The rains… the rains | వానలే… వానలు | Eeroju news

The rains... the rains

వానలే… వానలు

హైదరాబాద్, జూలై 19

The rains… the rains

అల్పపీడన ప్రాంతం ఒకటి దక్షిణ, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడింది. దీని అనుబంధ ఆవర్తనం మధ్య ట్రోపోస్పీయర్ వరకు విస్తరించి ఎత్తు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. ఋతుపవన ద్రోణి ఈరోజు  జైసాల్మయిర్, కోట, గుణ,  కళింగపట్నం గుండా వెళుతూ మధ్య బంగాలఖాతం  వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో కొనసాగుతున్నది. గాలి విచ్చిన్నతి ఈరోజు 20 డిగ్రీల ఉత్తర  అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ. నుండి 5.8 కి. మీ ఎత్తు మధ్యలో కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉన్నది.. రానున్న ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే  అవకాశం ఉంది.

రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులుతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. మరియు అప్పుడప్పుడు 50 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. తెలంగాణలో అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఈ స్థాయిలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు.

భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిసార్లు మెరుపులు, ఈదురుగాలులతో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో సంభవించే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది.

గాలి వేగం గంటకు 8 – 12 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.7 డిగ్రీలుగా నమోదైంది. 80 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.పశ్చిమ మధ్య, ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది గుర్తించబడిన అల్పపీడనంగా మరింత బలపడి వచ్చే రెండు మూడు రోజుల్లో వాయువ్య దిశగా ఒడిశా తీరంవైపుగా కదిలే అవకాశం ఉంది’’ అని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు.

జూలై 18న అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.దక్షిణ కోస్తాలోనూ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.

 

The rains... the rains

 

తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులపాటు వర్షాలు | Rains for the next three days across Telangana | Eeroju news

Related posts

Leave a Comment