TDP again in Telangana politics | తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ టీడీపీ… | Eeroju news

TDP again in Telangana politics

తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ టీడీపీ…

హైదరాబాద్, జూలై 9, (న్యూస్ పల్స్)

TDP again in Telangana politics

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి ఇప్పుడు లేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ  పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు లేడు. కార్యవర్గం కూడా లేదు. అంటే ఓ రకంగా తెలంగాణ టీడీపీ అచేతన స్థితిలో ఉంది. కానీ ఏపీలో ఘన విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ వచ్చిన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబునాయుడు టీడీపీ ఆఫీసులో మీటింగ్ పెట్టి పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు పర్యటనపై బీఆర్ఎస్ ఎలాంటి స్పందన అధికారికంగా వ్యక్తం చేయలేదు. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం అగ్రెసివ్ గా స్పందించింది. చంద్రబాబుపై ఆరోపణల మీద ఆరోపణలు చేసింది.

సెంటిమెంట్ రాజకీయాలను ప్రారంభించేశారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ బహిరంగంగా ఆరోపణలు చేయడం ప్రారంభించింది. కాంగ్రెస్ ను బలహీనం చేసే ప్రయత్నంలోనే బీజేపీ వ్యూహంలో భాగంగానే చంద్రబాబు తెలంగాణలో అడుగు పెట్టారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ గేమ్‌ స్టార్ట్‌ చేసిందని  టీడీపీని ముందుపెట్టి బీజేపీ పొలిటికల్‌ గేమ్‌ ఆడుతోందని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గాంధీభవన్‌లో ప్రస్ మీట్ పెట్టి మరీ విమర్శించారు. . తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని..  ఈ విషయంలో కాంగ్రెస్‌ కేడర్‌ అలర్ట్‌గా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.  సీఎం హోదాలో చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టి చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంలో రాజకీయం మొదలు పెట్టారని..  కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టేందుకు టీడీపీ, జనసేనను బీజేపీ రంగంలోకి దింపిందన్నారు.   చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నాడని..  ఏపీలో చేసిన పొలిటికల్‌ గేమ్‌ను తెలంగాణలో ఆడాలనుకుంటున్నారని ఆరోపించారు.

విభజన సమస్యల పేరుతో చంద్రబాబు తెలంగాణలో ఎంటరయ్యారన్నారు. నిజానికి విభజన సమస్యల పరిష్కారం కోసం.. కాంగ్రెస్ పార్టీ సీఎం అయిన రేవంత్ రెడ్డినే ఆహ్వానించారు. అయినా ఇందులో కుట్ర ఉందని  జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో టీడీపీ మూలాలున్న నేతలు .. ముఖ్యంగా సీనియ్ర నేతలు చాలా మంది ఉన్నారు. వీరంతా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో ప్రత్యేకంగా కలిశారు.  మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఆరెకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్  రం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీళ్ళే కాకుండా మరికొందరు ఎంఎల్ఏలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందగౌడ్, మాగంటి గోపి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబుతో కలిసినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ ఫోటోలు బయటకు రాలేదు.

అందరూ  మాజీ టీడీపీ నేతలే. అయితే వీరు టీడీపీలో చేరుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఎందుకంటే రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా చాలా మంది నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు. తెలంగాణలో ఉన్న ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితుల వల్లనే తాము టీడీపీని వీడాల్సి వచ్చిందని.. అంతకు మించి టీడీపీపై చంద్రబాబుపై ఎలాంటి వ్యతిరేకత లేదని చెబుతూ ఉంటారు. ఇలాంటి వారంతా చంద్రబాబును కలిశారు. కానీ వారిది మర్యాదపూర్వక భేటీనేననిచెబుతున్నారు. మళ్లీ టీడీపీలో చేరాలన్న లేదా చేరుతామన్న ఆలోచనను వారు వ్యక్తం చేయలేదు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని చెబుతున్నారు కానీ ఇంకా ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదు. స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలని అంటున్నారు కానీ అధ్యక్షుడి నియామకం విషయంలోనూ నిర్ణయం తీసుకోలేదు.చంద్రబాబు హైదరాబాద్‌‌లో  బలప్రదర్శన చేయడంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా అగ్రెసివ్ గా స్పందించింది.

చంద్రబాబు తెలంగాణపై దాడికి వస్తున్నారని గతంలో అన్యాయం చేశారని ఆన్ లైన్ వార్ ప్రారంభించారు. బీఆర్ఎస్ పరాజయానికి తెలంగాణ సెంటిమెంట్ అడుగంటిపోవడమే కారణని.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడమే కారణమని ఆ  పార్టీ నేతలు ఓ క్లారిటీకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ఆయుధం తెచ్చుకోవాలంటే.. టీడీపీ ఎంట్రీని ఉపయోగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఓ వైపు టీడీపీపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎటాక్ చేస్తున్న సమయంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  చంద్రబాబుతో సమావేశం అయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు ఎంట్రీ కొన్ని రకాల మార్పులకు కారణం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అది బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అన్నదానిపై ఇంకా లెక్కలు తేలలేదు. అందుకే బీఆర్ఎస్ అగ్రనేతలు అధికారికంగా స్పందించలేదు. కానీ టీడీపీని బూచిగా చూపించే రాజకీయంలో గతంలో బీఆర్ఎస్ ఘన విజయాల్ని సాధించింంది. ఈ సారి అలాంటి పరిస్థితులకు అవకాశం వస్తే బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుంది. కానీ ఇప్పుడా పరిస్థితి ఉందా లేదా అన్నది కీలకం. అదే సమయంలో తెలంగాణలో తమకు టీడీపీతో పొత్తులు ఉన్నాయని బీజేపీ చెప్పడం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో అయినా పోటీ చేస్తామని చెప్పడం లేదు. చివరికి జనసేనతో అయినా కలసి నడుస్తామని చెప్పడం లేదు. ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇలాంటి సమయంలో తెలంగాణలో టీడీపీని ఊపిరి పోసే ప్రయత్నం చేస్తే రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతాయన్నది ఆసక్తికరమే.

టీడీపీ బలపడిపోయి ఏకాఏకిన అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కానీ ఆ పార్టీకి గట్టి ప్రజెన్స్ ఉంటి .. కార్యకలాపాలు గట్టిగా నిర్వహిస్తే.. సానుభూతిపరులు ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఓటు  బ్యాంక్  బలంగా ఉంటుంది. సామాజికవర్గ పరంగా ఓసీల్లో కొన్ని వర్గాలు.. బీసీల్లో కొన్ని వర్గాలు టీడీపీకి ఇప్పటికీ సానుభూతిపరులుగా ఉన్నారు. కానీ ఆ ఓట్లు విజయానికి సరిపోవు. కానీ కూటమిగా మారితే మాత్రం అవి గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విషయం తెలిసే జగ్గారెడ్డి కాంగ్రెస్ ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని కాస్త ఆలస్యంగా స్పందించారని అనుకోవచ్చు. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు మరోసారి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ఆయన ముందు ముందు తీసుకునే నిర్ణయాలు మరిన్ని మార్పులకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

TDP again in Telangana politics

 

On 6th of this month AP CM Chandrababu Revanth Reddy met | ఈ నెల 6 న ఏపీ సీఎం చంద్రబాబు… రేవంత్ రెడ్డి భేటీ… | Eeroju news

Related posts

Leave a Comment