The flow of Godavari is increasing | మళ్ళీ పెరుగుతున్న గోదావరి ప్రవాహ ఉదృతి | Eeroju news

The flow of Godavari is increasing

మళ్ళీ పెరుగుతున్న గోదావరి ప్రవాహ ఉదృతి

ఏలూరు

The flow of Godavari is increasing

గోదావరి నదిలో ప్రవాహ ఉదృతి మళ్లీ పెరిగింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ స్పిల్వే వద్ద 33.205 మీటర్లు నీటిమట్టం నమోదు అయింది. ప్రాజెక్ట్ నుండి 11 లక్షల 19 వేల 463 క్యూసెక్కుల గోదావరి జలాలు దిగువకు విడుదల చేసారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంతో ఇంకా ముంపులోనే విలీన మండలాలు వుండిపోయాయి. ఇప్పటికే పునరావస కేంద్రాల్లో  కుక్కునూరు మండలం లో 721 కుటుంబాలు వున్నాయి. వేలేరుపాడు మండలంలో 1161 కుటుంబాలకి ఆశ్రయం కల్పించారు. ఉప్పర మద్దిగట్ల, వెంకటాపురం, సీతారామనగర్, శ్రీధర, నడిగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  జలదిగ్బంధంలో రుద్రమకోట, రేపాక కొమ్ము,
తాటుకూరుగొమ్ముబోళ్లపల్లి, చిగురుమామిడి, నల్లవరం, తూర్పు మెట్ట, కొత్తూరు, తిరుమలాపురం, కన్నాయిగుట్ట గ్రామాలు వున్నాయి.

The flow of Godavari is increasing

 

Slightly increased water level in Bhadradri | భద్రాద్రిలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం | Eeroju news

 

Related posts

Leave a Comment