Textbooks that end up in the scrap store | స్క్రాప్ దుకాణానికి చేరిన పాఠ్యపుస్తకాలు | Eeroju news

Textbooks that end up in the scrap store

స్క్రాప్ దుకాణానికి చేరిన పాఠ్యపుస్తకాలు

గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్వాకం

నాగర్ కర్నూలు

Textbooks that end up in the scrap store

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చేతిలో ఉండాల్సిన పాఠ్యపుస్తకాలు చెత్తకుప్పకు చేరాయి…. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 కట్టల పుస్తకాలు కనీసం సీల్ కూడా తీయనివి ఆరు నుంచి పదవ తరగతి వరకు కలిగిన ఇంగ్లీష్ పుస్తకాలు  స్క్రాప్ కు చేర్చిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో సంచలనం రేపింది….

ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అందాల్సిన పాఠ్యపుస్తకాలు అచ్చంపేట పట్టణ కేంద్రంలోని స్క్రాప్ దుకాణానికి చేర్చారు… గత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చెందిన ఇంగ్లీష్ పుస్తకాలు మారుమూల గిరిజన ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు   ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు సకాలంలో అందజేయకుండా వాటిని నిలువ చేసి డబ్బులకు కక్కుర్తి పడి వాటిని స్క్రాప్ కింద విక్రయించేందుకు యత్నించిన సంబంధిత గిరిజన సంక్షేమ శాఖ అధికారుల బాగోతాన్ని స్థానికులు బయటపెట్టారు.

నిన్న రాత్రి పట్టణంలోని ఓ చెత్త కాగితాలు విక్రయించే డంపింగ్ దుకాణంలో అచ్చంపేట నియోజకవర్గం లోని గిరిజన సంక్షేమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పాఠ్యపుస్తకాలను వారికి పంపిణీ చేయకుండా సంబంధిత అధికారులు వాటిని బహిరంగ మార్కెట్లో స్క్రాప్ కింద విక్రయించి డబ్బులు చేసుకునేందుకు కక్కుర్తి పడి విక్రయిస్తున్న సంగతి బహిరంగపరిచారు.

వాటిని బహిరంగ మార్కెట్లో విక్రయించడం ఏమిటని వారు సంబంధిత అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  పాఠ్యపుస్తకాలను ఆటోలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందకుండా చేసిన సంబంధిత గిరిజన సంక్షేమ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అచ్చంపేట నియోజకవర్గం లోని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు….

Textbooks that end up in the scrap store

 

ఇక పుస్తకాలతో కుస్తీ… | And wrestling with books…| Eeroju news

Related posts

Leave a Comment