కొలిమిగుండ్ల, జూన్ 12,
కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి రావడంతో టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మన బనగానపల్లె నియోజకవర్గానికి మొదటిసారిగా మంత్రి పదవి రావడంతో టిడిపి నాయకులు బస్టాండ్ సెంటర్లో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కోటపాడు శివరామిరెడ్డి, కొలిమిగుండ్ల అందేరాము, బొట్టు స్వామి, నాగార్జున రెడ్డి, తెలికి నాగేశ్వర్ రెడ్డి, గూడూరు నాగేశ్వర్రెడ్డి, నిమ్మకాయల చిన్న దస్తగిరి, గ్రామ టిడిపి అధ్యక్షుడు బత్తూరి శీను, టైలర్ వెంకట్రాముడు, సీతారామయ్య, నర్సింహులు, చంద్రశేఖర్, రవి, మధు,మంధా విజయ్, దస్తగిరి, ఇంకా తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.