TDP | టీడీపీ పూర్వ వైభవం సాధ్యమేనా | Eeroju news

టీడీపీ పూర్వ వైభవం సాధ్యమేనా

టీడీపీ పూర్వ వైభవం సాధ్యమేనా

హైదరాబాద్, అక్టోబరు 9 (న్యూస్ పల్స్)

TDP

అదొక సుధీర్ఘ రాజకీయ చరిత్ర గల పార్టీ. ఆ పార్టీ ఏర్పాటు చేసింది తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్న సమయంలో ఆ పార్టీకి ఎదురు లేదు.. తిరుగు లేదు. కానీ విభజన అనంతరం ఏపీలో ఆ పార్టీ ప్లేస్ పదిలంగానే ఉంది. ప్రస్తుతం అధికారంలో కూడా ఉంది. ఆ పార్టీ ఏదో కాదు టీడీపీనేగత ఎన్నికల్లో కూటమి జనసేన, బీజేపీతో కలిసిన టీడీపీ ఎన్నడూ లేనంతగా ప్రజాదరణతో గెలిచి, ప్రపంచాన్ని ఏపీ వైపు చూసేలా చేసింది. ఏపీలో బలంగా ఉన్న ఈ పార్టీ.. తెలంగాణలో అంత ప్రభావం చూపలేని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ తన పాగా వేయాలని టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారన్నది పొలిటికల్ టాక్.

ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీగా టీడీపీని చెప్పవచ్చు. కూటమిగా ఏర్పడి విజయాన్ని అందుకున్నా.. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏపీలో పట్టు ఉంది కానీ.. తెలంగాణలో పార్టీ ఉనికి అంతగా లేదన్నది టీడీపీ నేతల అభిప్రాయం. తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ఏపీ వైపుకు మళ్లిన టీడీపీ, చిన్నగా తెలంగాణలో కూడా తన పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు పెద్ద ప్లాన్ వేసినట్లు పొలిటికల్ ఎనలిస్టుల విశ్లేషణ.ఉమ్మడి రాష్ట్రం సమయంలో టీడీపీకి తెలంగాణలో కూడా పట్టు ఉండేది.

తెలంగాణ వాదం రావడం, ఇప్పటి బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించడం, కేంద్రంలో అధికారంలో గల కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం చకచకా సాగాయి. ఆ తరుణంలో నాటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పగ్గాలు చేపట్టింది. ఇక ఉమ్మడి రాష్ట్ర సీఎంగా గల చంద్రబాబు తన మకాం ఏపీకి మార్చేశారు.ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ నుండి టీఆర్ఎస్ లోకి వలసలు సాగాయి. ఇక టీడీపీ పుంజుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీలో అధికార పగ్గాలు తన చేతిలో గల చంద్రబాబు.. తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవాన్ని కోరుకుంటున్నారని ఇటీవల కలిసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు.

అంతేకాదు తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారుఇదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ హాట్ టాపిక్. టీడీపీ తెలంగాణలో పుంజుకోవాలంటే.. ఏదో ఒక పార్టీ నుండి నాయకుల వలసలు సాగాల్సిందే. అయితే గతంలో టీడీపీ నుండి ఎక్కువగా వలసలు సాగింది ఇప్పటి బీఆర్ఎస్ లోకి. ఇప్పుడు టీడీపీలోకి వెళుతున్నట్లు ప్రకటించిన తీగల కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి వస్తున్న వారే.

అందుకే టీడీపీలోకి ఎక్కువగా బీఆర్ఎస్ నేతల వలసల పర్వం సాగుతుందని రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. ఏదిఏమైనా టీడీపీ తెలంగాణ పట్టు కోసం ప్రయత్నిస్తే.. ఏ పార్టీ నుండి వలసలు సాగుతాయో.. అసలు టీడీపీ పూర్వ వైభవం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏమి జరుగుతుందో వెయిట్ అండ్ సీ !

టీడీపీ పూర్వ వైభవం సాధ్యమేనా

 

Chandrababu VS Kiran Kumar | చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ | Eeroju news

Related posts

Leave a Comment