Telangana:సాగు చేసే వారికి రైతు భరోసా

The state government is working to implement this scheme as a Sankranti gift.

రైతు భరోసా కోసం తెలంగాణ అన్నదాత ఆశగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే అసలైన రైతుకే ఆర్థిక భరోసా కల్పిస్తామని ప్రభుత్వం అంటుంటే…. రకరకాల కండీషన్లు పెట్టి.. రైతులకు పథకం డబ్బు అందకుండా చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది.

సాగు చేసే వారికి రైతు భరోసా

హైదరాబాద్, జనవరి 3
రైతు భరోసా కోసం తెలంగాణ అన్నదాత ఆశగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే అసలైన రైతుకే ఆర్థిక భరోసా కల్పిస్తామని ప్రభుత్వం అంటుంటే…. రకరకాల కండీషన్లు పెట్టి.. రైతులకు పథకం డబ్బు అందకుండా చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. అసలు రైతు భరోసా అమలుకు ప్రభుత్వం పెట్టిన నిబంధన ఏంటి..? బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నట్లు ఒక్క పంటకు మాత్రమే ఆర్థిక సాయం అందిస్తారా..? కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు..? అనేదీ హాట్ టాపిక్‌గా మారింది.రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.. ఆ దిశగా స్పీడ్‌ పెంచుతోంది. సంక్రాంతికే రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్‌ సబ్ కమిటీ కూడా తీర్మానం చేయడంతో విధివిధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగా రైతు భరోసా ఎవరికి ఇవ్వాలని, ఎవరికి ఇవ్వొద్దనే దానిపై కసరత్తు చేస్తున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం బేషరతుగా రైతు బంధు చెల్లించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అలా కాకుండా కొన్ని నిబంధనలు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

అందులో ప్రధానంగా సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని, దాంతో పాటు ఎకరాల విషయంలో కొంత కటాఫ్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 7 నుంచి 10 ఎకరాల లోపు భూములు ఉన్న వారికే రైతు భరోసా చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గూగుల్ డేటా, శాటిలైట్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించేందుకు పలు కంపెనీల నుంచి డేటా సేకరిస్తోంది. అలాగే టాక్స్‌ పేయర్స్‌, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని సూచనప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై జనవరి 4న క్యాబినెట్ భేటీలో చర్చించాలని నిర్ణయించారు.రైతు భరోసాకు కోతలు విధించేందుకు రేవంత్‌ సర్కార్‌ కుస్తీలు పడుతుందని మాజీ మంత్రి హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు. రుణమాఫీకి షరతులు పెట్టి లబ్ధిదారులను తగ్గించారని ఆరోపించారు. రైతు భరోసా పథకానికి రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారని ఆక్షేపించారు. మొత్తంగా సాగు చేసే వారికే భరోసా అందాలి. అసలైన రైతుకే ఆర్థిక సాయం అందించే ఆలోచనలో రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఉంటే… రైతు భరోసా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. మరి ప్రభుత్వం ఫైనల్‌గా కేబినెట్‌ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..!

Read:Hyderabad:ఫార్ములా రేసులో కొత్త మలుపులు

Related posts

Leave a Comment