The audience has once again proved that if it comes with good content, it will be a big success.. Bunny Was in ‘Ai’ Success Meet | మంచి కంటెంట్‌తో వస్తే ఎంత పెద్ద విజయాన్ని అందిస్తారో ఆడియెన్స్ మరోసారి నిరూపించారు.. ‘ఆయ్’ సక్సెస్ మీట్‌లో బన్నీ వాస్ | Eeroju news

The audience has once again proved that if it comes with good content, it will be a big success.. Bunny Was in 'Ai' Success Meet

మంచి కంటెంట్‌తో వస్తే ఎంత పెద్ద విజయాన్ని అందిస్తారో ఆడియెన్స్ మరోసారి నిరూపించారు.. ‘ఆయ్’ సక్సెస్ మీట్‌లో బన్నీ వాస్

 

The audience has once again proved that if it comes with good content, it will be a big success.. Bunny Was in

‘Ai’ Success Meet

 

నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వచ్చిన చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న ఈ తరుణంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..
నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘110 స్క్రీన్‌లతో మొదలై.. 382 స్క్రీన్‌లకు వెళ్లింది. యూఎస్‌లో 27 స్క్రీన్లతో మొదలై 86 వరకు వెళ్లింది. మంచి కంటెంట్‌తో సినిమా వస్తే.. మౌత్ టాక్ బాగుంటే.. సినిమా ఏ రేంజ్ వరకు వెళ్తుందో, ఆడియెన్స్ ఎంతగా ఆదరిస్తారో ఆయ్ నిరూపించింది.

మీడియా ఎంతగానో సపోర్ట్ చేసింది. 11 కోట్ల గ్రాస్‌కి పైగా కలెక్ట్ చేసింది. ఇప్పటికీ 60, 70 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే సినిమాలను జనాలు ఆదరిస్తుంటారు. ఈ సినిమా ప్రయాణంలో నాకు సపోర్టివ్‌గా నిలిచిన టీంకు, ఎస్ కే ఎన్‌కు థాంక్స్. నితిన్ గారు లక్కీ స్టార్. కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ విజయాలు అందుకుంటున్నారు. కథ చెప్పగానే వెంటనే ఓకే చేశారు. కథల మీద ఆయనకు మంచి జడ్జ్మెంట్ ఉంది. నితిన్ నుంచి భవిష్యత్తులోనూ ఫ్లాప్ సినిమా రాదని అనిపిస్తుంది. మా డీఓపీని చాలా కష్టపెట్టాం. ఎండాకాలంలో తీసినా.. వర్షకాలంలో సినిమా తీసినట్టుగా ఉండాలని చెప్పాం. మేం ఏం ఆశించామో దాని కంటే గొప్ప విజువల్స్ ఇచ్చారు. రామ్ మిర్యాల, అజయ్ అద్భుతమైన సంగీతాన్ని, ఆర్ఆర్‌లను ఇచ్చారు. అంజి ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అవుతోంది. అంజి మన మూలాల్ని మర్చిపోలేదు. అందుకే అద్భుతమైన సినిమాను తీశాడు. మళ్లీ మా బ్యానర్‌లోనే అంజి సినిమా చేస్తున్నాడు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. ‘ఓ రెండేళ్ల క్రితం వాసు ఈ కథను నాకు చెప్పారు. వాసు చేసే కథలన్నీ నాకు చెబుతుంటాడు. బన్నీ వాస్ మల్టీ టాలెంటెడ్. అన్ని క్రాఫ్ట్‌ల మీద మంచి గ్రిప్ ఉంటుంది. ఆయ్ కథను నాకు చెప్పినప్పుడు చాలా నచ్చింది. కథ అయితే బాగుంది తెరపైకి ఎలా వస్తుందో తెలియదు. కానీ కథ మీద మాత్రం బన్నీ వాస్ చాలా నమ్మకంగా ఉండేవాడు. నితిన్ గారికి కథ చాలా నచ్చింది. కథ నా చుట్టూ ఉండాల్సిన పని లేదు.. కథలో నేను ఉంటే చాలు అని.. నితిన్ గారు అన్నారు. ఆయన ఆలోచించే విధానమే ఆయనకు సక్సెస్‌లను తెచ్చి పెడుతున్నాయి. మిత్రత్రయం, వారి మధ్య బ్రొమాన్స్‌ టైమింగ్ బాగా కుదిరింది. వారి సీన్లను చూసి అందరూ తెగ నవ్వేసుకుంటున్నారు. రామ్ మిర్యాల గారు, అజయ్  గారు ఇచ్చిన మ్యూజిక్ అందరికీ నచ్చేసింది. సమీర్ గారి విజువల్స్ బాగా వచ్చాయి. నయన్ సారిక గారికి మంచి సక్సెస్ వచ్చేసింది. కసిరెడ్డి గారు కూడా చాలా బిజీ అయ్యారు. మొన్న కమిటీ కుర్రోళ్లు.. నిన్న ఆయ్ వచ్చింది.. అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. స్టార్‌లు లేకపోయినా సినిమా బాగా ఆడుతోంది. అన్ని వర్గాల ఆడియెన్స్‌ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు’ అని అన్నారు.

దర్శకుడు అంజి కే మణిపుత్ర మాట్లాడుతూ.. ‘ఆయ్ చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. పెద్ద సినిమాల మధ్యను వస్తుండటంతో కాస్త భయపడ్డాను. కానీ లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని అల్లు అరవింద్ గారు, బన్నీ వాస్ గారు తీసుకున్న నిర్ణయమే సరైందని అర్థమైంది. చిన్న చిత్రమే అయినా పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్. ఫ్రెండ్స్‌తో వచ్చినా, పేరెంట్స్‌తో వచ్చినా సినిమా చూసి భుజం మీద చేయి వేసుకుంటూ వెళ్తారు. ఎస్ కే ఎన్ గారు మా సినిమాకు చాలా సపోర్టివ్‌గా నిలిచారు. సినిమాను చూడని వాళ్లంతా ఇంకా చూడండి. యూఎస్‌లోనూ మా చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది పక్కా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా’ అని అన్నారు.

నార్నే నితిన్ మాట్లాడుతూ.. ‘పెద్ద సినిమాల మధ్యలో మా ఆయ్ మూవీ వచ్చినా.. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్. అంజి గారు మంచి కథను నాకు ఇచ్చారు. నాకు హిట్ ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. సమీర్ గారి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సూఫీయానా సాంగ్ గురించి ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అంకిత్, కసిరెడ్డిలతో పని చేయడం ఆనందంగా ఉంది. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. బన్నీ వాస్ గారు మా సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అజయ్ గారు, రామ్ మిర్యాల గారు మంచి ఆర్ఆర్, మ్యూజిక్ ఇచ్చారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారు, విద్యా గారికి థాంక్స్’ అని అన్నారు.
అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. ‘ఆయ్ సినిమాకు ఇంతలా సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్. మౌత్ టాక్‌తో సినిమాను ముందుకు తీసుకెళ్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. మా ముగ్గురి కాంబోను జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమాకు ప్రతీ ఒక్కరూ చాలా కష్టపడి పని చేశారు. నన్ను నమ్మి ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

అజయ్ అరసాడ మాట్లాడుతూ.. ‘ఆయ్ సినిమాను చూసిన వారిలో చాలా మంది ఫోన్స్ చేసి అభినందించడం ఆనందంగా ఉంది. కామెడీ మాత్రమే కాకుండా.. ఎమోషనల్‌గానూ కనెక్ట్ అవుతున్నారు. కాన్సెప్ట్ బాగుంటేనే.. మ్యూజిక్ కూడా బాగా వస్తుంది’ అని అన్నారు.

The audience has once again proved that if it comes with good content, it will be a big success.. Bunny Was in 'Ai' Success Meet

 

Grand Rudra Garuda Puranam Teaser Launch Event | గ్రాండ్‌గా రుద్ర గరుడ పురాణం టీజర్ లాంచ్ ఈవెంట్ | Eeroju news

Related posts

Leave a Comment