మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్… జీసీసీ పాలసీ 4.0 కోసం కసరత్తు కాకినాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ జాబ్‌ను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఇంటి నుంచి పని చేయడం సౌలభ్యంగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంట్లో నుంచి పని చేయడం వల్ల శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉంటుందని ట్విట్టర్ వేదికగా సీఎం వ్యాఖ్యానించారు.రాష్ట్రంలోని మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అంతర్జాతీయ సైన్స్ లో మహిళలు, బాలికల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రోజురోజుకీ అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఇంటి నుండి పని చేసే సంస్కృతి పెరిగిందన్నారు. సైన్స్ రంగంలో విజయం సాధిస్తున్న మహిళలను…
Read More