The case against Johnny Master | జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు | Eeroju news

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు

హైదరాబాద్, సెప్టెంబర్ 17, (న్యూస్ పల్స్)

The case against Johnny Master

తెలుగు, తమిళ చిత్రసీమలతో పాటు హిందీలోనూ పేరు ఉన్న నృత్య దర్శకుడు జానీ మాస్టర్ . ధనుష్, నిత్యా మీనన్, ప్రకాష్ రాజ్, భారతీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ‘తిరు చిత్రంబళం’ సినిమాలో పాటకు గాను జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆయన మీద లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. మాస్టర్ తనను కొంత కాలంగా వేధిస్తున్నారని, తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని 21 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి ఆరోపణలు చేసింది. సదరు మహిళా నృత్య దర్శకురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

జానీ మాస్టర్ మీద ఫిర్యాదు చేసిన అమ్మాయి ఆయనతో పాటు కొన్ని సినిమాలకు పని చేసినట్లు సమాచారం. సాంగ్స్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై వంటి నగరాలకు వెళ్ళినప్పుడు… అవుట్‌ డోర్ షూటింగ్ చేసే సమయాల్లో తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సదరు మహిళ పేర్కొంది. అదే విధంగా , అలాగే హైదరాబాద్‌ సిటీలోని నార్సింగిలోని తన నివాసంలో కూడా పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జానీ మాస్టర్ మీద ఫిర్యాదు చేసిన మహిళ నార్సింగి నివాసి అయినప్పటికీ… ఆమె ఫిర్యాదు ఇచ్చినది మాత్రం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో! ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం కేసును నార్సింగికి బదిలీ చేశారు.

జానీ మాస్టర్ మీద ఐపీసీ అత్యాచారం (సెక్షన్ 376), క్రిమినల్ బెదిరింపులు (సెక్షన్ 506), స్వచ్ఛందంగా గాయపరచడం (సెక్షన్ 323)లోని క్లాజ్ (2) అండ్ (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.ఇటీవల జానీ మాస్టర్ పేరు సినిమాలతో పాటు రాజకీయాల్లో వినబడుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో ఆయన చేరారు. ఏపీ ఎన్నికల సమయంలో జనసేనాని పోటీ చేసి విజయం సాధించిన పిఠాపురం సహా పలు ప్రాంతాలు పర్యటించి ప్రచారం చేశారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయన మీద కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినబడుతోంది.

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఆయన మీద సతీష్ అనే మాస్టర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలు ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశారు. అప్పుడు జానీ మాస్టర్ ప్రెస్ మీట్ పెట్టి తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతానని చెప్పారు. కొందరు లేడీ డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లకు ఫోన్ చేసి జానీకి వ్యతిరేకంగా మాట్లాడమని సతీష్ చెబుతున్నట్లు ఆయన భార్య అలీషా చెప్పారు.

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు

 

Gudlavalleru Engineering College | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోరం | Eeroju news

Related posts

Leave a Comment