గోదావరిఖనిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనివ్వమని, అందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు
అభివృద్ధి చూసి ఓర్వలేక పోతున్నా బీఆర్ఎస్ నేతలు..రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్
గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతం, నియోజకవర్గాన్ని సుమారు 300 కోట్లతో అభివృద్ధి చేపడుతున్నామని శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. గోదావరిఖనిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనివ్వమని, అందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు
ఇప్పటికే 25 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశామన్నారు. అలాగే ఓవైపు అభివృద్ధి చేస్తుంటే మరోవైపు ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంతో పాటు సన్నాలకు 500 బోనస్ కూడా ఇచ్చామన్నారు. ఇదంతా చేస్తూ ఉంటే సిగ్గు, మానం, బుద్ధి లేకుండా ఉద్యమాలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు అనడం విడ్డూరంగా అనిపిస్తుందని అన్నారు.
అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, ప్రతి పనిని పారదర్శకతతో పనిచేస్తున్నామని అన్నారు. దావోసస్ కు వెళ్ళి కోట్ల నిధులు తీసుకువచ్చామన్నారు. విద్యాశాఖ విషయంలో పిల్లలకు 40 శాతం మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచి కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టామన్నారు. కొత్త బిల్డింగ్ లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా పనులు చేస్తున్నామన్నారు. ఓవైపు అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నేతలకు కళ్ళు కనబడడం లేదని… చెవులు వినబడడం లేదా… అని ప్రశ్నించారు. కోల్ బెల్ట్ ప్రాంతాన్ని స్థానిక సంస్థల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు. అభివృద్ధి విషయంలో ఆత్రుత పడుతుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతూ… ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు
పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కొత్తగా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానికంగా ఉన్న మెడికల్ కాలేజీలో అదనపు కోర్సులు ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా రామగుండంలో త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. బండల వాగు ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సలహాలతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు
ఈ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు
Read:Srisailam:శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో నీరు లీకేజీyd