Tamilnadu elections:ఏడాది ముందే నుంచి ఎన్నికల హడావిడి

Tamil Nadu elections are a year away

Tamilnadu elections:ఏడాది ముందే నుంచి ఎన్నికల హడావిడి:తమిళనాట ఎన్నికలకు ఏడాది సమయం ఉంది.. అయితే అక్కడ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి.. ముగ్గురు బడా సినీ హీరోల వైఖరి ఇందుకు ప్రధాన కారణం.. సూపర్ స్టార్ రజనీకాంత్, విభిన్న కథానాయకుడు కమల్ హసన్, మాస్ హీరో విజయ్… ఈ ముగ్గురు ఒక్కో దారిలో ఉండడం ఇప్పుడు అక్కడ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారడానికి కారణం అయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. తమిళనాట రాజకీయాలను సినీ పరిశ్రమను వేరు చేసి చూడలేం. దశాబ్దాలుగా అక్కడ రుజువైన అనుభవాలెన్నో… డీఎంకే ని దశాబ్దాలుగా బలమైన పార్టీగా నడిపిన శక్తిగా చెప్పబడే దివంగత కరుణానిధి మొదలు.

ఏడాది ముందే నుంచి ఎన్నికల హడావిడి

చెన్నై, ఫిబ్రవరి 25
తమిళనాట ఎన్నికలకు ఏడాది సమయం ఉంది.. అయితే అక్కడ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి.. ముగ్గురు బడా సినీ హీరోల వైఖరి ఇందుకు ప్రధాన కారణం.. సూపర్ స్టార్ రజనీకాంత్, విభిన్న కథానాయకుడు కమల్ హసన్, మాస్ హీరో విజయ్… ఈ ముగ్గురు ఒక్కో దారిలో ఉండడం ఇప్పుడు అక్కడ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారడానికి కారణం అయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. తమిళనాట రాజకీయాలను సినీ పరిశ్రమను వేరు చేసి చూడలేం. దశాబ్దాలుగా అక్కడ రుజువైన అనుభవాలెన్నో… డీఎంకే ని దశాబ్దాలుగా బలమైన పార్టీగా నడిపిన శక్తిగా చెప్పబడే దివంగత కరుణానిధి మొదలు.. అంతటి కరుణానిధి తో విభేదించి సొంత పార్టీని స్థాపించి సక్సెస్ కొట్టిన అప్పటి సంచలన హీరో ఎం.జి.రామచంద్రన్.. కీలక బాధ్యతలు చేపట్టిన జయలలిత ఎంజీఆర్ మరణానంతరం పార్టీని లీడ్ చేసి దశాబ్దాన్నరకి పైగా పార్టీని సక్సెస్ చేయగలిగారు.. ఆ తర్వాత నటుడు విజయ్ కాంత్ కూడా పార్టీని స్థాపించి కొంతమేర తన ప్రభావం చూపగలిగారు.. అయితే దశాబ్దాలుగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా నేరుగా రాజకీయాల్లోకి వస్తారని బలమైన చర్చ జరిగిన ఆయన మాత్రం రాజకీయాల్లోకి రాలేదు.90వ దశకంలో డీఎంకేకి రజనీకాంత్ మద్దతు ఇచ్చిన సమయంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.. 2011లో రజనీకాంత్ ఏడీఎంకేకి ఓటు వేస్తూ ఉన్న దృశ్యాలు నిమిషాల్లో వైరల్ గా మారాయి.. ఆ ఎన్నికల్లో తన మద్దతు జయలలిత నేతృత్వంలోని ఏడీఎంకేకు ఇచ్చారన్న సంకేతాలు వెళ్లాయి.. అయితే రాజకీయంగా జయలలితతో నేరుగా రజనీకాంత్ కు ఎప్పుడూ విభేదాలు మాత్రమే చూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.. ఇద్దరి మధ్య చెప్పలేనంత వైరం అనేది ఎప్పుడు ఉండనే ఉండేది.. అవి తమిళనాడు మొత్తం తెలిసిన విషయమే.. 2017లో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయమని వార్తలు వచ్చాయి అభిమానులతో వరుస సమావేశాలు కూడా జరిగాయి.. కానీ ఉన్నటువంటి రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన ప్రకటించిన పరిస్థితిని కూడా చూశాం..రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదన్న ప్రకటన తర్వాత విజయ్ రాజకీయాల్లోకి వస్తారని చర్చ జరిగింది.. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడమూ జరిగింది.

నటుడు విజయ్ ఏర్పాటు చేసిన టీవీకె సొంతంగా కూటమిని ఏర్పాటు చేస్తుందా లేదా ఉన్న బలమైన పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందా అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు.. కానీ మొత్తానికైతే మాత్రం రాజకీయాల్లో తానేంటో చూపించాలన్న కసితో మాత్రం విజయ్ రాజకీయం చేస్తున్నట్టు తాజా పరిస్థితులు చెబుతున్నాయి.ఇక విజయ్ కంటే ముందే పార్టీని స్థాపించిన నటుడు కమలహాసన్ 2021లో పోటీ చేసి సత్తా చాటలేదు.. అయినా ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకె కూటమికి కమలహాసన్ మద్దతు ఇచ్చారు.. డీఎంకే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. కమల్ హాసన్ కు డీఎంకే రాజ్యసభ అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.. త్వరలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో తొలి స్థానం కమల్ కు ఇచ్చేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.. దీంతో డీఎంకేకి కమలహాసన్ దగ్గరగా ఉండడం అనేది క్లారిటీగా ఉన్న అంశం.ఇక నటుడు రజనీకాంత్ ఒకప్పుడు డిఎంకెకి మద్దతు ఇవ్వడం ఆ తర్వాత తాను వేసిన ఓటు ద్వారా ఏటీఎం కేకే మద్దతుగా ఉన్నానన్న సంకేతాలు ఇవ్వడం ఒకసారి తీవ్రంగా చర్చ జరిగింది. రెండింటికి మించి ప్రధాని నరేంద్ర మోడీతో రజనీకాంత్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుతం తమిళనాడులో జయలలిత మరణం తర్వాత మూడు ముక్కలుగా చీలిపోయిన ఏడిఎంకేని ఒక తాటిపైకి తెచ్చి కూటమిగా ఏర్పాటు చేసి ఎలాగైనా తమిళనాడులో అధికారం దక్కించుకోవాలనేది బిజెపి వ్యూహంగా ఉంది.ఈ క్రమంలోనే తాజాగా రజనీకాంత్ జయలలిత నివాసానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. జయంతి సందర్భంగా వెళ్లారని చెబుతున్నా.. జయలలిత భౌతికంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇంటికి వెళ్ళని రజనీకాంత్ ఇప్పుడు వెళ్లడం.. జయలలిత మేనకోడలితో మాట్లాడి జయలలితకు నివాళులర్పించడం అనేది ప్రస్తుతం రాజకీయంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది. బిజెపి వేసుకున్న ప్లాన్ లో భాగంగా ఏడిఎంకేలో వివాదాలను దూరం చేసి అందర్నీ కలిపి బిజెపికి కలిసోచ్చేలా రజనీకాంత్ వ్యవహరిస్తున్నారా..? అన్న చర్చ కూడా జరుగుతోంది.డీఎంకేకి సినీ పరిశ్రమ నుంచి కమలహాసన్.. ఇక నటుడు విజయ్ సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకోగా.. రజినీకాంత్ ను ఏడీఎంకే అనుకూలంగా మార్చుకుంటుందన్న డిస్కషన్ కూడా జరుగుతుంది.. తమిళనాడులో ముగ్గురు బడా సినీ హీరోలు తలోదిక్కుగా ఉంటున్న తాజా పరిణామాలు ఇటు తమిళనాడులో.. అటు జాతీయ రాజకీయాల్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారాయి.

Read more:Why AP Fiber Net Chairman GV Reddy Resigned | తెలుగుదేశం పార్టీకి షాక్ | రాజీనామ దేనికి సంకేతం |

Related posts

Leave a Comment