టీడీపీతో జాగ్రత్తగానే ఉండండి
హైదరాబాద్, అక్టోబరు 29, (న్యూస్ పల్స్)
TDP
రెండు రోజులుగా జరిగేదంతా చూస్తున్నారు. ఇంతటితో అయిపోలేదు.. రానున్న రోజుల్లో మన మీద అనేకవిధాలుగా బురదజల్లే ప్రయత్నాలు జరుగుతాయి. కేవలం కాంగ్రెస్ ఒక్కటే కాదు బీజేపీ, టీడీపీల సోషల్ మీడియా కూడా మనల్ని ట్రోల్స్ చేస్తాయంటూ పార్టీ కార్యకర్తలకు మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తాజా రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది. కేటీఆర్ చేసిన ట్వీట్ ఆధారంగా.. అన్ని రంగాలలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, వారి వైఫల్యాలను, అవినీతిని ఎండగడుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ మీద అసహనంతో ఉన్నారన్నారు. ఈ పోరాటంలో సర్వశక్తులూ ఒడ్డుతున్న బీఆర్ఎస్ నాయకత్వానికి, సోషల్ మీడియా వారియర్లకు హృదయపూర్వక ధన్యవాదాలంటూ తెలిపిన కేటీఆర్ మరికొన్ని విషయాలను ప్రస్తావించారు.
గత రెండు రోజులుగా మనం చూసింది సుధీర్ఘమైన కక్ష సాధింపు నాటకంలో తొలి అంకం మాత్రమేనని, రానున్న రోజుల్లో మన మీద అనేక విధాలుగా బురదజల్లడానికి ప్రయత్నిస్తారన్నారు.అందుకే మనం ఈ కుట్రలు, వ్యక్తిగత దాడులు, ఫేక్ ప్రాపగాండాలు, అబద్ధపు ఆరోపణలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందామని, వాళ్లు అక్రమ కేసులు పెడతారు, డీప్ ఫేక్ వీడియోలు వదులుతారు, పెయిడ్ ఆర్టిస్టులతో నాటకాలు వేయిస్తరంటూ ట్వీట్ లో తెలపడం విశేషం. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు వాళ్ల పెయిడ్ సోషల్ మీడియా ట్రోల్స్ అందరూ మన పార్టీ మీద దాడికి ఏకమవుతారని, ఈ దాడులను చూసి మనం గందరగోళానికి గురికావద్దు, వారి చర్యల వల్ల మన గురి నుంచి చూపు మరల్చవద్దంటూ సూచించారు కేటీఆర్.
తెలంగాణ ప్రజల బాగు కోసం మన పోరు కొనసాగిద్దామంటూ, కాంగ్రెస్ అవినీతిని, అసమర్ధతను, ద్వంద్వనీతిని ఎప్పటికప్పుడు బయటపెడదామన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 వాగ్ధానాల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలముందు పెట్టి ప్రజాక్షేత్రంలో వారిని శిక్షించాలని కేటీఆర్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.అయితే ఈ ట్వీట్ లో డీప్ ఫేక్ వీడియోలు వదులుతారంటూ తెలపడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. సాక్షాత్తు కేటీఆర్ ఇలాంటి కామెంట్స్ చేయడం వెనుక, ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటన్నది నాయకులకు అంతుపట్టడం లేదట.
సాధారణంగా తెలంగాణలో ఇప్పటి వరకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శల జోరు సాగుతుందికానీ కేటీఆర్ ఈసారి టీడీపీ కూడా ట్రోల్స్ చేస్తుందని హెచ్చరించడం విశేషం. అంటే కేటీఆర్ టార్గెట్ లో టీడీపీ కూడా ఉందన్న వాదనకు ఈ ట్వీట్ ఊతమిస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇంతకు కేటీఆర్ తన ట్వీట్ ద్వారా చెప్పిన జోస్యం.. వాస్తవమో కాదో కానీ, తమపై సాగుతున్న సోషల్ మీడియా ప్రచారాలను కార్యకర్తలు నమ్మవద్దంటూ.. అలర్ట్ చేసినట్లుగా భావించవచ్చు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణిలో కేటీఆర్ వైఖరి ఉందని, ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించి, శాంతిభద్రతల సమస్య సృష్టించడమే బీఆర్ఎస్ ప్లాన్ గా కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
TDP will come to power in Telangana soon | త్వరలోనే తెలంగాణలోనూ అధికారంలోకి టీడీపీ | Eeroju news