తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు –
హైదరాబాద్, నవంబర్ 20, (న్యూస్ పల్స్)
Telangana
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. పాలన పూర్తి చేసుకుంటున్న తొలి ఏడాదిలోనే విపక్షం నుంచి పూర్తి స్థాయి ఎదురుదాడిని ఎదుర్కొంటున్నారు. కలసి రావాల్సిన రాజకీయ నిర్ణయాలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. మొదట మంచి ఫలితాలు ఇచ్చిన హైడ్రా వంటి నిర్ణయాలపై తర్వాత వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నిజానికి సీఎం అన్ని పకడ్బందీ నిర్ణయాలు తీసుకున్నారని కానీ ఎగ్జిక్యూషన్‌లోనే ఎక్కడో తేడా వచ్చిందని కాంగ్రెస్ వర్గాలనుకుంటున్నాయి. కాలం కలసి రావాంటే కొన్ని మార్పులు చేయాలని అనుకుంటున్నాయి. ఇదే విషయం రేవంత్‌కు కూడా అనిపించిదేమో కానీ పాలనా భవనం సెక్రటేరియట్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎంతో ముచ్చడపడి కట్టించిన సెక్రటేరియట్ నుంచి రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. గతంలో అక్కడ ఉండే ఏడు పెద్ద భవనాలను కూల్చేసి.. చెట్లు అన్నీ తీసేసి విశాలమైన ప్రదేశంగా మార్చి అక్కడ సెక్రటేరియట్ కట్టారు. సచివాలయం నాలుగు వైపులా నాలుగు గేట్స్ ఉన్నాయి. అయితే లుంబిని పార్క్‌కు ఎదురుగా గతంలో ప్రధాన గేటు ఉంటే చోట.. మళ్లీ ప్రధాన ద్వారం నిర్మించారు. దీన్నిబాహుబలి గేట్ పిలుస్తూ ఉంటారు. ఇపుడా గేట్ క్లోజ్ చేయించి కొత్త గేటు ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం దాదాపుగా రూ. మూడు కోట్లు ఖర్చు చేస్తున్నారు. మాములుగా అయితే ఆ గేటుతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ గేటు నుంచే సీఎం రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఎందుకో కానీ ఇప్పుడా గేటునుక్లోజ్ చేయిస్తున్నారు. సహజంగా ఇలాంటి మార్పులు వాస్తు దోషాల కారణంగానే రాజకీయ నేతలు చేస్తూంటారు.
ముఖ్యమంత్రికి ఆ గేటు నుంచి రాకపోకలు సాగించడం వల్ల సమస్యలు వస్తున్నాయని అనుకోవడం వల్లనే మారుస్తున్నారని అంచనా వేస్తున్నారు. లేకపోతే ఆ గేటు భవనానికి వాస్తు పరంగా బాగోలేదని అనుకోవడం వల్ల మార్పు చేయాలని నిర్ణయించినట్లుగా భావిస్తున్నారు. నిజానికి కేసీఆర్ అసలు అక్కడ సెక్రటేరియట్ కట్టాలనుకోలేదు. సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్ దగ్గర నుంచి చాలా చూశారు. ఏదీ వర్కవుట్ కాకపోవడంతో చివరికి ఇప్పుడు ఉన్న స్థలంలో ఉన్న వాటిని కూల్చేసి కొత్తవి కట్టించారు. ఇక్కడా వాస్తు సమస్యలు ఉన్నాయని మొదటి నుంచి కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. కేసీఆర్ సచివాలయం కట్టించారు కానీ పూర్తి స్థాయిలో సీఎంగా అందులో విధులు నిర్వహించలేకపోయారు.
రేవంత్ పూర్తి స్థాయిలో సచివాలయాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆయనకు వరుసగా సమస్యలు వస్తున్నాయి. చాలా సులువుగా నెరవేరాల్సిన పనులు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం పండితుల నుంచి వచ్చిన సలహా మేరకు గేట్లను మార్చాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే మంత్రి కోమటిరెడ్డి మాత్రం.. వాస్తు కారణాలతో గేటును మార్చడం లేదని.. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కారణంగానే మారుస్తున్నామని అంటున్నారు.
నాసికరంగా నిర్మాణం
సచివాలయంలో ఓ మంత్రి అకస్మాత్తుగా ఉలిక్కి పడ్డారు.. అధికారులతో సమీక్ష చేస్తుంటే పై నుంచి వచ్చిన సౌండ్లతో ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. మంత్రే కాదు అక్కడున్న అధికారులు సైతం ఏమైందన్న భయంతో దిక్కులు చూసారట..! ఆ తర్వాత అసలు విషయం తెలుసుకోని కూల్ అయ్యారట.. అసలేం జరిగిందో తెలుసుకోండి.. సచివాలయంలో సమీక్ష చేస్తున్న ఆర్ అండ్ బీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కి వింత అనుభవం ఏదురైంది.. అధికారులతో 5వ ప్లోర్ లో సమీక్ష చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పైన ఏసీ లో నుంచి శబ్దాలు వచ్చాయి.. దీంతో మంత్రితోపాటు అధికారులు ఉలిక్కి పడ్డారట.. ఎమైందా అని ఆరా తీస్తే ఏసీలో ఉన్న సమస్యతో అలా సౌండ్స్ వస్తున్నాయని అధికారులు చెప్పారట.. ఇక అప్పటికే అధికారుల తీరు పై అసంతృప్తి తో ఉన్న మంత్రి సచివాలయంలోని తన ఛాంబర్ , సచివాలయ నిర్మాణం లోపాలపై అధికారులకు క్లాస్ తీసుకున్నారట..
ఆర్ అండ్ బి శాఖ మంత్రి ఛాంబర్ లో చాలా చోట్ల పగుళ్లు, ఎసీలో నుంచి వాటర్ లీకేజీ, వాష్ రూమ్స్ లో గ్లాస్‌లు పగిలి ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేసారట మంత్రి..ఈ క్రమంలో మంత్రి.. సెక్రెటేరియట్ లోని తన చెయిర్ క్రింద టైల్స్ ఫిటింగ్ నిర్లక్ష్యాన్ని అధికారులకు స్వయంగా చూపించారు.. వెయ్యికోట్లకు పైగా ఖర్చుపెట్టినామని చెప్పిన రాష్ట్ర సచివాలయంలో మన ఇంజనీర్ల పనితీరు ఇంత నిర్లక్ష్యంగా ఉందని.. టైల్స్ మధ్యనున్న గ్యాప్స్ ను చూపించారట మంత్రి.. మనం ఖర్చుపెట్టే ప్రతీ పైసా ప్రజల సొమ్మని.. దాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని హెచ్చరించారని తెలుస్తోంది..
గత ప్రభుత్వంలో మాదిరిగా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే చూసీచూడనట్లు వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించారట.. ప్రతీది నాణ్యంగా ఉండాలి, ప్రతీ పని ప్రజలు మెచ్చుకునేలా చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారట..తర్వాత మిగితా మంత్రులు అధికారుల, ఛాంబర్లు ఏ విధంగా ఉన్నాయో చెక్ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఒక్కసారిగా ఏదురైన ఈ సంఘటనతో అవాక్కయిన మంత్రి అసలు సమస్యకు చెక్ చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు..
Pawan Kalyan Says Jai Telangana | మరాఠా గడ్డపై పవన్ కల్యాణ్ నోట ‘జై తెలంగాణ’ | FBTV NEWS