Telangana Politics : కూల్చివేత జాబితాలో గులాబీ కార్యాలయం

BRS BUILDING

బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? కీలక నేతలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? పార్టీ పగ్గాలపై వారసుల మధ్య అంతర్గత కలహాలు మొదలయ్యాయా? హైదరాబాద్ ప్లై ఓవర్ల నిర్మాణం నేపథ్యంలో చాలామంది నేతల ఇళ్లు పోతున్నాయా? జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన సర్వేలో బీఆర్ఎస్ ప్రధాన ఆఫీసు ఉందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

-కూల్చివేత జాబితాలో గులాబీ కార్యాలయం…

 

హైదరాబాద్, డిసెంబర్ 17, (న్యూస్ పల్స్)
బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? కీలక నేతలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? పార్టీ పగ్గాలపై వారసుల మధ్య అంతర్గత కలహాలు మొదలయ్యాయా? హైదరాబాద్ ప్లై ఓవర్ల నిర్మాణం నేపథ్యంలో చాలామంది నేతల ఇళ్లు పోతున్నాయా? జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన సర్వేలో బీఆర్ఎస్ ప్రధాన ఆఫీసు ఉందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సిటీలో ట్రాఫిక్ నియంత్రించాలంటే ఫ్లైఓవర్ల నిర్మాణం ఒక్కటే సాధ్యమని భావించింది. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేస్తోంది. ఫ్లైఓవర్లు ఎక్కడ నిర్మించాలనే దానిపై సర్వే మొదలుపెట్టేసింది జీహెచ్ఎంసీ. దానికి తగ్గట్టుగా మార్కింగ్ చేస్తూ పోతోంది.ఫ్లైఓవర్లకు సంబంధించి భూసేకరణకు నేపథ్యంలో దాదాపు 350 వరకు ఆస్తులు ప్రభావితమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 90 నివాసాలకు మార్కింగ్ చేశారు అధికారులు. అందులో సినీ, రాజకీయ నేతల నివాసాలున్నాయి.అలా మార్కింగ్ చేసిన వాటిలో తొలుత టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఇల్లు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, అల్లు అర్జున్ మామ ఇలా కొందరి నేతల ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు చెందిన అరడజను నేతల ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.జీహెచ్ఎంసీ సర్వే ప్రకారం అధికారులు ఆయా ప్రాంతాల్లో మార్కింగ్ చేస్తున్నారట. ఇళ్లు తొలగింపు జాబితాలో కొందరు కాంగ్రెస్ నేతలతోపాటు అరడజను మంది బీఆర్ఎస్‌కు చెందిన నేతలున్నారట. మాగ్జిమమ్ ఇళ్లు పోకుండా పార్కింగ్ ప్రాంతం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారట అధికారులు. అప్పటికీ కుదరని భావిస్తున్న నేపథ్యంలో ఆయా నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.అధికారులు చేపట్టిన అంతర్గత సర్వేలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు (తెలంగాణ భవన్) సగం పోయే అవకాశముందని కొందరి అధికారులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతం డౌన్‌ ఉండడం ఒకటైతే, కొద్దిపాటి వర్షం పడితే నీరంతా అక్కడే ఉండిపోతుందని అంటున్నారు. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలంటే అక్కడ మరో బ్రిడ్జి నిర్మాణం చేస్తే బాగుంటుందని అంటున్నారు.మూసీ పునరుజ్జీవన విషయంలో ఎలాగైతే ప్రజలను రెచ్చగొట్టారో అలాగే చేయాలన్నది కారు పార్టీ నేతల ఆలోచన చెబుతున్నారు. ఈ విషయం తెలిసి కొందరు కారు పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు. మొత్తానికి కూల్చివేతల వ్యవహారం రాజకీయంగా దుమారం రేగడం ఖాయమనే చిన్నపాటి చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా సాగుతోంది.

Related posts

Leave a Comment