Tension at Women’s Commission office | మహిళా కమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత | Eeroju news

Tension at Women's Commission office

మహిళా కమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్)

Tension at Women’s Commission office

ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై మహిళా సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీంతో తన వ్యాఖ్యల పట్ల ఆయన ఎక్స్‌లో విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమిషన్‌కు వివరణ ఇచ్చేందుకు 11 గంటల సమయంలో కార్యాలయంకు వచ్చారు కేటీఆర్. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. KTR వాహనాన్ని అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ నేతలు యత్నించారు.

కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.సమయంలోనే అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ మహిళా నేతలు పోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య ఘర్షణ, తోపులాట చెలరేగింది. ఇరువర్గాలను అదుపుచేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.  కేటీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయలేకపోవడం వల్ల.. ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు.

Tension at Women's Commission office

 

Women public representatives tied rakhi to CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు.. | Eeroju news

Related posts

Leave a Comment