Telangana Legislative Council should be dissolved | తెలంగాణ శాసనమండలిని రద్దు చేయాలి | Eeroju news

Telangana Legislative Council

తెలంగాణ శాసనమండలిని రద్దు చేయాలి

హైదరాబాద్

Telangana Legislative Council should be dissolved

రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలని.  హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. మలక్ పేట కళ్యాణ్ నగర్ లో సమావేశం నిర్వహించారు. అత్యవసరంగా రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే తెలంగాణలో శాసన సభ్యుల సంఖ్య 153 పెంచాలి, కౌన్సిల్ సభకు రాజ్యాంగ భద్రత కల్పించాలని తెలిపారు.

.AP పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 27 అమలు చేయాలని కోరారు.కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని కౌన్సిల్ సభ్యులకు విధులకు రాజ్యాంగ సంక్షోభం రాకుండా వెంటనే AP ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 26 ప్రకారం MLA సీట్లు 153 వరకు పెంచుతూ..ఆర్డినెన్సు తీయాలని డిమాండ్ చేశారు. 171 ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారం కౌన్సిల్ ఉన్నా..  లేనట్లె?* రాజ్యాంగ 105 సవరణ ద్వారా 2020 నుండి ఆంగ్లో ఇండియన్ సభ్యులను రద్దు చేయడంతో తెలంగాణా  అసెంబ్లీ సభ్యులు 119 ప్రకారం తెలంగాణలో  MLA ల సంఖ్యలో 1/3 వంతు అంటే  40 నుండి కౌన్సిల్ కోటా 39 పడిపోయిందని వివరించారు.

రాజ్యాంగ ప్రకారం 40 తక్కువ కాకుండా ఉంటేనే కౌన్సిల్ అని రాజ్యాంగం 171 వివరిస్తుందని చెప్పారు. 7డిసెంబర్ 2024  కొత్త అసెంబ్లీ ఏర్పాటు నుండి శాసన పరిషత్తు కౌన్సిల్ సభ్యులు MLC ల ఖర్చుకు, విధులకు చట్ట భద్రత లేదని వెల్లడించారు.రాజ్యాంగ రక్షకులైన రాష్ట్రపతి , గవర్నరు, శాసన మండలి చైర్మన్ బాధ్యులు గా 171 ఆర్టికల్ గురించి ఏమి చేశారని హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే సమాధానం…లేదని స్పష్టం చేశారు.

రాజ్యాంగాన్ని అమలు చేయని వ్యవస్థగా భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి,  దెబ్బ తీసినట్లుగా పౌర సమాజం ప్రశ్నిస్తుందని అన్నారు. మరొవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 26 ప్రకారం 153 సీట్లు కేంద్రం వెంటనే పెంచే అవకాశం ఉందని అన్నారు. వెంటనే కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు ఈ రాజ్యాంగ భద్రత లేని కౌన్సిల్ కోటా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పైభారత రాష్ట్రపతి తెలంగాణ గవర్నర్, భారత ఎన్నికల కమీషన్, కౌన్సిల్ చైర్మన్ గార్కి అత్యవసర వినతి పత్రం పంపినట్లు రాపోలు భాస్కర్ హైకోర్టు న్యాయవాది చెప్పారు,.

కేంద్రం వెంటనే ఆర్డినెన్సు ద్వారా 153 సీట్లు ప్రకటిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని రాపోలు భాస్కర్ చెప్పారు…

Telangana Legislative Council

 

How much work did KCR, Revanth Reddy BT batch | బీటీ బ్యాచ్ ఎంత పని చేసిందో… | Eeroju news

Related posts

Leave a Comment