Telangana:కవితక్క.. కేరాఫ్ సిద్ధిపేట..

Kavithakka.. Caraf Siddhipet..

Telangana:కవితక్క.. కేరాఫ్ సిద్ధిపేట..:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కవిత జైలు నుండి బెయిల్ పై బయటకు వచ్చారు. కొద్దిరోజులు పార్టీ స్థితిగతులు అంచనా వేసిన కవిత, ఆ తర్వాత స్పీడ్ పెంచారు. కవితకు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో స్పెషల్ క్రేజ్ ఉంది. పార్టీ క్యాడర్ కూడా ఆమెకిచ్చే గౌరవంలో ఏమాత్రం తక్కువ చేయరు. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడంలో ఎవరైనా కవిత తర్వాతే అంటారు పార్టీ క్యాడర్.

కవితక్క.. కేరాఫ్ సిద్ధిపేట..

మెదక్, ఫిబ్రవరి 19
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కవిత జైలు నుండి బెయిల్ పై బయటకు వచ్చారు. కొద్దిరోజులు పార్టీ స్థితిగతులు అంచనా వేసిన కవిత, ఆ తర్వాత స్పీడ్ పెంచారు. కవితకు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో స్పెషల్ క్రేజ్ ఉంది. పార్టీ క్యాడర్ కూడా ఆమెకిచ్చే గౌరవంలో ఏమాత్రం తక్కువ చేయరు. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడంలో ఎవరైనా కవిత తర్వాతే అంటారు పార్టీ క్యాడర్. అయితే ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలను బట్టి కవిత.. కాస్త బీఆర్ఎస్ అధినాయకత్వానికి భిన్నంగా నడుచుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. పలు విషయాలతో విభేదిస్తూ.. తన పని తాను కవిత చేసుకుపోతున్నారట.ఇటీవల శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాకౌట్ చేసినప్పటికీ కవిత మాత్రం సభలో ఉండిపోయారు. అంతేకాదు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్ పాల్గొనలేదు. కవిత మాత్రం సర్వేలో పాల్గొని తన వివరాలు అందజేశారు. దీనితో మంత్రులు కూడా కవిత సర్వేలో పాల్గొంది.. మీకేమైంది అంటూ కేటీఆర్, కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఇలా కొన్ని అంశాలలో కవిత తనకంటూ ప్రత్యేకత చాటుకుంటూ.. తనకు ఉన్న ఇమేజ్ ను పెంచుకుంటూ పోతున్నారని టాక్.కాగా ఇటీవల సిద్దిపేటపై కవిత ఫోకస్ పెట్టారని బీఆర్ఎస్ క్యాడర్ భావిస్తోంది. సిద్దిపేట నుండి మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. హరీష్ స్వయాన వరుసకు కవితకు బావ అవుతారు. కేసీఆర్ కుటుంబానికి సమీప బంధువైన హరీష్ రావుకు, కేటీఆర్, కవితలకు మనస్పర్థలు ఉన్నాయని పలుమార్లు వదంతులు వ్యాపించాయి. ఇలాంటి తరుణంలో కవిత ఇటీవల స్పీడ్ పెంచి ఎక్కువగా సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పార్టీలో తనకంటూ బ్రాండ్ ఇమేజ్ ఉన్న కవిత కన్ను సిద్దిపేటపై పడిందని, రానున్న ఎన్నికల్లో కవిత పోటీ ఇక్కడి నుండే అంటూ ప్రచారం సాగుతోంది.అలాగే జగిత్యాల నుండి పోటీ చేస్తారని కూడా మరో ప్రచారం సాగుతోంది. కానీ హరీష్ రావుకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే సిద్దిపేటలో కవిత తరచూ పర్యటిస్తున్నారని, రానున్న ఎన్నికలకు ఇప్పటినుండే రూట్ వేస్తున్నట్లు కొందరి అభిప్రాయం. అదే నిజమైతే హరీష్ రావు నెక్స్ట్ పోటీ ఎక్కడి నుండి సాగుతుందనే కోణంలో కూడా చర్చలు సాగుతున్నాయి. మొత్తం మీద మీడియా ముందు మేమంతా ఒకటే అనే నినాదం అంటూ వీరు ప్రచారం సాగిస్తున్నప్పటికీ, విభేదాలు ఉన్నాయ్.. అందుకే సిద్దిపేటపై కవిత ఫోకస్ అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ ప్రచారంలో ఎంత మేరకు వాస్తవం ఉందో కానీ, మొత్తం మీద కవిత దెబ్బకు హరీష్ రావు అనుచరులు ఏ క్యాహై అనేస్తున్నారట.

Read more:Hyderabad:పౌల్ట్రీ రైతులకు కోట్లల్లో నష్టం

Related posts

Leave a Comment