Online registration | ఇంకా అందుబాటులోకి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ | Eeroju news

ఇంకా అందుబాటులోకి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్

ఇంకా అందుబాటులోకి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ విజయవాడ, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Online registration సమస్య ఏదైనా తాము పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదేపదే చెబుతోంది. గత జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు.పౌర ఫిర్యాదుల్ని స్వీకరించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారంలోకి రాగానే ప్రకటించారు. ఈ క్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించడానికి ముఖ్యమంత్రే స్వయంగా ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో, ఉండవల్లి నివాసం వద్ద పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సైతం…

Read More

Hydra | ఏపీలోనూ హైడ్రా..? | Eeroju news

ఏపీలోనూ హైడ్రా..?

ఏపీలోనూ హైడ్రా..? విజయవాడ, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Hydra తెలంగాణ‌లో ‘హైడ్రా’ చ‌ర్య‌ల‌పై సాధార‌ణ ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతున్న నేప‌థ్యంలో ఏపిలో కూడా అలాంటి త‌ర‌హా చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వం యోచిస్తోంది. హైడ్రా లాంటి సంస్థ‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వంలో చ‌ర్చ జ‌రుగుతోంది.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చూస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. తెలంగాణ‌ మాదిరిగా చెరువులు, న‌ల్లాల‌ను ఆక్ర‌మించుకుని చేసిన‌ నిర్మాణాల‌కంటే… ప్ర‌భుత్వ భూముల‌ను క‌బ్జా చేసి, స్థలాల‌ను ఆక్ర‌మించుకొని నిర్మాణాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఎక్కువగా ప్ర‌భుత్వ భూములు క‌బ్జాలు జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అలాగ‌ని అంత‌కుముందున్న ప్ర‌భుత్వంలో కూడా సర్కార్ భూముల క‌బ్జాపై ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు అన్ని జిల్లాల్లోనూ ప్ర‌భుత్వ భూముల క‌బ్జా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.అయితే ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌న‌ేది ఆసక్తిగా ఉంది. ప్ర‌భుత్వ…

Read More

YSR Colony | వైయస్సార్ కాలనీలో ఉద్రిక్తత | Eeroju news

YSR Colony

వైయస్సార్ కాలనీలో ఉద్రిక్తత కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని స్థానికుల ధర్నా విజయవాడ YSR Colony విజయవాడ వైఎస్సార్ కాలనీలో గురువారం ఉద్రిక్త నెలకొంది. కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని స్థానికులు ధర్నా కు దిగారు. రాత్రి సమయాల్లో ఇళ్ల వద్దే గంజాయి తాగుతూ గంజాయి బ్యాచ్ స్థానిక మహిళలను ఇబ్బంది పెడుతుంది. దాంతో మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కాలనీలో దోపిడీ దొంగతనాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టాలని డిమాండ్చేసారు. స్థానిక పోలీసులు నిఘా విఫలమయ్యారని మహిళల ఆవేదన. పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ను అరికట్టాలని మహిళలు డిమాండ్ చేసారు.   Huge seizure of marijuana | భారీ స్థాయిలో గంజాయి స్వాధీనం | Eeroju news

Read More

Amaravati | అమరావతి డీపీఆర్…. | Eeroju news

Amaravati

అమరావతి డీపీఆర్…. విజయవాడ, ఆగస్టు 29, (న్యూస్ పల్స్) Amaravati ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిపై దృష్టి పెట్టింది. ఇప్పటికీ అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో అమరావతి యధా స్థానానికి రానుంది. మరోవైపు అక్కడ నిర్మాణాల విషయంలో నిపుణులు అధ్యయనం చేశారు. అవి పనికొస్తాయా? లేకుంటే పునర్నిర్మాణం జరపాలా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రపంచ బ్యాంకు బృందం వచ్చి పరిశీలించింది. అక్టోబర్లో ఈ నిధుల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఇదే సమయంలో అమరావతి రాజధానిని అనుసంధానిస్తూ రోడ్డు, రవాణా మార్గాన్ని మరింత మెరుగుపరచాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పలు రైల్వే…

Read More

Jagan’s silence.. What is the answer? | జగన్ మౌనం.. దేనికి సమాధానం | Eeroju news

Jagan's silence.. What is the answer?

జగన్ మౌనం.. దేనికి సమాధానం విజయవాడ, ఆగస్టు 28  (న్యూస్ పల్స్) Jagan’s silence.. What is the answer? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటాయి. ఒకరు ఎత్తు వేస్తే.. మరొకరు పైఎత్తు వేస్తూ రాజకీయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలపై ఎప్పుడు ఓ కన్నేసి ఉంచుతారు. అందుకే లీడర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ.. కొందరు వైసీపీ లీడర్లు మాత్రం ఎన్నికల్లో ఓడిపోయినా మారడం లేదు. దీంతో ఆ పార్టీకి, పార్టీ అధినేతకు తీవ్ర నష్టం జరుగుతోంది. అయితే.. ఇలాంటి నేతలపై జగన్ ఏం చర్యలు తీసుకుంటున్నారు అని కేడర్ ప్రశ్నిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ ఓడిపోయింది. దీంతో జగన్ కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నా.. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై బయటకు వచ్చి స్పందించారు.…

Read More

100 day plan | ముందుకు సాగని 100 రోజుల ప్రణాళిక | Eeroju news

100 day plan

ముందుకు సాగని 100 రోజుల ప్రణాళిక విజయవాడ, ఆగస్టు 28  (న్యూస్ పల్స్) 100 day plan ఆంధ్రప్రదేశ్‌లో రెండున్నర నెలల క్రితం ఏర్పాటైన కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన, ప్రణాళికపై దృష్టి పెట్టింది. మొదటి 100 రోజుల పాలనలో గత ప్రభుత్వం కంటే భిన్నంగా చేశామని చెప్పేలా నిర్ణయాలు, కార్యాచరణ, విజయాలు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. దీంతో ఆ మేరకు లక్ష్యాలను ఏర్పరచుకుని ఆ టార్గెట్ పై దృష్టి సారించాయి అన్ని శాఖలు.. సెప్టెంబర్ 22వ తేదీకి 100 రోజుల పూర్తికానున్నాయి. ఇక కేవలం 26 రోజుల గడువు మాత్రమే ఉండడంతో వడివడిగా 100 ప్రణాళికకు అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రజల కోటి ఆశలతో జూన్ 12వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పగ్గాలు…

Read More

Uncertainty continues over nominated posts | నామినేటెడ్ పదవులపై ఇంకా సందిగ్ధతే | Eeroju news

Uncertainty continues over nominated posts

నామినేటెడ్ పదవులపై ఇంకా సందిగ్ధతే విజయవాడ, ఆగస్టు 28 (న్యూస్ పల్స్) Uncertainty continues over nominated posts ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయాన్ని సాధించింది. మంత్రివర్గం ఏర్పడింది. క్యాడర్ అంతా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ల పాటు పడిన కష్టాలను.. కేసులని పదవులు పొందడం ద్వారా మర్చిపోవాలని అనుకుంటున్నారు.  కానీ రోజులు గడిచిపోతున్నాయి … పదవుల పందేరం మాత్రం జరగడం లేదు. ఎప్పుడో రెండు నెలల కిందటే కార్యకర్తల నుంచి అభిప్రాయసేకరణ జరిపారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి పదవుల్లో చాలా కీలకమైనవి ఉన్నాయి. టీటీడీ చైర్మన్.. ఏపీఐఐసీ చైర్మన్ వంటి పదవులకు చాలా ప్రాధాన్యం…

Read More

Volunteer system | వలంటీర్ల వ్యవస్థ పై తాడో పేడో…. | Eeroju news

Volunteer system

వలంటీర్ల వ్యవస్థ పై తాడో పేడో…. విజయవాడ, ఆగస్టు 23, (న్యూస్ పల్స్) Volunteer system ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు దాటుతోంది. ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి టిడిపి కూటమి ప్రజలకు చాలా రకాల హామీలు ఇచ్చింది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ప్రారంభం వంటివి చేపట్టారు. ప్రాధాన్యత క్రమంలో మిగతా హామీలను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తో పాటు మంత్రులు చెబుతున్నారు. అయితే తమను కొనసాగిస్తారని చాలామంది వాలంటీర్లు ఆశించారు. కానీ మూడు నెలలు దాటుతున్న వారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు…

Read More

Changing local calculations | మారిపోతున్న స్థానిక లెక్కలు | Eeroju news

Changing local calculations

మారిపోతున్న స్థానిక  లెక్కలు విజయవాడ, ఆగస్టు 23, (న్యూస్ పల్స్) Changing local calculations విజయవాడలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షద్ ఉన్నారు. వీరంతా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్పొరేటర్లగా ఉన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 64 కార్పొరేటర్‌ స్థానాలు ఉన్నాయి. వీరిలో 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాజీనామాకు ఆమోదం తెలపడంతో.. ప్రస్తుతం 63 మంది కార్పొరేటర్లు మిగిలారు. పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరటంతో… రాబోయే రోజుల్లో మరికొంత మంది కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అదే జరిగితే… బెజడవాడలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే…

Read More

YCP same stand on Rajdhani | రాజధానిపై వైసీపీ సేమ్ స్టాండ్ | Eeroju news

YCP same stand on Rajdhani

రాజధానిపై వైసీపీ సేమ్ స్టాండ్ విజయవాడ, ఆగస్టు 22, (న్యూస్ పల్స్) YCP same stand on Rajdhani ఎన్నికల్లో ఓటమి ఎదురైనా వైసీపీ తీరులో మార్పు రావడం లేదు. ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధిస్తామని వైసిపి ధీమా వ్యక్తం చేసింది. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేశామని.. ప్రజలు ఆశీర్వదిస్తారని భావించింది. కానీ వైసీపీ ఒకటి తలిస్తే.. ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. దారుణ ఓటమిని అంటగట్టారు. అటు మూడు రాజధానులు అంటూ హడావిడి చేసిన ఆ ప్రాంతీయులు సైతం ఆదరించలేదు. పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించినా అక్కడి ప్రజలు ఆహ్వానించలేదు. అయినా సరే వైసిపి తీరు మారడం లేదు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా అదే పల్లవి వీడడం లేదు. తాజాగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా సీనియర్…

Read More