విశాఖపట్టణం, జూన్ 14, (న్యూస్ పల్స్) రాష్ట్రంలో అధికారం మార్పు… అనేక మార్పులకు దారి తీస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని భూముల ధరల మార్పు జరుగుతోంది. టీడీపీ కూటమి గెలవడంతో వైజాగ్ లో భూముల ధరలు తగ్గుతున్నాయి. మరోవైపు అమరావతిలో భూముల ధరలు పెరుగుతున్నాయి. అమరావతి పరిసర ప్రాంతాల ప్రజల్లో మాత్రం పట్టలేనంత ఆనందం వెల్లువిరుస్తుంది.2014 రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఏర్పాటు అనివార్యం అయింది. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఎంపిక కోసం నాటి యూపీఏ-2 ప్రభుత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కే.సీ శివరామకృష్ణన్ చైర్మన్ గా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ నియమించింది. ఈ కమిటీ తుది నివేదికను 2014 ఆగస్టు 31లోపు అందజేయాలని శివరామకృష్ణన్ కమిటీని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వం చెప్పిన…
Read MoreTag: Visakhapatnam
అసెంబ్లీ స్పీకర్ కోసం… సీనియర్లు | For Assembly Speaker… Seniors | Eeroju news
విశాఖపట్టణం, జూన్ 14,(న్యూస్ పల్స్) కొత్త అసెంబ్లీలో కాబోయే స్పీకర్ ఎవరు? మంత్రివర్గం కొలువుదీరిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి స్పీకర్ పదవిపైనే పడింది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీని సమావేశపరిచి నూతన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకోవాలి. సభలో సీనియర్ నేతలను ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సభలో సీఎం చంద్రబాబుతో పాటు మరో ఇద్దరు నేతలు మాత్రమే ఏడు సార్లు గెలిచారు. చంద్రబాబు సీఎంగా ఉన్నందున ఆయనతో పాటు ఏడుసార్లు గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాల అయ్యన్నపాత్రుడులో ఎవరో ఒకరు ప్రొటెం స్పీకర్ అయ్యే అవకాశం ఉంది. అయితే, స్పీకర్ పదవిపై కన్నేసిన ఈ ఇద్దరు నేతలు ప్రొటెం స్పీకర్ గా ఉండేందుకు అంగీకరిస్తారా? అన్నదే ప్రశ్న.చంద్రబాబు 4.O ప్రభుత్వంలో అనేకమంది…
Read Moreప్రైవేటీకరణ చేస్తారా… ఆపేస్తారా… | Will Privatization… Stop… | Eeroju news
విశాఖపట్టణం, జూన్ 14, (న్యూస్ పల్స్) విశాఖ ఉక్కు…ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను..2021లో అమ్మకానికి పెట్టింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. ప్లాంట్‌లో 100 శాతం వాటా విక్రయించడంతో పాటు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నుంచి వైదొలగాలని కేంద్రం నిర్ణయించుకుంది. స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్ బాధ్యతలతో సహా పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిర్ణయంతో భగ్గుమన్న కార్మిక సంఘాలు, వామపక్షాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పటినుంచి అలుపెరగని పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అంశంగా కూడా మారింది విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశం. అయితే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కార్మిక సంఘాలు, స్థానికులు వ్యతిరేకిస్తున్నా కూడా ముందడుగే వేసింది కేంద్రం ప్రభుత్వం.అయిదేళ్లుగా విశాఖ ఉక్కు పరిశ్రమ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. సొంత గనులు లేకపోవడంతో…
Read More