Ten others are ready not to hold hands | చేయి పట్టుకోనేందుకు మరో పదిమంది రెడీ | Eeroju news

Ten others are ready not to hold hands

చేయి పట్టుకోనేందుకు మరో పదిమంది రెడీ

హైదరాబాద్, జూలై 16, (న్యూస్ పల్స్)

Ten others are ready not to hold hands

పదేళ్ల పాటు గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లా ఇప్పుడు ఖాళీ అవుతోంది. కనీసం జెండా మోసే నాయకుడు లేరన్నట్లుగా పరిస్థితి మారింది. ఇప్పటికే ఓ MLA హస్తం గూటికి చేరగా.. మరో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అదే జరిగితే పార్టీ పరిస్థితి ఏంటని గులాబీనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పదేళ్లుగా BRSకు కంచుకోటగా ఉండేది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోక వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ఉద్యమపార్టీగా, తెలంగాణ సాధించిన పార్టీ అని చెప్పుకున్న BRS నేతలు.. పదేళ్లు అధికారంలో తిరుగులేని విధంగా తమ హవా సాగించారు. గులాబీ జెండాను రెపరెపలాడించిన బీఆర్ఎస్ పరిస్థితి గద్వాల జిల్లాలో అగమ్యగోచరంగా మారింది.

ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటే రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అలంపూర్ నుంచి ఎలాంటి గుర్తింపు లేని BRS అభ్యర్థి విజయుడి విజయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.గద్వాల నుంచి బీఆర్ఎస్ MLAగా విజయం సాధించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల తన గురువు అయిన మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వారా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక.. పార్టీ బాధ్యతలు మోయాల్సిన అలంపూర్ నుంచి బీఆర్ఎస్ ఎంఎల్ఎగా విజయం సాధించిన విజయుడు, ఎంఎల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే జోగులాంబ గద్వాల జిల్లాలో కారు పార్టీ పూర్తిగా ఖాళీ అయినట్లే.. దీనితో జిల్లాలో బీఆర్ఎస్ జెండా మోసే నాయకుడేవరనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

అలంపూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ పార్టీల కన్నా వ్యక్తుల ప్రభావమే ఎక్కువ. ఆ వ్యక్తులు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీలదే విజయం. ఇప్పుడు పరిస్తితులు పూర్తిగా మారిపోతున్నాయట. తాజా రాజకీయాల నేపధ్యంలో అన్ని మండలాల్లోనూ BRSలో కొనసాగుతున్న నేతలంతా ఇప్పుడు అయోమయంలో పడ్డారట. పార్టీపై పట్టు ఉన్నవారంతా వెళ్లిపోతే తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం, మాజీ ఎంపీ మంద జగన్నాధంతో పాటు అలంపూర్ ఎంఎల్ఎ టికెట్ కోసం చివరి వరకూ ప్రయత్నించిన మాజీ ఎంఎల్ఎ అబ్రహం కాంగ్రెస్ గూటికి చేరారు. తరువాత జరిగిన పరిణామాల్లో మంద జగన్నాధం.. BSP తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం మళ్లీ బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారు.

మరోవైపు.. మాజీ ఎంఎల్ఎ అబ్రహం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు RS ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి.. BRSలో చేరి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు చల్లా విజయుడు పార్టీ మారితే నియోజకవర్గ బరువు బాధ్యతలవప.. RS ప్రవీణ్ కుమార్ తీసుకుంటారా.. తిరిగి మంద జగన్నాధానికి ఇస్తారా అనే చర్చ సాగుతోంది.తాజాగా గులాబీ అధినేతకు షాక్‌ ఇచ్చేందుకు మరికొంతమంది MLAలు సిద్ధమయ్యారు. ప్రత్యేకించి గ్రేటర్‌లో ఆపరేషన్‌ ఆకర్ష్‌పై ఫోకస్‌ పెట్టారు.

త్వరలోనే కుత్భుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కారు దిగనున్నారు. అదేబాటలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ లు ఉన్నారు. ఎమ్మెల్యేల వలసల్ని ఆపేందుకు కేసీఆర్‌ చేస్తున్న బుజ్జగింపులు పనిచేయడం లేదు. నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమని ప్రజాప్రతినిధులు తేల్చి చెబుతున్నారు. త్వరలో మరో 17 మంది చేరికతో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం కానుంది. అటు అసెంబ్లీలో ఇప్పటికే కాంగ్రెస్ బలం 75కు చేరింది.

 

Ten others are ready not to hold hands

 

He said that the BRS party will stand by the activists | కార్యకర్తల కు అండగా బిఆర్ఎస్ పార్టీ | Eeroju news

Related posts

Leave a Comment