నిర్మించిన కొద్ది రోజులకే బీటలు వారిన రోడ్డు. | The road was covered with dirt within a few days of its construction. | Eeroju news

డుంబ్రిగుడ

మండలంలో నూతనంగా నిర్మించిన 516 ఈ హైవే రోడ్డు నిర్మించిన కొద్ది రోజులకే బీటలు వారుతుండడంతోపాటు బిల్లాపుట్టు బ్రిడ్జి వద్ద రోడ్డు దిగిపోతుండడంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. బిల్లాపుట్టు, కించుమండ మధ్యలో ఇటీవల నిర్మించిన హైవే రోడ్డు బీటలు వారగా , బిల్లాపుట్టు బ్రిడ్జి వద్ద రోడ్డు దిగబడుతుంది. దీన్ని గమనించకుండా వాహనదారులు ప్రయాణిస్తూ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని వాహనదారులు అంటున్నారు. నిర్మించిన కొద్ది రోజులకే రోడ్డు బీటలు వారుతుండడంతో నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని పలువురు అంటున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related posts

Leave a Comment