తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ ఓ పెద్దపులి కొన్ని రోజులపాటు రెండు రాష్ట్రాల ప్రజలను హడలెత్తించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నిత్యం ఏదో చోట పులి సంచారం, కొన్ని చోట్ల జంతువులపై, మనుషులపై దాడులు చేయడం కలకలం రేపింది. అలాంటి మరో ఘటన జరిగింది. ఒడిశాలోని టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఆడ పులి ఏకంగా మూడు రాష్ట్రాల అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది.
300 కిలోమీటర్లు ప్రయాణించిన పులి
ముంబై, డిసెంబర్ 30
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ ఓ పెద్దపులి కొన్ని రోజులపాటు రెండు రాష్ట్రాల ప్రజలను హడలెత్తించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నిత్యం ఏదో చోట పులి సంచారం, కొన్ని చోట్ల జంతువులపై, మనుషులపై దాడులు చేయడం కలకలం రేపింది. అలాంటి మరో ఘటన జరిగింది. ఒడిశాలోని టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఆడ పులి ఏకంగా మూడు రాష్ట్రాల అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. చివరికి పశ్చిమ బెంగాల్‌లో పులి చిక్కడంతో ఊపరి పీల్చుకున్నారు. 21 రోజుల్లో 3 రాష్ట్రాల్లో 300 కిలోమీటర్లపైగా ప్రయాణించిన పులి సమస్యకు చెక్ పెట్టారు. అటవీశాఖ అధికారుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని తడోబా- అంధారి టైగర్ రిజర్వ్ నుంచి ఓ ఆడ పులిని ఇటీవల ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్‌కు తరలించారు. జీనత్ అనే ఆడపులి వయసు మూడేళ్లు. ఈ క్రమంలో సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ నుంచి డిసెంబరు 8న ఆడ పులి తప్పించుకుంది. దాంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఆడపులి కొన్ని రోజులు ఒడిశాలోనే సంచరించినా తరువాత ఝార్ఖండ్‌లోకి ప్రవేశించింది. ఝార్ఖండ్ ప్రజలతో పాటు అటవీశాఖ అధికారులను వారం రోజులపాటు హడలెత్తించింది. పులి పాదముద్రలు గుర్తించేలోపే మకాం మార్చేసేది. దాంతో పులి జాడ కనిపెట్టడం కష్టతరంగా మారడంతో పట్టుకోలేకపోయారు.వారం రోజులపాటు ఝార్ఖండ్‌లో సంచరించిన పులి మరో వంద కిలోమీటర్లు పైగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. మొదట ఝార్‌గ్రామ్‌లో స్థానికుల్ని హడలెత్తించిన పులి చివరగా అటవీశాఖ అధికారులకు దొరికింది. బంకురా జిల్లాలోని గోసైందిహి ప్రాంతంలో మత్తు మందు ఇచ్చి అటవీశాఖ అధికారులు పులిని బంధించారు. ఆదివారం నాడు అధికారుల ప్రయత్నం ఫలించింది. మూడు వారాల్లో మూడు రాష్ట్రాల్లో కలకలం రేపిన పులిని బంధించారన్న సమాచారం తెలియడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులను అంకితభావానికి ఇది నిదర్శనం అన్నారు. పులిని బంధించి, ప్రజలను రక్షించిన ఈ ఆపరేషన్‌లో భాగమైన అందరికీ మమత అభినందనలు తెలిపారు.
Read:New Delhi:ట్రయాంగిల్ ఫైట్ లో గెలుపు ఎవరిది