Rushikonda | రుషికొండ మిస్సింగ్ ఫైల్స్ | Eeroju news

రుషికొండ మిస్సింగ్ ఫైల్స్

రుషికొండ మిస్సింగ్ ఫైల్స్ విశాఖపట్టణం, నవంబర్ 14, (న్యూస్ పల్స్) Rushikonda అద్భుత కట్టడం చుట్టూ అంతులేని చర్చ కొలిక్కి రావడం లేదు. ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత కూడా..ఆ సౌధం చుట్టూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. రుషికొండ భవనాలకు సంబంధించిన ప్రతీ విషయం చర్చనీయాంశం అవుతోంది. అయితే ఇన్నాళ్లుగా ఆ భవనాలను దేని కోసం వాడుతారోనన్న చర్చ జరిగింది. కానీ ఇప్పుడు రుషికొండ నిర్మాణాల ఫైళ్లు, ఫర్నీచర్ లెక్కలు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయట. నిర్మాణ అనుమతుల ఫైళ్లు, కొన్ని కీలక పేపర్లు ఇప్పటికే కనిపించడం లేదంటున్నారు.కొండపై గతంలో ఉన్న రిసార్టును కూలగొట్టేందుకు తీసుకున్న అనుమతుల ఫైళ్లు కూడా గయాబ్‌ అయినట్లు తెలుస్తోంది. పాత రిసార్టులో 80 గదులతో పాటు ఒక ఫంక్షన్‌ హాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఉండేవి. వాటిల్లో ఉండాల్సిన దాదాపు రూ.50 కోట్ల విలువైన…

Read More

Rushikonda | రుషికొండ భవనాలపై ప్రజల సలహాలు | Eeroju news

రుషికొండ భవనాలపై ప్రజల సలహాలు

రుషికొండ భవనాలపై ప్రజల సలహాలు విశాఖపట్టణం, నవంబర్ 5, (న్యూస్ పల్స్) Rushikonda విశాఖ పర్యటనలో రుషికొండ కట్టడాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు..విలాసాల కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్‌ కట్టుకున్నారని మండిపడ్డారు. రాజులు, చక్రవర్తులు కూడా ఇలాంటి భవనాలు నిర్మించుకోలేదన్న ముఖ్యమంత్రి…వందల కోట్ల ప్రజాధనంతో వ్యక్తిగత విలాసాల కోసం కట్టిన ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నామన్నారు. ఈ మేరకు సలహాలు-సూచనలను ఇవ్వాలంటూ ప్రజలకు సూచించారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసి రుషికొండపై ఏడు బ్లాక్‌ల్లో భవనాలు నిర్మించారు. అయితే జగన్‌ ప్రభుత్వం ఓటమి పాలవడంతో..ఈ భారీ భవనాలు చర్చనీయాంశమయ్యాయి. గత నాలుగు నెలలుగా ఇక్కడి భవనాలు, ఉద్యానవనాల నిర్వహణ, విద్యుత్‌ వినియోగం కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుండడంతో.. దీనిపై ఒక నిర్ణయానికి…

Read More

YCP | వైసీపీ సైలెంట్ ప్లానింగ్…. | Eeroju news

వైసీపీ సైలెంట్ ప్లానింగ్....

వైసీపీ సైలెంట్ ప్లానింగ్…. విశాఖపట్టణం, నవంబర్ 4, (న్యూస్ పల్స్) YCP మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా నేడు కూటమిపై విమర్శల జోరు సాగిస్తున్నారు. ఎన్నికల ఫలితాల షాక్ నుండి ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలు కోలుకుంటున్నారని చెప్పవచ్చు. కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం కాగా, మాజీ సీఎం జగన్ ఇటీవల నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ పాలన కాలంలో అంతా తానై ముందుండి నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి కొద్దిరోజులు సైలెంట్ అయ్యారు. ఇటీవల టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి పోలీసుల విచారణకు సజ్జల హాజరయ్యారు.అప్పుడు కనిపించిన సజ్జల, తాజాగా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా విమర్శల స్పీడ్ పెంచారని చెప్పవచ్చు. ఆదివారం తిరుపతిలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదని,…

Read More

Botsa Satyanarayana | సత్తిబాబు దూరం అవుతున్నారా.. | Eeroju news

సత్తిబాబు దూరం అవుతున్నారా..

సత్తిబాబు దూరం అవుతున్నారా.. విశాఖపట్టణం, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) Botsa Satyanarayana ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. సామాజికపరంగా, ఆర్థికంగా ఆయన బలమైన నేత. ఉత్తరాంధ్రలో ఆయన మోస్ట్ సీనియర్ మాత్రమే కాదు.. ఎన్నో ఉన్నత పదవులు అనుభవించిన బొత్స సత్యనారాయణ వైసీపీ హైకమాండ్ పట్ల అసంతృప్తిగా ఉన్నారా? జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు రుచించడం లేదా? అన్న ప్రశ్నకు నిన్నటి జగన్ విజయనగరం జిల్లా పర్యటన స్పష‌్టం చేస్తుంది. ఎందుకంటే తన సొంత జిల్లాకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వస్తే బొత్స సత్యనారాయణ మాత్రం హాజరు కాలేదు. ఎక్కడా ఆయన టూర్ లో కనిపించలేదు. గొర్ల గ్రామంలో పర్యటించిన జగన్ డయేరియా బాధితులను పరామర్శించారు. మృతి చెందిన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అయితే తన సొంత జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు కనీసం…

Read More

Sarada Peetham | శారదా పీఠం..అక్రమాల పుట్ట | Eeroju news

శారదా పీఠం..అక్రమాల పుట్ట

శారదా పీఠం..అక్రమాల పుట్ట విశాఖపట్టణం, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) Sarada Peetham శారదాపీఠం.. పేరుకే పీఠం కానీ వివాదాల పుట్ట అనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే పీఠం చెప్పేదొకటి, తీరా చేసేది ఇంకొకటి. ఒక్కో ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కో రకంగా ఉంటూ వత్తాసు పలకడం, సర్కారు కేటాయించిన భూములను వాణిజ్యపరంగా వాడుకోవడం పరిపాటిగా వస్తోంది. కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడిగిందే తడవుగా, అది ఏదైనా సరే ఇష్టానుసారం ఇచ్చేశారని ఆరోపణలు కోకొల్లలు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత శారదాపీఠానికి వరుస షాక్‌లు ఇస్తోంది. అటు విశాఖపట్నంలో, ఇటు తిరుమలలో కేటాయించిన భూములును రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకున్నది. వివాదాస్పద పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి ఈ…

Read More

Rushikonda Palace | రుషికొండ కరెంట్ కోసమే.. ఆస్తులు అమ్ముకోవాలా… | Eeroju news

రుషికొండ కరెంట్ కోసమే.. ఆస్తులు అమ్ముకోవాలా...

రుషికొండ కరెంట్ కోసమే.. ఆస్తులు అమ్ముకోవాలా… విశాఖపట్టణం, అక్టోబరు 22, (న్యూస్ పల్స్) Rushikonda Palace విశాఖపట్నం సమీపంలోని రుషికొండపై గత ప్రభుత్వం అద్భుతమైన భవనాలను నిర్మించింది. ఎన్నికల కోడ్ వచ్చే వరకు అక్కడ పనులు జరిగాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం మారింది. దీంతో అప్పటినుంచి అక్కడ పెండిగ్ పనులు జరగడం లేదు. కానీ.. కరెంట్ బిల్లు మాత్రం లక్షల్లో వస్తోంది.గత ప్రభుత్వం విశాఖ సమీపంలోని రుషికొండపై రూ.500 కోట్లతో భవనాలను నిర్మించింది. అయితే.. ప్రస్తుతం ఆ భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. ఏ కార్యక్రమాల కోసం వాటిని వినియోగించడం లేదు. కొత్తగా నిర్మించిన ఐదు భవనాలు పర్యాటక అవసరాలకు ఉపయోగపడవని కూటమి నేతలు చెబుతున్నారు. కన్వెన్షన్‌ సెంటర్‌గా మార్చుకునే పరిస్థితి కూడా లేదని అంటున్నారు. ప్రభుత్వ కార్యకలాపాల కోసం వాడుకుందాం అనుకున్నా.. చాలా భారమవుతుందని చెబుతున్నారు.…

Read More

Sarada Peetham | శారద పీఠానికి షాక్… | Eeroju news

శారద పీఠానికి షాక్...

శారద పీఠానికి షాక్… హైదరాబాద్ కు మకాం మార్చేసిన స్వరూపనంద విశాఖపట్టణం, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Sarada Peetham విశాఖ శారదా పీఠానికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వైసిపి ప్రభుత్వం కేటాయించిన స్థల అనుమతిని రద్దు చేసింది. చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. వైసిపి హయాంలో శారదా పీఠం కళకళలాడింది. పీఠాధిపతి స్వామి స్వరూపానంద కు ఎనలేని ప్రాధాన్యత లభించేది. ఆయన సిఫారసులకు జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చేది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే స్వరూపానంద చేసిన యాగాలతోనే జగన్ కు అధికారం దక్కిందన్నది అప్పట్లో జరిగిన ప్రచారం. దీంతో వైసీపీ నేతల తాకిడి పీఠానికి పెరిగింది. ఏటా జరిగే పీఠం వార్షికోత్సవాలకు, పర్వదినాలకు విశాఖ శారదా పీఠానికి…

Read More

Visakhapatnam | విశాఖపట్నానికే ప్రాజెక్టు 77 | Eeroju news

విశాఖపట్నానికే ప్రాజెక్టు 77

విశాఖపట్నానికే ప్రాజెక్టు 77 విశాఖపట్టణం, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) Visakhapatnam ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి. విశాఖలో లులు మాల్, మల్టీప్లెక్స్ ఏర్పాటు చేస్తామని లులు గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. అటు టీసీఎస్ సైతం విశాఖపట్నానికి తరలిరానున్నట్లు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల వెల్లడించారు. ఇప్పుడు విశాఖను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే విధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా అణుశక్తితో దాడి చేయగలిగే రెండు జలాంతర్గాములను దేశీయంగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో పాటుగా 31 ఆయుధాలతో కూడిన MQ-9B ప్రిడేటర్ డ్రోన్‌లను అమెరికా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది.…

Read More

Swarupananda | స్వరూపనంద భూములు వెనక్కి..? | Eeroju news

స్వరూపనంద భూములు వెనక్కి..?

స్వరూపనంద భూములు వెనక్కి..? విశాఖపట్టణం, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) Swarupananda గత ఐదేళ్లలో మార్మోగిన పేరు స్వామి స్వరూపానంద. విశాఖ శారదా పీఠానికి చెందిన స్వరూపానంద గత ఐదేళ్ల కాలంలో రాజ గురువుగా మారిపోయారు. 2019లో జగన్ అధికారంలోకి రావడానికి స్వరూపానంద చేసిన యాగాలే కారణమని వైసిపి నేతలు విశ్వసించారు.గత ఐదేళ్లుగా శారదా పీఠానికి క్యూ కట్టారు. పర్వదినం నాడు జగన్ ఆగమేఘాలపై విశాఖ శారదా పీఠంలో వాలిపోయేవారు.అటు స్వామీజీ సైతం రాష్ట్ర ప్రభుత్వ ఆగమ సలహాదారుడిగా వ్యవహరించేవారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చేర్పులు మార్పులు కూడా చేయించినట్లు ఆరోపణలు ఉండేవి. ఏడాదిలో రెండుసార్లు అయినా జగన్ విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శించేవారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో విశాఖ శారదా పీఠానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి రాష్ట్రంలో పేరు…

Read More

YS Sharmila Deeksha | దీక్షకు సిద్ధమవుతున్న షర్మిళ | Eeroju news

దీక్షకు సిద్ధమవుతున్న షర్మిళ

దీక్షకు సిద్ధమవుతున్న షర్మిళ విశాఖపట్టణం, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) YS Sharmila Deeksha విశాఖలో షర్మిల స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా దీక్షకు దిగారు. చంద్రబాబు నలభై ఎనిమిది గంటల్లో 4200 మంది స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట కార్మికుల ను వెంటనే పనిలోకి తీసుకోనేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే నిరాహారదీక్ష ప్రారంభిస్తానని హెచ్చరించారు. కూర్మనపాలెం స్టీల్ ప్లాంట్ దీక్ష శిభిరంలో కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. దీక్షా శీబిరం వద్ద రోడ్డుపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసన తెలిపారు. కనీసం నోటీసు ఇవ్వకుండా కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తుండటం దారుణమని.. నిర్వాసితులకు ఉద్యోగాలిస్తామని ఇవ్వకుండా రోడ్డున పడేశారని మండిపడ్డారు. కనీసం కాంట్రాక్ట్ పనులు చేసుకోనే వీలులేకుండా చేశారని.. ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీనేనని.. కాంగ్రెస్ పార్టీ కేంద్ర,…

Read More