పెద్దిరెడ్డి, చంద్రబాబు మధ్య వివాదానికి కారణమా….
తిరుపతి, జూలై 27, (న్యూస్ పల్స్)
The reason for the dispute between Peddireddy and Chandrababu
పెద్దిరెడ్డి తో చంద్రబాబుకు దశాబ్దాల వైరమా? వారి మధ్య విభేదాలు ఇప్పటివి కాదా? గతంలో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారా? దానిని సహించుకోలేక చంద్రబాబు ఎదురు దాడికి దిగుతున్నారా?అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్దిరెడ్డిని తొక్కేయాలని చూస్తున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఇండియా కూటమిలోకి వైసిపి చేరికపై క్లారిటీ ఇస్తూ ఈరోజు జగన్ మీడియాతో మాట్లాడారు. తొలిసారిగా స్థానిక మీడియాతో పాటు నేషనల్ మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పై దాడి ప్రస్తావన వచ్చింది.
దీంతో ఓపెన్ అయ్యారు జగన్. గతంలో పెద్దిరెడ్డి, చంద్రబాబు మధ్య జరిగిన వ్యవహారాన్ని బయటపెట్టారు. గతంలో ఇద్దరు మంచి మిత్రులని.. కాలేజీలో క్లాస్ మెట్లని.. ఈ క్రమంలో వారి మధ్య విభేదాలు వచ్చాయని.. ఒక దశలో పెద్దిరెడ్డి చంద్రబాబుపై చేయి చేసుకున్నారని చెప్పుకొచ్చారు జగన్. అది మనసులో పెట్టుకునే చంద్రబాబు ఇప్పుడు పెద్దిరెడ్డి పై రివెంజ్ తీర్చుకుంటున్నారని జగన్ చెప్పుకు రావడం విశేషం. అయితే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి తో చంద్రబాబు వైరం దశాబ్దాల కిందట నుంచి కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు నల్లారి కుటుంబం కూడా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండేది.
మధ్యలో చంద్రబాబుకు వచ్చారు. అయితే వీరి మధ్య రాజకీయ విభేదాలే తప్ప..వ్యక్తిగత వైరం లేదని అంతా భావించేవారు. కానీ తాజాగా జగన్ మాత్రం కాలేజీ రోజుల్లో జరిగిన ఘటనగా చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో జగన్ కే తెలియాలి.అయితే మాజీ సీఎం హోదాలో జగన్ చేసిన ఈ ప్రకటన పొలిటికల్ సర్కిల్లో హార్ట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఇప్పటివరకు వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
రాజశేఖర్ రెడ్డి ఉన్నంతవరకు ఆయన అనుచరుడిగా కొనసాగారు. వైసిపి ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేయడం ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా నడిచింది. ఒక చిత్తూరు జిల్లా కాదు.. రాయలసీమలోనే తన హవా కొనసాగించారు పెద్దిరెడ్డి. అటు పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబును, హిందూపురం నుంచి బాలకృష్ణను ఓడిస్తానని శపధం చేశారు. ఆయన కుమారుడు పిఠాపురం నుంచి పవన్ ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డారు. కానీ వారి విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రాజకీయంగా సైలెంట్ అయ్యారు.
ఆయన సంస్థలను సైతం దక్షిణాఫ్రికాకు తరలించారన్న వార్తలు వచ్చాయి. ఇటీవల పుంగనూరు భూముల వ్యవహారం సైతం వివాదాస్పదంగా మారింది. వందల ఎకరాలు బినామీల పేరిట ఆయన దోచుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించడం అందరి వేల్లు పెద్దిరెడ్డి వైపే చూపాయి. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో పెద్దిరెడ్డి అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టు బిగిస్తోంది. ఉన్నత స్థాయి విచారణ జరుగుతోంది. పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఈ తరుణంలో స్పందించిన జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి చంద్రబాబును తన్నడం వల్లే.. ఆయన మనసులో పెట్టుకొని పగా ప్రతీకార రాజకీయాలతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని జగన్ తాజాగా కామెంట్స్ చేయడం విశేషం.
Peddireddy family into BJP… | బీజేపీలోకి పెద్దిరెడ్డి ఫ్యామిలీ… | Eeroju news