The exciting US election | ఉత్కంఠంగా మారుతున్న అమెరికా ఎన్నికలు | Eeroju news

The exciting US election

ఉత్కంఠంగా మారుతున్న అమెరికా ఎన్నికలు

తేలిపోయిన బైడన్…

న్యూఢిల్లీ, జూలై 4, (న్యూస్ పల్స్)

The exciting US election

అమెరికా అధ్యక్షుడు.. నిజానికి ప్రపంచానికి పెద్దన్న లాంటి పదవి అది. ప్రపంచ స్థితిగతులను మార్చే పవర్‌ ఆ కుర్చీకి ఉంటుంది. మరి అలాంటి కుర్చీ కోసం ఇప్పుడు ఇద్దరు ఉద్ధండ పిండాలు పోటీ పడుతున్నాయి. ముందు చూస్తే నుయ్యి.. వెనక్కి చూస్తే గొయ్యి.. అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఒకరిపై ఉన్న అయిష్టంతో మరొకరిని సపోర్ట్‌ చేసే పరిస్థితి కూడా లేదు. దీంతో ఇప్పుడు యూఎస్‌ పాలిటిక్స్‌లో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాని పరిస్థితి. జో బైడెన్.. అమెరికా అధ్యక్షుడు.. వయసు 81 సంవత్సరాలు.. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి. దారుణమైన విషయమేంటి అంటే ఇప్పుడు మళ్లీ అధికార కుర్చీ ఎక్కి కూర్చోని ప్రపంచాన్ని శాసించాలని ఊవ్విళ్లూరుతున్నాడు.

అమెరికాలో ఓ మంచి సాంప్రదాయం ఉంది. అధ్యక్ష స్థానానికి పోటీ పడే అభ్యర్థులు వివిధ అంశాలపై బహిరంగంగానే డిస్కస్ చేస్తారు. ఈ సారి కూడా అదే జరిగింది. ఈ డిబెట్‌లో అత్యంత దారుణంగా ఫెయిల్ అయ్యారు బైడెన్. ట్రంప్‌తో డిబేట్‌ చేసే సమయంలో బైడెన్ మాటలు తడబడ్డాయి. ఆలోచోనలు ఎక్కడో ఉన్నాయి.. మాటలు మరోలా ఉన్నాయి. మధ్యమధ్యలో మర్చిపోతున్నారు.. నిద్రపోతున్నారు. మొత్తం 18 నిమిషాల 26 సెకన్ల పాటు మాట్లాడారు బైడన్. కానీ ఓవరాల్‌గా ట్రంప్‌ ముందు తేలిపోయారు బైడెన్. ఇప్పుడే కాదు.. బైడెన్‌పై మొదటి నుంచి అనేక విమర్శలు ఉన్నాయి.

నడుస్తూ పడిపోవడం.. చేసిన పనులనే మళ్లీ చేయడం.. ఎవ్వరూ లేని వైపు తిరిగి అభివాదం చేయడం. ఇలా అనేక ఘటనలు జరిగాయి. నిజానికి ఆయన అడ్మినిస్ట్రేషన్‌పై అంత వ్యతిరేకత లేదు. కానీ వయసును దృష్టిలో ఉంచుకొని అయినా తాను పోటీ నుంచి తప్పుకుంటే బెటర్ అనే డిమాండ్లు వచ్చాయి. కానీ వీటన్నంటినీ బైడెన్ అస్సలు పట్టించుకోలేదు. తానే మళ్లీ పోటీకి దిగుతానని మంకు పట్టు పట్టారు. ఇప్పుడలా డిమాండ్ చేసిన వారికి ఈ డిబెట్ ఓ గోల్డెన్ చాన్స్‌ను ఇచ్చింది. ఇప్పుడైనా డెమోక్రటిక్ పార్టీ తమ అభ్యర్థిని మార్చాలన్న డిమాండ్ పెరిగింది. సొంత పార్టీలో కూడా ఆయనకు వ్యతిరేకంగా గొంతు లేవడం ప్రారంభమైంది. ఆయన అమెరికాకు మేలు చేయాలనుకుంటే వెంటనే పోటీ నుంచి తప్పుకోవాలంటున్నారు. కానీ అటు బైడెన్ కానీ.. ఇటు డెమోక్రటిక్ పార్టీ పెద్దలు కానీ ససేమీరా అంటున్నారు. ఇది చాలదన్నట్టు బైడెన్ మరో మహత్తర కార్యక్రమం నిర్వహించారు.

జరిగిన డ్యామేజ్‌ను కవర్ చేసుకునేందుకు నార్త్ కాలిఫోర్నియాలో ఎన్నికల సభ నిర్వహించారు. అందులో చాలా గట్టిగా మాట్లాడారు బాగుంది. అలా మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. నేను ఇదివరకులా నడవలేను.. సాఫీగా మాట్లాడలేదను. గతంలో లాగా చర్చలో పాల్గొనలేను అంటూ ఫ్లోలో వెళ్లిపోయారు. దీంతో డ్యామేజీ కంట్రోల్ అవ్వడం అంటుంచి.. మరింత డ్యామేజీ జరిగిందిబైడెన్‌కు డిమెన్షియా ఉంది. ఆయన మెదడు పనితీరు దెబ్బతిన్నది. అందుకే ఆయన స్థానాన్ని కమలా హారిస్‌కు ఇవ్వాలి. ఇవీ ఆ పార్టీలో ఉన్నవారి నుంచి వినిపిస్తున్న డిమాండ్లు. నిజానికి అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిని అధికారికంగా కన్ఫామ్‌ చేసేందుకు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు షికాగోలో భేటీ కానున్నారు.

ఆగస్టు 19-22 మధ్య ఈ భేటీ ఉంటుంది. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవాలంటే 1975 మంది మద్దతు అవసరం. కానీ బైడెన్‌కు ఏకంగా 3 వేల 894 మంది మద్దతు ఉంది. అయితే ఈ లెక్క మారుతుందా? లేదా అనేది చూడాలి.బైడెన్ పంచాయితీ ఇలా ఉంటే ట్రంప్‌ది మరో లెక్క.. రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌ వయసు 78 సంవత్సరాలు. ఈయన డిబెట్‌లో 23 నిమిషాలు మాట్లాడారు. చాలా విషయాల్లో బైడెన్‌ను తన మాటలతో ఇరుకునపెట్టారు ట్రంప్. నిజానికి వోకల్‌ ఫర్ లోకల్ అనే స్టైల్‌లో ఉంటుంది ట్రంప్ విధానాలు. అమెరికన్ ఫస్ట్ అనేది ఆయన పాలసీ. అయితే ఆయన హయాంలో కొన్ని వివాదస్పద నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపారు.

రష్యా-ఉక్రెయిన్ వార్‌పై ట్రంప్‌, బైడెన్ భిన్నాభిప్రాయాలు చెప్పగా.. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో మాత్రం ఇద్దరు నేతలు ఇజ్రాయెల్‌కే సపోర్ట్ చేశారు. అయితే ఈ డిబేట్ తర్వాత బైడెన్‌కు రేటింగ్ తగ్గిపోయింది. ట్రంప్‌ కంటే బైడెనే ముందున్నారు.సెప్టెంబర్‌ 27న మరో ట్రంప్‌, బైడెన్‌ మధ్య డిబేట్‌ జరగనుంది. మరి అప్పుడు ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో చూడాలి. కానీ ఈలోపు చాలా విషయాలు జరిగే అవకాశం ఉంది. ఒకటి బైడెన్‌ అభ్యర్థిగా ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ట్రంప్‌కు అనుకూలమైన విషయమే. ఇక రెండోది జులై 11న పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డేనియల్‌ కేసులో ట్రంప్‌కు శిక్ష ఖరారు చేయనుంది. కోర్టు ఎలాంటి శిక్ష వేస్తుంది అనే దానిపై ఆయన భవితవ్యం ఆధారపడి ఉంది.

The exciting US election

 

Amaravati is the foot of permanent structures | ఇక శాశ్వత నిర్మాణాల అడుగులు | Eeroju news

Related posts

Leave a Comment