్ తో అద‌ర‌గొడుతోన్న శివాజీ #kurmanayaki #sivaji #tfccliveఈ రోజు శివాజీ బర్త్ డే సందర్భంగా ఆయనను పుట్టినరోజు విశెస్ తో ప్రాజెక్ట్ లోకి వెల్కమ్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది కూర్మనాయకి టీమ్. శివాజీ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.

మహావిష్ణు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో భారీ పాన్ ఇండియా మూవీగా “కూర్మనాయకి” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల. అత్యున్నత సాంకేతిక విలువలతో పాటు హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఈ సినిమాకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. థర్డ్ షెడ్యూల్ లో శివాజీ జాయిన్ అయ్యారు. కూర్మనాయకి సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నారు. ఆయన ఎవరనేది త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు – వరలక్ష్మీ శరత్ కుమార్, శివాజీ, సాయి కుమార్, అతిరారాజ్, సప్తగిరి, గెటప్ శ్రీను, మహేశ్ విట్టా, సరయు, శత్రు, వీటీవీ గణేషన్, రాజా రవీంద్ర, రాజ్ కృష్ణ, తాగుబోతు రమేష్, తదితరులు

 

Sivaji

 

Mega Prince Varun Tej, Karuna Kumar, Vaira Entertainments, SRT Entertainments Pan India Movie ‘Matka’ | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ | Eeroju news

Related posts

Leave a Comment