Telugu states:నాన్ వెజ్ ప్రియులకు కష్టాలు:తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు కొత్త జబ్బుల భయం పట్టుకుంది. ఓ వైపు గులియన్ బారే సిండ్రోమ్ భయాలు. మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్. అయితే బర్డ్ ఫ్లూ వైరస్ అనేది మనషులకు సోకకపోయినా.. ఈ వైరస్ కారణంగా లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోవటం కలకలం రేపుతోంది.
నాన్ వెజ్ ప్రియులకు కష్టాలు
ఏలూరు, ఫిబ్రవరి 18
తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు కొత్త జబ్బుల భయం పట్టుకుంది. ఓ వైపు గులియన్ బారే సిండ్రోమ్ భయాలు. మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్. అయితే బర్డ్ ఫ్లూ వైరస్ అనేది మనషులకు సోకకపోయినా.. ఈ వైరస్ కారణంగా లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోవటం కలకలం రేపుతోంది. దీంతో చికెన్ వైపు చూడటానికి జనం ఆలోచిస్తున్నారు. ఆదివారం వస్తే ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో మటన్, చేపల మార్కెట్ల వద్ద రద్దీ పెరిగింది. దీనికి తోడు డిమాండ్ పెరగటంతో వారు కూడా రేట్లు పెంచారు. అయితే చికెన్ పోతే పోయింది.. చేపలు అయినా తిందామనుకుంటే ఇప్పుడు మరో టెన్షన్ మొదలైంది. బర్డ్ ఫ్లూ వైరస్ సోకి చనిపోయిన కోళ్లను అక్కడక్కడా చేపలకు ఆహారంగా వేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బర్డ్ ఫ్లూ వైరస్ ఉభయ గోదావరి జిల్లాల్లో కనిపించింది. అయితే ఈ జిల్లాల్లోని చేపలకు ఆహారంగా బర్డ్ ఫ్లూ వైరస్‌తో చనిపోయిన కోళ్లను ఆహారంగా వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లోని చేపల చెరువుల వద్ద కోళ్ల అవశేషాలు కనిపించడం కూడా ఈ ప్రచారాలకు బలం పెంచుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని మండలాల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌తో చనిపోయిన కోళ్లను చేపలకు ఆహారంగా వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందుకోసం చనిపోయిన కోళ్లను మగ్గబెట్టి మరీ చేపలకు ఆహారం తయారు చేస్తున్నారని ఇక్కడి జనం చెప్తున్నారు. నిషేధించిన క్యాట్ ఫిష్ ఇతరత్రా చేపల చెరువుల్లో కూడా వీటి వినియోగం పెరిగిందంటున్నారు.అయితే బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి భయాలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ప్రజలకు.. ప్రత్యామ్నాయంగా చేపలు కనిపిస్తున్నాయి. మటన్ ధరలు అందుబాటులో లేకపోవటంతో మధ్యతరగతి జనం చేపలవైపే చూస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ తరహా ప్రచారం జరుగుతూ ఉంటడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చేపల చెరువు యజమానులు కొనసాగుతున్న ఈ దందాపై మత్స్యశాఖ, వెటర్నరీ అధికారులు దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి ఈ ప్రచారం నిజమేనా.. నిజంగానే బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా చనిపోయిన కోళ్లను చేపలకు ఆహారంగా వేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వ అధికారులు ఈ ప్రచారంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
Read more:Andhra Pradesh:క్లీన్ ఎనర్జీ హబ్ గా ఆంధ్ర
[…] Telugu states:నాన్ వెజ్ ప్రియులకు కష్టాలు […]