గుంటూరు, జూన్ 15, (న్యూస్ పల్స్) వైఎస్ఆర్‌సీపీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ పక్ష నాయకుడిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ నియమించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎంపీలతో సమావేశం అయిన తర్వాత జగన్ చేసిన ఈ ప్రకటన చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే మూడు పదవులు ఒకే వర్గానికి నిర్మోహమాటంగా కేటాయించారు. సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ వారిని పరిగణనలోకి తీసుకోలేదు. వైసీపీకి లోక్ సభలో నలుగురు మాత్రమే ఎంపీలు ఉన్నారు. అందులో ఇద్దరు రెడ్డి సామాజికవర్గం వారు, ఒకరు ఎస్సీ, మరొకర ఎస్టీ. అదే రాజ్యసభలో మాత్రం పదకొండు మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఐదుగురు రెడ్డి సామాజికవర్గం వారు. మరో ఆరుగురు నలుగురు బీసీ, ఒకరు ఎస్సీ, మరొకరు గుజరాత్…
Read More