Vizag Steel : ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్

vizag steel plant

 – ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖపట్టణం, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) కేంద్ర ప్ర‌భుత్వం విశాఖ‌ప‌ట్నం స్టీల్‌ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్‌-ఆర్ఐఎన్ఎల్‌)ను ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకు మొగ్గు చూపుతోంది. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోదం తెల‌ప‌డంతో చ‌ర్య‌ల‌కు పూనుకుంటుంది. అందులో భాగంగానే స్టీల్‌ప్లాంట్‌లోని ఒక్కో భాగం ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకు సిద్ధ‌ప‌డింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లోని వంద శాతం పెట్టుబడుల ఉప‌సంహ‌ర‌ణ‌కు సంబంధించి కేంద్ర ప్రక‌ట‌న వెలువ‌డిన త‌రువాత ఒక్కొక్క చ‌ర్య‌లు చేప‌ట్టింది.ఇప్ప‌టికే దాదాపు 2,000 మంది ఉద్యోగుల‌ను ఛ‌త్తీస్‌గ‌డ్‌లోని నాగర్‌న‌ర్ స్టీల్‌ప్లాంట్‌కు పంప‌డానికి సిద్ధ‌ప‌డింది. అలాగే 4,200 మంది స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ వ‌ర్క‌ర్స్‌ను తొలగించేందుకు వారికి ఎంట్రీ, ఎగ్జిట్ పాస్‌ల‌ను ఇవ్వ‌కుండా కుట్ర‌లు చేసింది. కార్మికులు పోరాటంతో యాజ‌మాన్యం వెన‌క్కి త‌గ్గింది. అలాగే బ్లాస్ ఫర్నేస్‌ను నిలిపివేసింది. ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను నిలిపివేసింది. మ‌ళ్లీ కార్మికుల…

Read More