Telangana | జనవరి నుంచి సన్నబియ్యం | Eeroju news

జనవరి నుంచి సన్నబియ్యం

జనవరి నుంచి సన్నబియ్యం

హైదరాబాద్, అక్టోబరు 29, (న్యూస్ పల్స్)

Telangana

Highest regard for Indian judiciary': Revanth Reddy Apologises for remarks on K Kavitha's bail - BusinessTodayతెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తున్న ప్రభుత్వం.. తాజాగా చెప్పిన గుడ్ న్యూస్, పేద ప్రజలందరికీ గొప్పవరమనే చెప్పవచ్చు. మధ్య తరగతి, ధనిక కుటుంబాలలో కనిపించే సన్నబియ్యం ఇక పేదలకు కూడా అందనున్నాయి. సూపర్ సిక్స్ పథకాల హామీతో అధికారం చేజిక్కించుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిని అమలు పరచడంలో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని ఈ ప్రకటనతో మరోమారు నిరూపితమైంది. ఇప్పటికే పేదల స్వంత ఇంటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.

మళ్లీ అదే పేదలకు జనవరి నుండి రేషన్ షాపుల ద్వారా, సన్న బియ్యం సరఫరా సాగిస్తామంటూ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు, ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.20వేల కోట్లతో ధాన్యం సేకరణ లక్ష్యంగా ఎంచుకోగా, ఈ సీజన్ లో 150 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి కొత్త రేషన్‌కార్డులకు అక్టోబర్‌ 2 నుంచి దరఖాస్తులు | CM Revanth Reddy orders action plan for issuing new ration cards October 2 | Sakshiవస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నిర్ణయంతో పేద ప్రజల మద్దతు కూడగట్టుకోవాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి నిరుద్యోగ సమస్యకు శుభం కార్డు వేసే ప్రయత్నాలకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు.

ఇటీవల ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం, పలు ఉద్యోగాలను కూడా భర్తీ చేసింది. అలాగే వృత్తి విద్యా కోర్సులలో రాణించే వారి కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తోంది. ఈ యూనివర్సిటీ ప్రధాన లక్ష్యం వృత్తి నైపుణ్యత పెంచి, స్వయం ఉపాధి అవకాశాGovt to supply fortified rice to poor by 2024: PMలు కల్పించాలన్నదే. అంతేకాదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను కూడా అన్ని జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.ఒకటి కాదు రెండు కాదు.. ఇచ్చిన, ఇవ్వని హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తూ.. తమ కోసం సన్నబియ్యం అందించేందుకు చర్యలు తీసుకోనుండగా, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సన్న బియ్యం పంపిణీపై మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేసి, మా ప్రభుత్వం.. అందరి ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం అంటూ కొనియాడారు.

హరికృష్ణ, కిదాంబి శ్రీకాంత్ భేటీ
జాతీయ క్రీడలపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్ చేశారు. మరో రెండేళ్లలో జాతీయ క్రీడలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. త్వరలో బెస్ట్ స్పోర్ట్స్ పాలనీని ప్రభుత్వం రెడీ చేయనుంది. లేటెస్ట్‌గా మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ పెండ్యాల హరికృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరికృష్ణ తాను గెలుచుకున్న మెడల్‌ను చూపించారు. పోటీల సందర్భంగా ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.
మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డిని బ్యాడ్మింటన్ ప్లేయర్ పద్మశ్రీ కిదాంబి శ్రీకాంత్ మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రితో కాసేపు ముచ్చటించారు. ఆటగాళ్లు- ముఖ్యమంత్రి మధ్య స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి చిన్నపాటి చర్చ జరిగినట్టు సమాచారం.

 

Ration Cards | రేషన్ కార్డు ఉంటే బియ్యం.. గోధుమలు | Eeroju news

Related posts

Leave a Comment