సూర్యాపేట జిల్లా, జూన్ 12
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా కోదాడ రూరల్ మండలం గుడిబండ గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు మాట్లాడుతూ, పార్టీలు వేరైనా లక్షల మంది గుండెల్లో నందమూరి తారక రామారావు అభిమానం కలదు అన్నారు .
కోదాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఓరుగంటి ప్రభాకర్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం నేర్పింది , సంక్షేమ పథకాలను ప్రారంభించింది ఎన్టీ రామారావు అన్నారు. నారా చంద్రబాబునాయుడు పాలనలో బీసీలకు రాజ్యాధికారము కల్పించినారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించింది అంటే దానికి చంద్రబాబు నాయుడు హైదరాబాదు నగరాన్ని సాఫ్ట్ వేర్ రంగం ను శిఖరాగ్రంగా ఉంచడమే కారణం.
చిలుకూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాతులూరి గురవయ్య మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్ర కంటే తెలంగాణ రాష్ట్రంలోనే బలమైన కార్యకర్తల కలరనీ అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కోదాడ సహకార సంఘం అధ్యక్షురాలు ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి రమాదేవి,మట్టా కృష్ణారెడ్డి, గునుగుంట్ల శ్రీనివాసరెడ్డి, సోమపొంగు బిక్షం, ఓరుగంటి రామకృష్ణ,వీర్ల లక్ష్మారెడ్డి, నర్సింబోతు గీత . విరగాని రామకృష్ణ ,రాజుల లింగయ్య,కందరబోయిన శ్రీను, మునగా వెంకటేశ్వర్లు,చారి.పల్లా సైదులు, పాషా తదితరులు పాల్గొన్నారు.