Telangana: ఘనంగా జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

sports news
Telangana: ఘనంగా జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి:నల్గొండ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్  ముఖ్యఅతిదిగా హాజరయ్యారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కలిసి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ శాఖలోని విభాగాల వారీగా చేసిన అద్భుతమైన పెరేడ్ ను తిలకించారు.అనంతరం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఫ్లాగ్ ను  ఆవిష్కరించారు.
ఘనంగా జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

నల్గొండ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్  ముఖ్యఅతిదిగా హాజరయ్యారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కలిసి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ శాఖలోని విభాగాల వారీగా చేసిన అద్భుతమైన పెరేడ్ ను తిలకించారు.అనంతరం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఫ్లాగ్ ను  ఆవిష్కరించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాఠశాలల సందర్శనకు వెళ్ళినప్పుడు బందోబస్తుగా వచ్చిన పోలీస్ అధికారులు సిబ్బందిని చూసి విద్యార్థులు స్ఫూర్తి పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పోలీస్ అంటేనే ఒత్తిడి తో కూడుకున్న ఉద్యోగం అని అన్నారు.పోలీస్ శాఖ లో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది శారీరక స్ఫూర్తితో పాటు మానసికంగా అలర్ట్ కావాలని అందుకోసం క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. క్రీడల ద్వారా సమతుల్యమైన శారీరక మానసిక అభివృద్ధి పొందుతుందని అన్నారు. పోలీస్ శాఖ కు టీమ్ స్పిరిట్ చాలా ముఖ్యమన్నారు. నిత్యం విధినిర్వహణలో ఒత్తిడిలో ఉండే పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారికి ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా మంచి మేలు జరుగుతుందని ఆకాంక్షించారు. తమకు అవసరమైన విషయాలను కూడా పోలీస్ శాఖ లోని ముఖ్యమైన విభాగాల నుంచి సమాచారం తెప్పించుకుని దానికి అనుగుణంగా ప్రణాళికతో పనిచేస్తామన్నారు. క్రీడాకారులు ఈ స్పోర్ట్స్ మీట్లో మంచి ప్రతిభ కనబరిచి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

జిల్లా ఎస్పి  మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే అధికారులకు మరియు సిబ్బందికి క్రీడలు ఎంతగానో ఉపయోగ పడతాయి ఇవి నిత్యజీవితంలో భాగంగా చేసుకొంటే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం,శారీరక దృఢత్వం కలిగి ఉంటుందని ఇవి ముఖ్యంగా పోలీసు శాఖలో వివిధ డ్యూటీలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఎంతగానో దోహదపడతాయి అన్నారు. ఆటలలో గెలుపోటములు సహజమని క్రీడాకారులందరూ స్పోర్స్ స్పిరిట్ తో ఆడాలని అన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయని వాటిని తట్టుకునేందుకు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు ఓటమిని అంగీకరించి భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లి వాటిని అధిగమించేందుకు కృషి చేయాలి అన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్లో క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని జీవితాంతం ఇదే ఫిట్నెస్ను కొనసాగించాలని సూచించారు. పోలీస్ అధికారులు సిబ్బంది ఆరోగ్యం కోసమే గేమ్స్ తో పాటు పరేడ్,జిమ్ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నమన్నారు. ప్రతి ఒక్కరికీ స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ గా ఉండాలని ఏంచుకోవాలని అన్నారు.  ఈ పోటీలలో నల్లగొండ,మిర్యాలగూడ,దేవరకొండ డివిజన్ల తోపాటు నల్లగొండ ఏ.ఆర్ విభాగం జట్లు కూడా ప్రాతినిధ్యం వహించాయి. సుమారు 300 మంది అధికారులు సిబ్బంది ఈ పోటీలలో పాల్గొనున్నారు.
పేదలకు అందని ప్రభుత్వ వైద్యం
పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అందని ద్రాక్ష గా మారింది.కొందరు ప్రభుత్వ డాక్టర్ ల ధన దాహం, కోట్లు ఖర్చు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యన్ని తూట్లు పొడుస్తుంది.ప్రభుత్వ ఆసుపత్రి లో ఉచితంగా చేయాల్సిన టెస్ట్ లకు ప్రయివేటుతో బేరాలు కుదుర్చుకుని 9 నెలల నిండు గర్భిణీ కి డెలివరీ చేయకుండా బయటకు గెంటారు అ ఆసుపత్రి సిబ్బంది. యాదాద్రి జిల్లా  చౌటుప్పల ప్రభుత్వ ఆసుపత్రి లో ఈ దారుణం వెలుగుచచూసింది. స్ :సాత్విక అనే నిండు గర్భిణి గత తొమ్మిది నెలలుగా చౌటుప్పల ప్రభుత్వ ఆసుపత్రిలో  ప్రతి నెల వైద్య సేవలు తీసుకుంది…గురవారం  ఉదయం తనకు డెలివరీ ఉండగా ఆసుపత్రికి వచ్చింది.నిండు గర్భిణీ ని బయట ప్రవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుని రావాలని పంపారు అక్కడి ప్రభుత్వ వైద్యులు….. సుమారు 2000 రూపాయల వరకు టెస్టులకు ఖర్చుకాగా….ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లిన తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది ఇక్కడ మేము ఆపరేషన్ చేయము అంటూ నల్గొండ లేదా హైదరాబాద్ లోని కోఠీ ఆసుపత్రులకు తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చి బయటకు పంపారు..బాధిత కుటుంబ సభ్యులు మహిళను దిక్కుతోచని స్థితిలో  ప్రైవేటు  ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ 30000 రూపాయల వరకు ఖర్చు చేసి ఆపరేషన్ చేస్తున్నారు అనంతరం సాత్విక బంధువులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడ చూసినా ఖాళీ బెడ్లు కనిపిస్తున్నాయి మరియు ఇక్కడ గర్భిణులకు డెలివరీ లు మాత్రం చేయడం లేదన్నారు… దగ్గరుండి వారే  బయటకు  వెళ్ళమని చెప్తున్నారని కలెక్టర్ ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్ లో ఫిర్యాదు లెటర్ ను రాసి దీనికి సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు

Read more:Hyderabad:రేవంత్ ను కలిసిన డిఎంకే బృందం

Related posts

Leave a Comment