విజయనగరం బరిలో టీడీపీ నిలిచేనా విజయనగరం, నవంబర్ 6 (న్యూస్ పల్స్) Vizianagaram విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హతా వేటు వేయడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. తనపై అనర్హతా వేటు వేయడాన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టులో విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చేసింది. ఈ కారణంగా కోర్టు జోక్యం చేసుకునే అవకాశాలు కూడా తక్కువేనని భావిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైనందున కొనసాగే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయి. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నికకు పదకొండో తేదీ వరకూ నామినేషన్ల గడువు ఉంది. 28వ తేదీన పోలింగ్ జరుగుతుంది. విజయనగరం ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘురాజు కుటుంబసభ్యులు ఎన్నికల సమయంలో టీడీపీలో…
Read MoreTag: Vizianagaram
Vizianagaram | విజయనగరం జిల్లాలో డయేరియా విలయ తాండవం | Eeroju news
విజయనగరం జిల్లాలో డయేరియా విలయ తాండవం విజయనగరం, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Vizianagaram విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా విలయ తాండవం చేస్తుంది. వాంతులు, విరోచనాలతో నాలుగు రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు. ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాలేదు. వంద మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. డయోరియాను అదుపు చేసేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు. గుర్ల మండలంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి డయోరియాను అదుపు చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇరవై రెండు మంది రోగులు జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరొక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్ కు తరలించారు. రోగులు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు వైద్యాధికారులు గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య…
Read MoreVizianagaram | విజయనగరంలో ఆగని కూల్చివేతలు | Eeroju news
విజయనగరంలో ఆగని కూల్చివేతలు విజయనగరం, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) Vizianagaram విజయనగరం జిల్లాలో హైడ్రా తరహా కూల్చివేతలు సంచలనంగా మారాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సైతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మాన్సాస్ ట్రస్ట్ భూముల్లో అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మించారనే కారణంతో అధికారులు కూల్చివేతలకు దిగారు. ప్రస్తుతం ఈ మాన్సస్ ట్రస్ట్ కు చైర్మన్ గా మాజీ కేంద్రమంత్రి, తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు వ్యవహరిస్తున్నారు.మాన్సస్ ట్రస్ట్ ను అశోక్ గజపతిరాజు తండ్రి డాక్టర్ పివిజి రాజు 1958లో నెలకొల్పారు. జిల్లాలో విద్యా వ్యవస్థ అభివృద్ధితో పాటు పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్న సదుద్దేశ్యంతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభించారు. ట్రస్ట్ ప్రారంభించిన తరువాత ఈ ట్రస్ట్ పర్యవేక్షణలో పలు విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఆ విద్యాసంస్థల…
Read MoreVizianagaram | 20 నుంచి పైడితల్లి ఉత్సవాలు | Eeroju news
20 నుంచి పైడితల్లి ఉత్సవాలు విజయనగరం, సెప్టెంబర్ 19, న్యూస్ పల్స్) Vizianagaram ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 30న ఉదయం 8 గంటల నుంచి దీక్షల విరమణ ఉంటుంది. దేవస్థానం ఛైర్మన్, ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారులు, భక్తుల సలహాలు, సూచనలతో ఉత్సవాలు నిర్వహిస్తారు. రాష్ట్ర పండగగా ప్రకటించినందున అమ్మవారికి టీటీడీ, ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పిస్తాయి. సెప్టెంబర్ 20న ఉదయం 8 గంటలకు చదురుగుడి వద్ద పందిరి రాట, మండల దీక్షతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఉదయం 11 గంటలకు వనం గుడి వద్ద ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 10న అర్ధమండల దీక్షలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 14న తొలేళ్ల ఉత్సవం, అక్టోబర్…
Read MoreBulk Airline Works | వడివడిగా విమానశ్రయ పనులు | Eeroju news
వడివడిగా విమానశ్రయ పనులు విజయనగరం,జూన్ 22, (న్యూస్ పల్స్) Bulk Airline Works : భోగాపురం విమానాశ్రయ పనులు వేగం పుంజుకున్నాయి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏపి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశం. త్వరితగతిన ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి విమానాలను రన్ వే పై దూసుకుపోయేలా చర్యలు చేపట్టాలని ఇటు నూతన రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్రం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందుకోసం నిరంతరం పర్యవేక్షిస్తుంది ఎపిఎడిసిఎల్. ఉత్తరాంధ్ర నడిబొడ్డున ఉన్న భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఆంధ్రప్రదేశ్ కే తలమానికం. ఇటు విశాఖకు, అటు శ్రీకాకుళం జిల్లాకు మధ్యలో ఉన్న భోగాపురంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరిగితే ప్రయాణికుల సౌకర్యంతో పాటు కార్గో కూడా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర విభజనలో భాగంగా ఏపికి కేటాయించిన కీలక ప్రాజెక్ట్స్‌లో…
Read Moreవిజయనగరంలో సగం మంది మహిళా నేతలే | In Vizianagaram half of the leaders are women | Eeroju news
విజయనగరం, జూన్ 15, (న్యూస్ పల్స్) చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ దశాబ్దాలుగా మహిళలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక రిజర్వేషన్లు లేకపోయినా ఆ జిల్లాలో మాత్రం 55% శాతం మహిళలే చట్టసభలకు వెళ్తుండటం అందరిని ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది. అంతే కాకుండా ఆ జిల్లాను నడుపుతున్న అధికారులు సైతం మహిళలే కావటం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇంతకీ 50 శాతం దాటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లా ఏది? అక్కడ మహిళలు ఎవరు? అనుకుంటున్నారా? అదే ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన విజయనగరం. కానీ ఇప్పుడు మాత్రం ఆ జిల్లాను మహిళలు సమర్థవంతంగా పాలిస్తున్నారు. ఈ జిల్లాకు జిల్లా కలెక్టర్ గా జి.నాగలక్ష్మి ఉండగా, జిల్లా ఎస్పీగా ఎమ్. దీపిక పాటిల్ ఉన్నారు. వీరిద్దరి సమర్ధవంతమైన పాలనలో జిల్లా ఎన్నికలను ఒంటి చేత్తో…
Read Moreఅశోకగజపతిరాజుకు గవర్నర్ గిరీ… | Governor Giri to Ashokagajapatiraj… | Eeroju news
విజయనగరం, జూన్ 14, (న్యూస్ పల్స్) కేంద్రంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా మారింది. ఎన్డీఏ లో రెండో పెద్ద పార్టీగా అవతరించింది. అందుకే కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. మిగతా భాగస్వామ్య పార్టీలకు లేనివిధంగా.. ఒక క్యాబినెట్ మంత్రి పదవితో పాటు సహాయ మంత్రి పదవి టిడిపి దక్కించుకుంది. రాష్ట్రంలో సైతం బిజెపికి ఒక మంత్రి పదవి కేటాయించారు చంద్రబాబు. అయితే ఎన్డీఏ సుస్థిరతకు పెద్దపీట వేసిన క్రమంలో.. తెలుగుదేశం పార్టీకి అన్నింటా ప్రాధాన్యం ఇవ్వాలని బిజెపి భావిస్తోంది. అందులో భాగంగా టిడిపికి గవర్నర్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అందుకే గవర్నర్ కోసం పేర్లు సూచించాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు గవర్నర్ల పదవీకాలం ముగిసింది. కొత్తవారిని నియమించాలని బిజెపి భావిస్తోంది. అందుకే తన…
Read More