Bhavani Deekshalu | నవంబర్ 11 నుంచి భవానీ దీక్షలు | Eeroju news

నవంబర్ 11 నుంచి భవానీ దీక్షలు

నవంబర్ 11 నుంచి భవానీ దీక్షలు విజయవాడ, నవంబర్ 9, (న్యూస్ పల్స్) Bhavani Deekshalu ఏటా కార్తీక మాసంలో మొదలయ్యే భవానీ దీక్షలు నవంబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 40 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ దీక్షలు చేపడతారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భవానీ దీక్షలు ధరిస్తారు. ఏటా లక్షలాది మంది భవానీ దీక్షదారులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తుంటారు. 2007 వరకు దసరా ఉత్సవాలతో పాటు భవానీ దీక్షల కార్యక్రమాన్ని నిర్వహించే వారు. దసరా ఉత్సవాల చివరి రోజుల్లో దీక్షల విరమణ చేసేవారు. భవానీ దీక్షదారుల్ని దర్శనాలకు అనుమతించే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడంతో దసరా ఉత్సవాలో సంబంధం లేకుండా భవానీ దీక్షల్ని చేపడుతున్నారు. ఈ…

Read More

CM Chandra babu | కేంద్రమంత్రులు… అయితే ఏంటీ.. | Eeroju news

కేంద్రమంత్రులు... అయితే ఏంటీ..

కేంద్రమంత్రులు… అయితే ఏంటీ.. విజయవాడ, నవంబర్ 9, (న్యూస్ పల్స్) CM Chandra babu కేంద్రంలోనూ,రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీ అనుకూల ప్రభుత్వాలే ఉన్నాయి.పైగా టిడిపి సహకారం లేనిది కేంద్ర ప్రభుత్వం నడవని పరిస్థితి.ఈ తరుణంలో టిడిపికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులపై చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో అభివృద్ధి పనులపై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం.ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే..పెద్ద ఎత్తున అభివృద్ధి చేపట్టాలని భావిస్తోంది.అందులో భాగంగా రూ.5407 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఎన్టీఆర్, గుంటూరు, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్య సాయి, శ్రీకాకుళం అనకాపల్లి, కృష్ణ, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లనిర్మాణాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అయితే ఇచ్చాపురంలో జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరు…

Read More

Pawan Panda in politics | పాలిటిక్స్ లో పవన్ పంధా | Eeroju news

పాలిటిక్స్ లో పవన్ పంధా

పాలిటిక్స్ లో పవన్ పంధా విజయవాడ, నవంబర్ 8, (న్యూస్ పల్స్) Pawan Panda in politics ఆయన భగభగమండే భగత్‌సింగ్. తప్పు జరిగితే నిలదీసే వకీల్ సాబ్. జనం తరఫున గళమై వాయిస్ వినిపించే జనసేనాని. ఇలా సినిమాల్లో అయినా.. పాలిటిక్స్‌లో అయినా పవన్ పంథానే సెపరేటు. ఆయన ఆలోచనా విధానం అంతకన్నా వేరు. జనం మెచ్చిన నేతగా ఉండాలనేదే ఆయన అభిమతం. అందుకే పదవిలో ఉన్నా లేకపోయినా.. జనసేనానిది జనం గొంతె. ఏపీ ప్రభుత్వంలో కీలక పోస్ట్‌లో ఉన్నా..తన వైఖరిని మాత్రం మార్చుకోవడం లేదు పవన్. పదవి ఉంటే పెదవులు మూసుకుపోతాయి. రాజకీయాల్లో ఇదో నానుడి ఉంది. అపోజిషన్ లో ఉన్నప్పుడు అందరూ మాట్లాడుతారు. పవర్ లో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపై గళమెత్తే వారికే ఓ రేంజ్ ఉంటుంది. అలా ఏపీ డిప్యూటీ…

Read More

Operation Gudivada.. Chandrababu Focus on Kodali Nani | టీడీపీ ఆపరేషన్ గుడివాడ … | Eeroju news

టీడీపీ ఆపరేషన్ గుడివాడ ...

టీడీపీ ఆపరేషన్ గుడివాడ … విజయవాడ, నవంబర్ 8, (న్యూస్ పల్స్) Operation Gudivada.. Chandrababu Focus on Kodali Nani గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమైంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్వస్థలమైన ఆ సెగ్మెంట్‌పై తిరిగి పట్టు సాధించిన టీడీపీ దాన్ని మరింత బిగించేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. 1983లో ఎన్టీఆర్ గుడివాడ నుంచి గెలిచిన నాటి నుంచి మధ్యలో ఒక్క 1989 ఎన్నికలు మినహా 2009 వరకు అక్కడ టీడీపీ జెండానే ఎగురుతూ వచ్చింది. 2004 లో తొలిసారి టీడీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని 2009లో రెండోసారి కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే గానే అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత పార్టీ మారి టీడీపీ రెబల్ అవతారమెత్తారు. వైసీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ…

Read More

Pawan Kalyan | మరాఠ ప్రచారానికి పవన్ కళ్యాణ్ | Eeroju news

మరాఠ ప్రచారానికి పవన్ కళ్యాణ్

మరాఠ ప్రచారానికి పవన్ కళ్యాణ్ విజయవాడ, నవంబర్ 8, (న్యూస్ పల్స్) Pawan Kalyan మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు జాతీయ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే మిత్రులను రంగంలోకి దించాలని ఆలోచన చేస్తోంది బీజేపీ. దీంతో కొంతైనా గట్టెక్కవచ్చని ఆలోచన చేస్తోంది బీజేపీ.రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువు ఉండరు. ఎప్పుడు.. ఎవరు.. ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియని పరిస్థితి. దేశంలో ప్రధాన రాజకీయ పార్టీల చూపంతా మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై పడ్డాయి.శివసేన, ఎన్సీపీని చీల్చిన బీజేపీ, కొన్నాళ్లు మహారాష్ట్రను తెర వెనుక నుంచి రూలింగ్ చేసింది. ఈ విషయాన్ని రాజకీయ నేతలు ఓపెన్‌గా చెబుతున్నారు. ఈ పీఠాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఆలోచన చేస్తున్నారు. కమలనాథులు.బుధవారం ఢిల్లీ వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…

Read More

Chandrababu | నిన్న రాష్ట్ర మంత్రి… ఇవాళ కేంద్ర మంత్రి | Eeroju news

నిన్న రాష్ట్ర మంత్రి... ఇవాళ కేంద్ర మంత్రి

నిన్న రాష్ట్ర మంత్రి… ఇవాళ కేంద్ర మంత్రి బాబు క్లాస్ విజయవాడ, నవంబర్ 8, (న్యూస్ పల్స్) Chandrababu మొన్న రాష్ట్రమంత్రి సుభాష్‌కు క్లాస్ తీసుకున్న చంద్రబాబు నేడు రామ్మోహన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలతో సంబంధం ఉన్న కార్యక్రమాలకు హాజరుకాకపోవడంపై సీరియస్‌. వేరే కార్యక్రమాలు ఉంటే వర్చువల్‌గానైనా రావాలని హితవు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇవాళ సబ్‌స్టేషన్‌ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేందమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరుకాలేదు. ఏం జరిగిందని ఆరా తీసిన చంద్రబాబు… ప్రజలతో సంబంధం ఉన్న కార్యక్రమాలకు డుమ్మాకొట్టడం మంచిది కాదని సూచించారు. సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎక్కడ ఉన్నారని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విజయవాడలో వేరే కార్యక్రమం ఉందని అక్కడకు వెళ్లారని అధికారులు చెప్పారు. దీనిపై చంద్రబాబు కాస్త అసహనం…

Read More

Regional Rural Banks Merge | దేశంలో 15 గ్రామీణ బ్యాంకుల విలీనం | Eeroju news

దేశంలో 15 గ్రామీణ బ్యాంకుల విలీనం

దేశంలో 15 గ్రామీణ బ్యాంకుల విలీనం విజయవాడ, నవంబర్ 7, (న్యూస్ పల్స్) Regional Rural Banks Merge ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనానికి కేంద్రం మరో అడుగు ముందుకేసింది. నవంబర్ 20లోగా గ్రామీణ బ్యాంకుల స్పాన్సర్ బ్యాంకుల నుంచి విలీనంపై అభిప్రాయాలు సేకరించనుంది. దేశంలోని 43 గ్రామీణ బ్యాంకులను 23గా విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది.బ్యాంకుల విలీనంపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్చుల నియంత్రణ కోసం దేశంలోని పలు గ్రామీణ బ్యాంకుల విలీనానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. దశల వారీగా బ్యాంకుల విలీన ప్రక్రియ చేపట్టిన ఆర్థిక మంత్రిత్వ శాఖ…నాలుగో దశలో గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ చేపట్టనుంది. ఈ దశలో 43 గ్రామీణ బ్యాంకుల సంఖ్య వీలనం చేసి 28కు తగ్గించనుంది. విలీన ప్రక్రియకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రణాళికలు సిద్ధం…

Read More

YS Vijayamma | బయటకొచ్చిన విజయమ్మ… | Eeroju news

బయటకొచ్చిన విజయమ్మ...

బయటకొచ్చిన విజయమ్మ… విజయవాడ, నవంబర్ 6, (న్యూస్ పల్స్) YS Vijayamma గత కొద్దిరోజులుగా తన వాహనం పాడైపోయిన ఘటనకు సంబంధించి జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు విజయమ్మ నేరుగా రంగంలోకి దిగారు. మీడియాకు ఒక వీడియోను పంపించారు. అందులో విజయమ్మ అనేక విషయాలపై స్పష్టత ఇచ్చారు. ఆమె లేఖ రాసిన విధానాన్ని సాక్షి తప్పు పట్టింది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుకు జరుగుతున్న కుట్రలో విజయమ్మకు కూడా పాత్ర ఉందని ఆరోపించింది. వాస్తవానికి ఆ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా మారింది. దీనిని ఓవర్గం మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. ఇదే క్రమంలో ఆమధ్య విజయమ్మ వాహనం పాడైపోతే.. దాని వెనుక రకరకాల కథనాలు అల్లింది. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తారాస్థాయికి వెళ్ళింది. ఒక పార్టీ అయితే విజయమ్మ కారు పాడైన ఘటనను…

Read More

Jagan mohan reddy | 11వ తేదీ…. 11 గంటలకు.. 11 మంది వస్తారా… | Eeroju news

11వ తేదీ.... 11 గంటలకు.. 11 మంది వస్తారా...

11వ తేదీ…. 11 గంటలకు.. 11 మంది వస్తారా… విజయవాడ, నవంబర్ 5, (న్యూస్ పల్స్) Jagan mohan reddy ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను జనవరి పదకొండో తేదీ నుంచి జరగనున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్ కసరత్తు పూర్తయింది. అయితే ఇప్పుడు ఖరారు చేసిన తేదీ , సమయం మాత్రం  యాధృచ్చికంగా ఉన్నా.. అవి వైసీపీని సోషల్ మీడియాలో ట్రోల్ చేసేలా ఉండటం వైరల్ గా మారింది. వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందుకే పదకొండు పేరుతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు టీడీపీ , జననస, బీజేపీ పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. అన్ని…

Read More

AP New ration cards | జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు | Eeroju news

జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు

జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు విజయవాడ, నవంబర్ 4, (న్యూస్ పల్స్) AP New ration cards   కొత్త రేషన్ కార్డులపై ఏపీ సర్కార్ అప్డేట్ ఇచ్చింది. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తుంది. అలాగే పాత కార్డుల స్థానంలో కొత్త డిజైన్ తో కార్డులు జారీ చేయనున్నారు. వినియోగంలో లేని కార్డులను తొలగించి కొత్త కార్డులు జారీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది.కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. కొత్తగా పెళ్లైన వారితో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రస్తుత కార్డుల రీడిజైన్‌ తో పాటు కొత్త లబ్ధిదారులందరికీ రేషన్…

Read More