వైసీపీలో ఆగని షాక్ లు విజయవాడ, డిసెంబర్ 14, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉదయం మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. మధ్యాహ్నం భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆ పని చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి లేఖ రిలీజ్ చేశారు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి గ్రంథి శ్రీనివాస్ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీకి దూరంగా ఉన్నారు. ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీతో చర్చలు పూర్తయ్యాయో కానీ ఆయన రాజీనామా చేశారు. ఇటీవల గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. దాదాపుగా వారం రోజుల పాటు ఆయన వ్యాపార వ్యవహారాల్లో ఉన్న అవకతవకలన్నింటినీ వెలికి తీశారని ప్రచారం జరుగుతోంది. అంతకు మందు నుంచే ఆయన వైసీపీకి దూరంగా…
Read More