రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు
హైదరాబాద్ అక్టోబర్ 3
Telangana Rains
రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దాంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుపడే అవకాశం ఉందని చెప్పింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలుపడే ఛాన్స్ ఉందని తెలిపింది.
శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
శనివారం నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల వానలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇవాళ నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నాగర్ కర్నూల్ జిల్లా వెల్టూరులో అత్యధికంగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Heavy rains in Chintoor | చింతూరు లో భారీ వర్షాలు | Eeroju news