YS Jagan : జగన్ బెయిల్ రద్దవుతుందా ? కడప, డిసెంబర్ 14, (న్యూస్ పల్స్) వైసీపీ అధినేత జగన్ కొత్త సమస్య ఏర్పడిందా? ఆయన బెయిల్ రద్దు పిటిషన్‌పై జనవరి 10న తేల్చనుంది సుప్రీంకోర్టు. దీంతో ఆయన బెయిల్‌పై కంటిన్యూ అవుతారా? ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్లడం మాటేంటి? ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి.జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసింది.జగన్ అక్రమాస్తుల కేసు ట్రయిల్ సరిగా జరగలేదని, ఆలస్యమవుతోందని గతంలో రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ…
Read More