సంక్రాంతికి విస్తరణ పక్కా…
హైదరాబాద్, డిసెంబర్ 14, (న్యూస్ పల్స్)
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. కేబినెట్ 12 మందితో ఏర్పడింది. ఆరు పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వాటి భర్తీకి లైన్ క్లియర్ అయింది.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ బెర్తుల ఖాళీలు భర్తీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కసరత్తు మొదైలంది. కాంగ్రెస్ మార్కు రాజకీయాలు రాష్ట్రంలో ఊపందుకున్నాయి. తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి కేబినెట్ విస్తరణ కోసం అనుమతి తీసుకున్నారు. ఆరుగురి పేర్లు ఖరారు చేసుకుని వస్తారని తెలుస్తోంది. దీంతో ఆశావహులు అలర్ట్ అయ్యారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కూడా మరో జాబితాతో ఢిల్లీ వెళ్లారు. ఆయన ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుతోపాటు మరికొంతమంది కోసం లాబీయింగ్ చేస్తున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి కూడా భట్టిని కలిశారు. తన పేరు సిఫారసు చేయాలని కోరారని సమాచారం.ఇదిల ఉంటే.. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీలో రచ్చ చేశారు. పార్టీలో పాత వారికన్నా కొత్తవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస మున్షికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ను చంపేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు మంత్రి పదవి ఆశిస్తున్న పలువురు హస్తిన బాట పట్టారు. సామాజిక సమీకరణలకు కేబినెట్ల్లో ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.కేబినెట్ బెర్తుల భర్తీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె కూడా కొందరి పేర్లు సిఫారసు చేశారని సమాచారం. సీనియరుల, సీఎం, ఇన్చార్జి తమ తమ పేర్లతో ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పుడు ఎవరి జాబితాకు హైకమాండ్ ఆమోదం తెలుపుతుందన్న టెన్షన్ నెలకొంది.మరోవైపు కేబినెట్ విస్తరణకు నల్గొండ నేతలు అడ్డు పడుతున్నట్లు తెలిసింది. నల్గొండ జిల్లా నుంచి ప్రస్తుత ఏబినెట్లో ఒకే సమాజికవర్గం నేతలు ఉన్నారు. కోమటిరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి మంత్రులుగా ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈనేపథ్యంలో కేబినెట్ విస్తరణను ప్రభావితం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కూడా కారణం. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా ఈ విషయంపై దృష్టిసారించింది. మరోవైపు తాజా విస్తరణలో హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది.
Read : బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది