The stage is set for Roja’s arrest | రోజా అరెస్ట్ కు రంగం సిద్ధం | Eeroju news

The stage is set for Roja's arrest

రోజా అరెస్ట్ కు రంగం సిద్ధం

తిరుపతి, ఆగస్టు 19  (న్యూస్ పల్స్)

The stage is set for Roja’s arrest

నాటి నటి.. నిన్నటి ఎమ్మెల్యే.. నేడు మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఆడుదాం ఆంధ్రా క్రీడలు ఉచ్చు బిగిస్తుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. అసలు క్రీడా శాఖ మంత్రిగా ఉన్న ఆమెపై ఇప్పుడు అవినీతి ఆరోపణలు కమ్ముకుంటున్నాయి.మాజీమంత్రి రోజా అనగానే గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచిన ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో అప్పటి ఎమ్మెల్యే, మంత్రీ రోజా మాటలు తూటాలుగా పేలేవి.. ఆమె పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ సహా ఎవరి గురించి మాట్లాడినా సోషల్ మీడియా లో వైరల్ గా మారేది. ఇక జనసైనికుల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్న రోజా ఒకానొక దశలో మంత్రి గా, నియోజకవర్గంలో తాను చేసింది ఏంటో చూపించే ప్రయత్నంలో సోషల్ మీడియా సహా మీడియాను కొంత దూరం పెట్టింది.

అసలు నగరి నియోజకవర్గంలో తన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వ్యతిరేకంగా ఉన్న ఆమెకు అసలు సీటు లేదు ప్రకటనలు కూడా చేశారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఆమెకు అనుకూలంగా సీటు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా పట్టు ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారని పలుమార్లు స్పష్టమైంది. జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాసించే పరిస్థితి గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగేది. అన్ని నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి అనుచరులుగా వ్యవహరించిన పలువురికి ఈసారి ఎన్నికల్లో సీట్లు రావడంతో పాటు ఆయనే ముందుంది ఆర్థిక వ్యవహారాలతో పాటు రాజకీయ వ్యవహారాలు చేశారు. అయితే ప్రజలు ఒకవైపుగా రావడంతో వారి కుటుంబ సభ్యులు కొడుకు తమ్ముడు తప్ప మిగిలిన ఎవరూ గెలిచే పరిస్థితి లేదు.

ఇక గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ఆర్కే రోజాపై పెద్దిరెడ్డి వ్యతిరేకంగా ఉన్న ఎక్కడ బయటపడని పరిస్థితి. స్థానిక నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక వర్గం పెద్దిరెడ్డికి అనుకూలంగా ఉండడంతో రోజాకు వ్యతిరేకంగానే ఉండి ఎన్నికల సమయంలో చివర్లో వారు టిడిపి పార్టీలోకి చేరడంతో రోజా ఓటమి బాట పట్టింది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గత వైసిపి ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్రా ప్రభావం స్వల్పంగా ఉన్న అందులో భారీగా నిధులు మంజూరు చేసారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న క్రీడలు ప్రోత్సహించాలని ఏకంగా రూ.150 కోట్ల మేర ఖర్చు చేసింది గత ప్రభుత్వం.గెలుపు చూడని రోజాకు ప్రజలు 10 సంవత్సరాల కాలం పట్టం కట్టారు. గెలిచి తరువాత ప్రజల్లో… బుల్లి తెర పై కనిపించే రోజా మంత్రిగా మారిన తరువాత అసలు ప్రజలకు అందుబాటులో లేదు…ప్రజల కష్టాలు కాకుండా వారి కుటుంబ సభ్యులు, సోదరుల పెత్తనం ఎక్కువైందని సొంత పార్టీ నేతలతో పాటు కూటమి నాయకులు విమర్శలు చేశారు.

అంతవరకు బాగున్న అసలు సమస్య అక్కడే ప్రారంభమైంది. క్రీడా శాఖ మంత్రి గా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆడుదాం ఆంధ్రా అని నిర్వహించారు. సుమారు మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు నిధులు వెచ్చించింది. అయితే ఇందులో కొనుగోలు చేసిన క్రీడా సామగ్రి నుంచి పలు రకాలుగా నిధులు దారి మళ్లించారని, నాసిరకం వస్తువులు… కమీషన్లు తీసుకున్నట్లు కూటమి నాయకులు విమర్శలు చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో మాజీ మంత్రి రోజా పై  సీఐడీ విచారణ ప్రారంభమైంది.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు పై దృష్టి సారించింది. ఇందులో రాష్ట్ర మాజీ మంత్రి రోజా కూడా ప్రతిరోజు పదుల సంఖ్యలో టికెట్లు జారీ చేసినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ఇక తాజాగా ఆడుదాం ఆంధ్రా క్రీడలు పై కూడా  సీఐడీ విచారణ ప్రారంభం కావడంతో ఎప్పుడైన రోజాను అరెస్టు చేయవచ్చని అంటున్నారు.

The stage is set for Roja's arrest

 

Roja enters Tamil politics… | తమిళ రాజకీయాల్లోకి రోజా… | Eeroju news

Related posts

Leave a Comment