తాడిపత్రిలో టెన్షన్…టెన్షన్
అనంతపురం, జూలై 8, (న్యూస్ పల్స్)
Tension in Tadipatri…tension
తాడిపత్రిలో టెన్షన్ వాతావరణ ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు, మరుసటి రోజు చెలరేగిన ఆర్లర్లతో జేసీ కుటుంబం, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జేసీ, కేతిరెడ్డిలను తాడిపత్రికి వెళ్ళొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ మరుసటి రోజు నుంచి ఈ రెండు కుటుంబాలు హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రిలోకి నో ఎంట్రీ బోర్డు పడింది. ఆఖరికి ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ అస్మిత్ రెడ్డి కూడా తాడిపత్రిలోకి వెళ్లలేని పరిస్థితి. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన నెల రోజుల తర్వాత ఎట్టకేలకు జేసీ కుటుంబం తాడిపత్రికి చేరుకుంది.
జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరి మరణంతో జేసీ కుటుంబం తాడిపత్రిలోకి అడుగు పెట్టింది. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ ఎంట్రీ తో.. ఇక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ ఎప్పుడు అనుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇప్పటికే జేసీ కుటుంబం తాడిపత్రికి రావడం, ఇక పెద్దారెడ్డి కూడా కోర్టు ఆదేశాలు, ఆంక్షలు సడలిస్తే తాడిపత్రిలోకి వస్తే పరిస్థితి ఏంటి అని నియోజకవర్గంలో చర్చ జరుగుతుందిదాదాపు 45 రోజులు తర్వాత జేసీ కుటుంబ సభ్యులు తాడిపత్రిలో కాలు మోపారు. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో తాడిపత్రి వెళ్లకుండా ఆంక్షలు విధించింది హైకోర్టు. జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లకు హైకోర్టు బెయిల్ పొడిగిస్తూ వచ్చింది.
తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు తాడిపత్రికి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించింది. దీంతో 45 రోజులపాటు తాడిపత్రి విడిచి ఈ రెండు కుటుంబాలు బయటే ఉంటున్నాయి. అయితే జూన్ నెల 30వ తేదీన జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరి సుజాత అకాల మరణంతో… జేసీ కుటుంబ సభ్యులు తాడిపత్రికి వచ్చారు.. జేసీ సోదరి సుజాత మరణానంతరం హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహించవలసిన కార్యక్రమాలు ఉన్నందున హైకోర్టు జేసీ ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి బెయిల్ పొడిగిస్తూ జూలై 14 వరకు తాడిపత్రిలో ఉండేందుకు ఆంక్షలు సడలించింది.కారణాలు ఏమైతేనేం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి ఎప్పుడు వస్తారు అన్న చర్చ జరుగుతుంది.
ఒకవేళ హైకోర్టు జూలై 14న జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి లపై తాడిపత్రి రాకుండా ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తే, కచ్చితంగా కేతిరెడ్డి పెద్దరెడ్డి తాడిపత్రిలో అడుగుపెడతారు. ఒకవేళ అదే జరిగితే మరలా తాడిపత్రిలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్నదీ టెన్షన్గా మారింది.అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన అల్లర్లు చూస్తే తాడిపత్రిలో ఒక యుద్ధ వాతావరణం తలపించింది. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం, పోలీసులు బాష్పవాయు ప్రయోగించడం, వందల సంఖ్యలో కేంద్ర బలగాలు తాడిపత్రిలో మోహరించి, పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించింది. ఆఖరికి జేసీ కుటుంబం, కేతిరెడ్డి కుటుంబం తాడిపత్రి విడిచి వెళితే గాని పరిస్థితి అదుపులోకి రాలేదు.
వందల సంఖ్యలో టీడీపీ, వైసీపీ నాయకులు కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. వందల సంఖ్యలో రౌడీషీట్లు ఓపెన్ అయ్యాయి. ఇంకా అనేకమంది అల్లర్లలో పాల్గొన్నవారు పరారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం ఇప్పటికీ గాలింపు చేపట్టారు. 45 రోజులు పాటు నివురు గప్పిన నిప్పులా ఉన్న తాడిపత్రి.. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కోర్టు ఆదేశాలతో తాడిపత్రికి రావడంతో పోలీసులు ముందస్తుగానే అలెర్ట్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
జూలై 14 వ తేదీ తర్వాత ఆంక్షలు సడలిస్తే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా తాడిపత్రికి వస్తే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. దీంతో తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం స్థానిక ప్రజల్లో ఇంకా కళ్ళ ముందు కదులుతూనే ఉంది. ఎన్నికల సందర్భంగా చెలరేగిన అల్లర్లు తాలూకా దృశ్యాలు వారి మదిలో మెదులుతూనే ఉంది. మొత్తం మీద తాడిపత్రిలో మంటలు ఇప్పట్లో చల్లారేటట్లు కనిపించడం లేదు.
YCP MLAs to TDP faction | టీడీపీ గూటికి వైసీపీ ఎమ్మెల్యేలు | Eeroju news